Asianet News TeluguAsianet News Telugu

మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. రట్టు చేసిన పోలీసులు..!

 ఓ ప్రముఖ మీడియా సంస్థ  చేసిన  స్టింగ్ ఆపరేషన్‌లో మసాజ్ సెంటర్ నిర్వాహకులు అడ్డంగా బుక్కయ్యారు. 

police burst sex Rocket in massage center
Author
Hyderabad, First Published Aug 30, 2021, 9:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేపీహెచ్‌బీలో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ  చేసిన  స్టింగ్ ఆపరేషన్‌లో మసాజ్ సెంటర్ నిర్వాహకులు అడ్డంగా బుక్కయ్యారు. మీడియా నిఘాకు ఐదుగురు యువతులు, ఇద్దరు యువకులు దొరికారు. కేపీహెచ్‌బీ పోలీసులు మీడియా సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. 

వారు చేసిన దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలడంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నామని.. వారిలో ఇద్దరు యువతులు ఉన్నారని పోలీసులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios