Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిలా హస్కీ వాయిస్ తో రెచ్చగొట్టి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయించి.. ఆపై బ్లాక్ మెయిల్...

ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు lady voiceతో మాట్లాడారు. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా ఉన్న ఫొటోస్ పంపి ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్స్అప్ వీడియో కాల్ చేయించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే... యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. 

Cyber fraudsters record nude video call for a man and blackmails in hyderabad
Author
Hyderabad, First Published Nov 16, 2021, 11:52 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హిమాయత్ నగర్ : అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్ వీడియో కాల్ చేయించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు 
Cybercriminals.. క్యాప్చర్ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్సలు వసూలు చేయడంతో బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని సోమవారం ఆశ్రయించాడు. 

ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు lady voiceతో మాట్లాడారు. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా ఉన్న ఫొటోస్ పంపి ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్స్అప్ వీడియో కాల్ చేయించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే... యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. 

ఆ తరువాత యువకుడి వీడియోను రికార్డ్ చేశారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ nude videoను వాట్స్అప్ గ్రూపులో షేర్ చేయడంతోపాటు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా ఈ యువకుడు పలు దఫాలుగా ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు పంపాడు. 

ప్రేయసికి క్షుద్రపూజలు చేయించిందని సొంత అక్కపై అనుమానం.. చివరికి..

ఎంత పంపిన తీసుకుంటున్నారు కానీ వీడియోను social media నుంచి డిలీట్ చేయడం లేదు. పైగా మరి కొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.

టెలీకాలర్ కు న్యూడ్ వీడియో కాల్స్ తో వేధింపులు...
కాగా ఇలాంటి ఓ ఘటనే గత మార్చిలో ఒకటి సికింద్రాబాద్ లో కలకలం రేపింది. ఈ ఘటన ఓ టెలీకాలర్ ను తీవ్రమానసిక వేదనకు గురిచేసింది. వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో పాటు న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన నిందితుడిని చివరకు సిటీ సైబర్ క్రైం పోలీసులు రంగ ప్రవేశం చేసి పట్టుకున్నారు. 

సీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన మేరకు..  ఉత్తర మండల పరిధిలోని సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్‌ సంస్థలో టెలీకాలర్‌గా పని చేస్తోంది. తన వృత్తిలో భాగంగా  రోజూ అనేక మందితో ఆఫీస్ ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడుతుంది. ఇలాంటి ఉద్యోగలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ 
Personal phone numbers నుంచి కాల్స్ చేయకూడదు, కస్టమర్లకు ఇవ్వకూడదు. 

ఈ విషయాన్ని ఆమె మర్చిపోయింది.. ఛత్రినాకకు చెందిన చంద్రవేగ్‌కు అందర్లాగే ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అతను తను ఆ సంస్థ కస్టమర్ గా మారతానని కాకపోతే కాస్త టైం కావాలని అన్నాడు. అంతటితో ఆగకుండా తన ఆన్సర్ చెప్పడం కోసం పర్సనల్ నెం. ఉంటే ఇవ్వమని అడిగాడు. ఆమె తన నెం. ఇచ్చింది. 

అంతే ఆ తరువాతి నుండి ఆమెకు Harassmentలు మొదలయ్యాయి. ప్రైవేట్ ఉద్యోగి అయిన చంద్రవేగ్ ఆమెను రకరకాలుగా వేధించడం మొదలెట్టాడు. అర్థరాత్రి ఫోన్స్ చేయడం, మెసేజ్ లు పంపడం చేసేవాడు. ఈ మధ్య మరో అడుగు ముందుకు వేసి Nude video calls చేయడం మొదలుపెట్టాడు.

దీంతో బెంబేలెత్తిన సదరు యువతి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడు చంద్రవేగ్ ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios