కుమారుడికి ఉద్యోగం రాలేదని సూసైడ్ అటెంప్ట్.. ఆస్పత్రిలో చేరి, కోలుకున్నా.. బిల్లు కట్టలేక తిరిగి ఆత్మహత్య..
ఆస్పత్రి బిల్లు కట్టలేక.. ఆత్మహత్యాయత్నంచేసి కోలుకున్న ఓ వ్యక్తి తిరిగి ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది.
భూపాలపల్లి : కుమారుడికి job రాక.. Hospital bill చెల్లించలేక.. జీవితంపై విరక్తి చెంది దవాఖానాలోనే ఉరి వేసుకుని ఓ భూనిర్వాసితుడు suicide చేసుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన Jayashankar Bhupalapalli జిల్లాలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. 2006లో చెల్పూరులో KTPP నిర్మాణంతో భూపాలపల్లి మండలం మహబూబ్ పల్లికి చెందిన మర్రి బాపు (46)తన రెండెకరాల భూమిని కోల్పోయారు. అప్పట్లో ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని జెన్ కో యాజమాన్యం చెప్పడంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేగొండ మండలం పొనగల్లుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా కేటీపీపీ అధికారుల వద్దకు వెళ్లి తన కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని మొర పెట్టుకునేవారు.
విసిగిపోయిన బాపు మార్చి 30, 31 తేదీల్లో కేటీపీపీ వద్దకు వెళ్లి రెండ్రోజులున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఈ నెల 1న కేటీపీపీ ముఖద్వారం వద్దే పురుగుల మందు తాగారు. సెక్యురిటీ సిబ్బంది వెంటనే భూపాలపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కోలుకున్నారు. తర్వాత రూ. 60 వేల బిల్లు చెల్లించాలని ఆసుపత్రి నిర్వాహకులు కేటీపీపీ సిబ్బందిని అడిగారు. వారు స్పందించకపోవడంతో బాపు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జి చేస్తామనడంతో బాబు కుటుంబ సభ్యులు డబ్బుల కోసం వెళ్లారు. మూడు రోజులైనా తిరిగి ఎవరూ రాకపోవడంతో కుంగిపోయిన బాపు గురువారం ఉదయం ఆసుపత్రి వార్డ్ లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని వివిధ పార్టీల నాయకులు ధర్నా చేశారు.
డబ్బులు ఎక్కడా దొరకలేదు... మృతుని కుమారుడు
డబ్బులు లేక పోవడంతో నాన్నను దక్కించుకోలేకపోయాం అని మృతుని కుమారుడు మర్రి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2006లో మా భూమిని కేటీపీపీ జెన్ కో సంస్థ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి మా నాన్న నాకు ఉద్యోగం ఇప్పించేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర నిర్వాసితులకు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరని నాన్న ఇటీవల ఓ ఉన్నతాధికారి అడిగితే ఆయన దూషించి బయటకు పంపించారు. మనస్థాపానికి గురైన నాన్న పురుగుల మందు తాగాడు. మాది పేద కుటుంబం. ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు డబ్బులు ఎక్కడా దొరకలేదు. ఈలోపే నాన్న ఆత్మహత్య చేసుకున్నారు... అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఒక ఇద్దరూ అప్పటికే పూటుగా liquor తాగారు. ఒళ్లు స్వాధీనంలో లేని స్థితికి చేరుకున్నారు. దీంతో సమాచారం అడిగిన ఓ వ్యక్తిపై attack చేశారు. అతని జేబులో నుంచి పడిన రూ.300, సెల్ఫోన్ కోసం అతడిని దారుణంగా బండరాయితో మోది murder చేశారు. ఈ సంఘటన గత నెల 25న హైదరాబాద్ లోని శంకర్ పల్లిలోని వడ్డెర స్మశానవాటికలో జరిగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్కు తరలించారు. శంకర్పల్లి సిఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మెట్పల్లికి చెందిన సాయిలు(35), మల్లేష్ (45) అన్నదమ్ములు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్నారు. శంకర్ పల్లిలో నివాసముండే మల్లేష్ వద్దకు గత నెల 25న సాయిలు వచ్చాడు.
ఇద్దరూ కలిసి మద్యం తాగారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, చెరుకుపల్లికి చెందిన చెన్నయ్య (55) ఏదో సమాచారం కోసం వీరితో మాట్లాడాడు. వీళ్లు తాగిన మైకంలో అతడిని అకారణంగా కొట్టారు. ఆ సమయంలో చెన్నయ్య జేబులో నుంచి రూ.300, ఫోను కిందపడగా.. వాటిని సాయిలు, మల్లేష్ చూశారు. చెన్నయ్య వాటిని తీసుకొని వెళ్ళాడు. అతడిని వెంబడించి.. వెనక నుండి గట్టిగా పట్టుకుని.. స్మశానవాటికలో కి తీసుకువెళ్లి.. బండరాయితో మోది హత్య చేశారు. ఆ తర్వాత రూ. 300, ఫోన్ తీసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.