నేను వారానికి 85-90 గంటలు..: ఒక ఇంటర్వ్యూలో కంపెనీ సీఈఓ

పేదరికం నుంచి బయటపడాలంటే కష్టపడి పనిచేయడమే మార్గమని ఈ విషయం అతడి తల్లిదండ్రులే నేర్పారు అని అన్నారు. నా  40-ప్లస్ సంవత్సరాల వృత్తి జీవితంలో, నేను వారానికి 70 గంటలు పనిచేశాను" అని అతను పునరుద్ఘాటించాడు. 

Narayana Murthy now says he worked 85-90 hours: But is it really productive?-SAK

 ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ కంపెనీని స్థాపించేటప్పుడు తాను వారానికి 70 గంటలు పనిచేశానని, భారతీయ యువకులు వారానికి కనీసం 70 గంటలు పని చేయాలని సూచించారు. దీనికి సంబంధించి 1994 వరకు తాను వారానికి 85 నుండి 90 గంటల కంటే ఎక్కువగా పనిచేశానని ఒక న్యూస్ పత్రికతో చెప్పారు.

"నేను ఉదయం 6:20 గంటలకు ఆఫీసులో ఉంటాను, రాత్రి 8:30 గంటలకు ఆఫీసు నుండి బయలుదేరుతాను, వారానికి ఆరు రోజులు పనిచేశాను" అని అతను  ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.  

పేదరికం నుంచి బయటపడాలంటే కష్టపడి పనిచేయడమే మార్గమని ఈ విషయం అతడి తల్లిదండ్రులే నేర్పారు అని అన్నారు. 

నా  40-ప్లస్ సంవత్సరాల వృత్తి జీవితంలో, నేను వారానికి 70 గంటలు పనిచేశాను" అని అతను పునరుద్ఘాటించాడు. 

అక్టోబర్‌లో నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్‌తో మాట్లాడుతూ చైనా అండ్  జపాన్‌లతో పోటీ పడాలంటే భారతదేశం తన పని ఉత్పాదకతను పెంచుకోవాలి అని అన్నారు. 

వారంలో  4 రోజుల పని  ఆలోచన భారతదేశంలో కూడా క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. ఉదాహరణకు, రోజుకు 12 గంటలు పనిచేసే ఉద్యోగి వారానికి మూడు రోజులు టేకాఫ్‌కు అనుమతించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది.

Sora News 24 నివేదించినట్లుగా , మైక్రోసాఫ్ట్ జపాన్ ఆగస్టు 2019లో ఒక ట్రయల్‌ను నిర్వహించింది, దీనిలో ఉద్యోగులకు ప్రతి శుక్రవారం పెయిడ్  హాలిడే ఇచ్చింది. దీంతో ఉత్పాదకత భారీగా పెరిగింది.  

భారతీయ వ్యాపారవేత్త అండ్  చలనచిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌లో మూర్తి అభిప్రాయాన్ని ప్రతిఘటిస్తూ, "ఉత్పాదకతను పెంచడం అంటే ఎక్కువ గంటలు పని చేయడం మాత్రమే కాదు. మీరు చేసే పనిలో మెరుగ్గా ఉండటం - అప్‌స్కిల్లింగ్, సానుకూల పని వాతావరణంతో  ఉండటం అని అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios