Asianet News TeluguAsianet News Telugu

Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ పై మిశ్రమ స్పందన.. ఇంతకీ పోల్స్ ఫలితాలను విశ్వసించవచ్చా..?

Telangana Exit Polls 2023: ఎగ్జిట్ ఫలితాలపై రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మడంలేదని,  ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు అవుతా ప్రకటిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్‌ పోల్‌కు, ఓపీనియం పోల్‌కు తేడా ఏంటీ? ఈ పోల్స్ ను ఎలా నిర్వహిస్తారు? ఈ పోల్స్ విశ్వసనీయ ఎంత? వాటిని ఎంత వరకు నమ్మెచ్చు ? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Telangana Exit Polls 2023 What are the Differences Between Opinion Poll and Exit Poll? Can the results of those polls be trusted? KRJ
Author
First Published Dec 1, 2023, 8:33 AM IST

Telangana Exit Polls Result 2023: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఇక మిగిలింది ఫలితాలు వెలువడటమే. అయితే.. ఏ పార్టీ గెలుపు బావుటాను  ఎగరవేయనున్నది? ఏ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నది? ఏ పార్టీ పరాజయం పాలవుతుందో ? అనేది డిసెంబరు 3 నాడే డిసైడ్ కానుంది. ఇక ఎన్నికల ఫోలింగ్ పూర్తయినా వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రస్తుతం చర్చనీయంగా మారాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా  బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. నిన్న వెలువబడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుపొందుతుందనీ,  ఇక రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ గెలుస్తుందని చాలా సర్వేలు తేల్చాయి. మరోవైపు మిజోరంలో హంగ్‌ రావచ్చని తెలిపాయి. ఇక  తెలంగాణ ఫలితాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌ను గద్దెదించి.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. 

కాగా.. ఈ ఎగ్జిట్ ఫలితాలపై పార్టీలు భిన్న అభిప్రాయాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మడంలేదని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తామే అధికారంలోకి వస్తామని అధికార పార్టీ ప్రకటించగా.. ఎగ్జిట్ పోల్స్ తో తమ విజయం ఖాయమైపోయిందని, ఇక సంబరాలు ప్రారంభించండని కాంగ్రెస్ పేర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్‌ పోల్‌కు, ఓపీనియం పోల్‌కు తేడా ఏంటీ? ఈ పోల్స్ ను ఎలా నిర్వహిస్తారు? ప్రజానీకం ఎవరికి ఓటు వేశారో ? ఎవరి ప్రభుత్వం ఏర్పాటవుతుందో?  తెలుసుకోవడానికి ఈ పోల్స్‌లో ఎలాంటి ట్రిక్‌ని ఉపయోగించారనేది ప్రశ్న. అలాగే, పోల్స్ విశ్వసనీయ ఎంత? వాటిని ఎంత వరకు నమ్మెచ్చు ? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఓపినియన్ పోల్స్  అంటే ఏమిటి?

ఇదొక ఎన్నికల సర్వే. దీన్ని వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహిస్తాయి. ఎన్నికల ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందు దీన్ని నిర్వహిస్తారు. అంటే.. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, పార్టీల మధ్య పొత్తులు ఏర్పడక ముందు, సీట్ల సర్దుబాటు కాక ముందు, అభ్యర్థులను ప్రకటన చేయకముందు, పోలింగ్ తేదీకి చాలా రోజుల ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు ఈ సర్వే నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను సెలెక్ట్ చేసుకుని ప్రిపోల్స్ నిర్వహిస్తారు. 

ఎలా నిర్వహిస్తారు? 

సర్వే సంస్థలు వివిధ ప్రాంతాలకు వెళ్లి.. ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ఇందులో భాగంగా  వారు ఎంచుకున్న ప్రాంతాల్లో ప్రజల సమస్యలు ఏమిటి? ఈసారి ఎన్నికల్లో ఏ సమస్యలపై పోరాడుతున్నారు? అనే విషయాలపై  ఎన్నికల ముందు ప్రజల అభిప్రాయం ఎలా ఉందో  తెలుసుకోవడానికి, ఎవరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందో తెలుసుకోవడానికి చేసే చిన్న ప్రయత్నం ఇది. నిజానికి ఈ సర్వేలు ఏ ఒక్క అభిప్రాయంపై ఆధారపడి ఉండవు.

