Asianet News TeluguAsianet News Telugu

న్యూ ఇయర్ స్పెషల్ గా స్యామ్సంగ్ గెలాక్సీ కొత్త ఫోన్.. గ్రేట్ డిజైన్, బెస్ట్ ఫీచర్లు అతితక్కువ ధరకే..

ఒక నివేదిక ప్రకారం, స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 జనవరి మొదటి వారంలోనే ప్రవేశపెట్టవచ్చు. దీనితో పాటు ఫోన్‌ను 8 వేల లోపు ధరతో విడుదల చేయనున్నట్లు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. నివేదిక ప్రకారం, ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించబడుతుంది.

Samsung Galaxy F04 phone will be launched in new year, its design and features will also be great
Author
First Published Dec 29, 2022, 5:20 PM IST

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్  కొత్త బడ్జెట్ ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04ని ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ను  వచ్చే ఏడాది జనవరి 2023లో లాంచ్ చేయవచ్చు. అయితే లాంచ్ ముందే ఈ  బడ్జెట్ ఫోన్ టీజర్ ఇమేజ్ లీక్ అయింది. లీక్ ప్రకారం, ఫోన్ రెండు కలర్స్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. ఈ ఫోన్ గెలాక్సీ ఏ04ఇకి రీ-బ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ చేయబడుతుందని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 ధర 
ఒక నివేదిక ప్రకారం, స్యామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 జనవరి మొదటి వారంలోనే ప్రవేశపెట్టవచ్చు. దీనితో పాటు ఫోన్‌ను 8 వేల లోపు ధరతో విడుదల చేయనున్నట్లు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. నివేదిక ప్రకారం, ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించబడుతుంది ఇంకా దీని ప్రారంభ ధర రూ. 7,499. ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే 8 జి‌బి (4 జి‌బి ఫిజికల్ ర్యామ్ + 4 జి‌బి వర్చువల్ ర్యామ్) వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ పొందుతుంది. ఈ ఫోన్ పర్పుల్ ఇంకా గ్రీన్ అనే రెండు కలర్స్ లో వస్తుంది. 

స్పెసిఫికేషన్లు
స్యామ్సంగ్ గెలాక్సీ F04 ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే 6.5-అంగుళాల డిస్ ప్లే ఇంకా HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఫోన్ వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్‌లో అందించబడుతుంది, ఇందులో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఇంకా ఎల్‌ఈ‌డి ఫ్లాష్‌లైట్ సపోర్ట్ ఫోన్‌తో లభిస్తుంది.

 బ్యాటరీ లైఫ్ 
స్యామ్సంగ్ గెలాక్సీ F04తో ఆక్టా కోర్ ప్రాసెసింగ్ పవర్, 128 జి‌బి వరకు స్టోరేజ్ పొందవచ్చు. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 1 టి‌బి వరకు పెంచుకోవచ్చు. ఫోన్  బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే బిగ్ 5,000 mAh బ్యాటరీతో రాబోతోంది, ఇంకా టైప్-సి పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం డ్యూయల్ 4G సిమ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ వెర్షన్ 5.0, 3.5ఎం‌ఎం ఆడియో జాక్ సపోర్ట్ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios