ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టులో బైటపడిన సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడ వ్యభిచార గృహాల నిర్వహకులు చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించిన హైదరాబాద్ ఎస్‌వోటి పోలీసులు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల వరుస దాడులతో వ్యభిచార గృహాల నిర్వహకులు బెంబేలెత్తిపోయారు. దీంతో వారు ఈ పడుపు వృత్తిని మానేస్తున్నట్లు, తమ కాలనీల్లోకి విటులు రావద్దంటూ పోస్టర్లు, ప్లెక్సీలు ముద్రించి అక్కడక్కడా పెట్టారు.  దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 

 యాదగిరి గుట్టలో వ్యభిచార గృహాలు ఎక్కువగా ఉండే గణేష్ నగర్ వంటి ప్రాంతాల్లో తాజాగా కొన్ని పోస్టర్లు,ప్లెక్సీలు వెలిశాయి.  తాము స్వచ్చందంగా పడుపు వృత్తిని  మానేస్తున్నామని దొమ్మర కుల సంఘం పేరుతో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు విటులు ఎవరైనా అసభ్యకరంగా, బలవంతం చేసినా పోలీసులకు అప్పగిస్తామంటూ హెచ్చరికలు కూడా ఈ పోస్టర్లపై కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్టర్లపై కూడా ఇపుడు యాదగిరి గుట్ట ప్రాంతంలో చర్చ జరుగుతోంది.

నిజంగానే ఇక్కడ వ్యభిచారమే వృత్తిగా బ్రతికే కుటుంబాలు పడుపు వృత్తిని మానేశారా? లేక పోలీసుల నుండి తప్పించుకోడానికే ఇలా పోస్టర్ల రూపంలో నాటకాలాడుతున్నారా? అని గుట్ట ప్రజల్లో చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఇలాగే ఈ వృత్తిని మానేస్తూ ఆటోలు నడుపుకుని జీవిస్తున్నామని చెప్పిన కొందరు యువకులు మళ్లీ ఇదే  వృత్తిలో  కొనసాగుతున్నారు. దీంతో వీరిని అంత ఈజీగా నమ్మలేమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే చాలా మంది వ్యభిచార గృహ నిర్వహకులు తమ కుటుంబాలతో సహా యాదగిరి గుట్టను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారి వద్ద ఉన్న చిన్నారులపై పోలీసులకు అనుమానాలున్నాయి. వారిని కూడా ఇలాగే కిడ్నాప్ చేసి తీసుకువచ్చి తమ పిల్లలుగా చెప్పుకుంటూ వ్యభిచారంలోకి దింపడానికి తయారు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసం యాదగిరి గుట్టను వదిలి వెళ్లిన కుటుంబాల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తల కోసం కింది లింక్ లు క్లిక్ చేయండి

యాదాద్రి సెక్స్ రాకెట్... వ్యభిచారుణులనే తల్లులుగా భావిస్తూ రోదిస్తున్న చిన్నారులు

యాదాద్రి సెక్స్ రాకెట్: తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచార గృహాలకు తాళాలు, ఆ కాలనీలన్నీ నిర్మానుష్యం

యాదాద్రి సెక్స్ రాకెట్.... చిన్నారులపై ఎదుగుదల హార్మోన్లను ఉపయోగించి వ్యభిచారం చేయిస్తూ....

యాదాద్రి సెక్స్ రాకెట్... బిడ్డల కోసం పోలీస్ స్టేషన్‌కు తల్లిదండ్రులు