ఇందులో సర్వే నమూనా చాలా ముఖ్యం. అంటే.. అసెంబ్లీలో 4 లక్షల ఓట్లు ఉంటే.. వారు 10 వేలు నుంచి 20 వేల మందితో మాట్లాడతారు. ఈ సంఖ్యను నమూనా పరిమాణం అంటారు. ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులు ఈ నమూనా పరిమాణంలో చేర్చబడ్డారు. ఇందులో గ్రామీణ, పట్టణ, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ఇలా సమాజంలోని ప్రతి వర్గం అభిప్రాయాన్ని తెలుసుకుని, వారి అభిప్రాయాలను విశ్లేషించారు. వారు విశ్లేషించిన సమాచారం ప్రకారం ఓ సమాచారాన్ని తయారు చేస్తారు. ఆ డేటా ఆధారంగానే  ఫలితాలను వెల్లడిస్తారు. ఇలా సేకరించిన సమాచారం ఆధారంగా ఏ పార్టీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయో తెలియజేస్తారు. అయితే.. ఇలా వెల్లడించిన ఫలితాలు కొన్ని సందర్బాల్లో నిజం కావొచ్చు? లేదా తలకిందులు కావొచ్చు?  

ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?

ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. పోలింగ్ రోజే లేదా ఓటింగ్ జరిగేటప్పుడు ఓటరు మనోగతం తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తారు. ఎన్నికల్లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు కొన్ని స్పెషల్ ఏజెన్సీలు ప్రత్యేకంగా ఎంచుకున్న పోలింగ్ కేంద్రాల్లో ఈ సర్వే నిర్వహిస్తారు. ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే.. ఆయా సంస్థల ప్రతినిధులు.. ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈ క్రమంలో సర్వే సంస్థలు కొన్ని ప్రశ్నలు సంధించి.. వాటి సమాధానాల ద్వారా  ప్రజల నాడీ ఎలా ఉంది?  ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయో? తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది ముందే నిర్ణయించుకుంటారు. కానీ ఎగ్జిట్‌పోల్‌లో అలా కాదు. పోలింగ్ రోజే.. ఓటింగ్‌లో పాల్గొన్నవారినే ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.
  
ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితత్వం ఎంత ?

ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే..  ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఎగ్జిట్ పోల్ అంచనాలు .. ఎన్నికల ఫలితాలకు దాదాపు దగ్గరగానే ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సర్వే జరుగుతోంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది? ఈ సర్వేను ఎంత పకడ్బందీగా నిర్వహించారనేది చాలా ముఖ్యం. ఎంత విస్తృతంగా సర్వే నిర్వహిస్తే.. అంతా కచ్చితమైనా ఫలితాలు వస్తాయి. 
 
నిన్న వెలువబడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుపొందుతుందనీ,  ఇక రాజస్థాన్‌లో, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ గెలుస్తుందని చాలా సర్వేలు తేల్చాయి. మరోవైపు మిజోరంలో హంగ్‌ రావచ్చని తెలిపాయి. ఇక  తెలంగాణ ఫలితాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌ను గద్దెదించి.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. 

పెరిగి పోలింగ్ శాతం

కాగా.. తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5-30 ప్రాంతంలో వెలువడ్డాయి. కాగా.. అప్పటికి  రాష్ట్రంలో నమోదైన పోలింగ్  64.14 శాతమే. ఇంకా.. అప్పటికే చాలా చోట్ల ఓటర్లు భారీగా క్యూ లైన్లో ఉన్నారు. ఫైనల్ ఓటింగ్ ముగిసే నాటికి  70.18 శాతం పోలింగ్ నమోదైంది. అంటే.. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయంలో నమోదైన పోలింగ్ శాతానికి, ఫైనల్ గా నమోదైన పోలింగ్ శాతానికి చాలా తేడా ఉంది. ఈ అంశం కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రభావం చూపుతోంది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే. అయితే.. ఆ వ్యతిరేక ఓటింగ్ ఏ పార్టీకి ఎంత మేర షేర్ అయ్యిందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే.. ఈ ఎగ్జిట్ పోల్స్  అంచనాల్లో ఎంత వరకు విశ్వసనీయత ఉందో.. డిసెంబర్ 3 (రిజల్స్ డే) వరకు వేచిచూడాల్సిందే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios