వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..
కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మీ నంబర్ ని వాట్సాప్‌లో బ్లాక్ చేస్తుంటారు. బ్లాక్ చేసినట్లు మీకు కూడా తెలియదు. బ్లాక్ స్టేటాస్ ఎలా తెలుసుకోవాలో కొన్ని టిప్స్ ఉన్నాయి.
ఈ రోజుల్లో దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌లో తెలియని లేదా ఆన్ నౌన్ కాంటాక్ట్‌లను బ్లాక్ చేసే ఆప్షన్‌తో సహా యూజర్ అవసరాన్ని అలాగే సౌకర్యాన్ని బట్టి ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు మిమ్మల్ని ఎవరైనా కొన్ని కారణాల వల్ల బ్లాక్ చేస్తుంటారు, అది మీకు కూడా తెలియదు. మిమ్మల్ని మీరు అన్‌బ్లాక్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేనప్పటికీ, బ్లాక్ స్టేటస్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త మీకోసమే. బ్లాక్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో కొన్ని సులభమైన స్టెప్స్ మీకోసం..
టిప్ నం. 1- లాస్ట్ సీన్ / ఆన్‌లైన్ స్టేటస్
మీరు ఎవరిదైనా లాస్ట్ సీన్ / ఆన్‌లైన్ స్టేటస్ చూడలేకపోతే ఆ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు. , అయితే బ్లాక్ చేయబడిందా లేదా అనే ఖచ్చితంగ నిర్ధారించలేము.
టిప్ నం. 2- ప్రొఫైల్ ఫోటో
మీరు ఎవరిదైనా లాస్ట్ సీన్ / ఆన్‌లైన్ స్టేటస్ చూడలేకపోతే, ఆ వినియోగదారు ప్రొఫైల్ ఫోటో చూడండి, ప్రొఫైల్ ఫోటో చూపెట్టకపోతే మీరు బ్లాక్ చేయబడి ఉండవచ్చు. యూజర్ ప్రొఫైల్ ఫోటో తీసివేసినపుడు కూడా ఒకోసారి ఇలా జరగవచ్చు కానీ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
టిప్ నం. 3- మెసేజ్ స్టేటస్ చెక్ చేయండి
మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారని మీరు అనుమానించినట్లయితే మీరు ఆ నంబర్‌కు మెసేజ్ పంపవచ్చు. మెసేజ్ డెలివరీ కాకపోతే, దానికి రెండు అర్థాలు ఉంటాయి. మొదటిది మీరు బ్లాక్ చేయబడటం, రెండవది యూజర్ ఇంటర్నెట్ డౌన్ కావడం. ఇప్పుడు మీ మెసేజ్ రెండు-మూడు రోజుల్లో డెలివరీ కాకపోతే, ఆ యూజర్ మిమ్మల్ని బ్లాక్ చేసారు అని.
టిప్ నం. 4- కాల్ చేయడం
మీరు బ్లాక్ చేయబడినట్లు మీ అనుమానం ఉంటే మీరు ఆ నంబర్‌కు వాట్సాప్ కాల్ చేయవచ్చు. మీరు బ్లాక్ చేయబడితే మీ కాల్ కనెక్ట్ కాదు అలాగే మీకు WhatsAppలో కాలింగ్ ఆప్షన్ కనిపించదు.
టిప్ నం. 5- వాట్సాప్ గ్రూప్
బ్లాక్ స్టేటస్ తెలుసుకోవడానికి మీరు WhatsApp గ్రూప్ క్రియేట్ చేయండి. తరువాత గ్రూప్ లోకి వారి నంబర్ యాడ్ చేయడానికి ట్రై చేసినపుడు "you are not authorized to add this contact" అనే మెసేజ్ మీరు చూసినట్లయితే మీరు బ్లాక్ చేయబడే అవకాశం ఉంది.