తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad district) దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి (acid attack) పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad district) దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి (acid attack) పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలోని ఉట్నూరు (utnoor) మండలం లక్కారం పరిధిలోని కేబీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళపై యాసిడ్ పోసిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా స్థానికులు తెలిపారు. యాసిడ్ దాడి జరిగిన వెంటనే బాధిత మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. అయితే బాధిత మహిళపై యాసిడ్ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
