మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే ఫోన్ పే, గూగుల్ పేని డీ-యాక్టివేట్ చేయడం ఎలా.. ?
సాధారణంగా మనం ఏదైనా కొనుగోళ్ల కోసం డిజిటల్ పేమెంట్‌ని ఆశ్రయిస్తాం, ఎందుకంటే మొబైల్ ఉపయోగించి UPI పేమెంట్ చేయడం సులభం. UPI పేమెంట్ ఆప్షన్ తో మీ జేబులో క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపుగా తగ్గిపోతుంది.
కోవిడ్-19 వ్యాప్తి తర్వాత డిజిటల్ పేమెంట్ ట్రెండ్ (UPI) వేగంగా పెరిగింది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ నే ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ టచ్ లెస్ లావాదేవీలు చేయడంలో సహాయపడ్డాయి. అప్పటి నుంచి డిజిటల్ పేమెంట్లు ఊపందుకున్నాయి. సాధారణంగా మనం ఏదైనా కొనుగోళ్ల కోసం డిజిటల్ పేమెంట్‌ని ఆశ్రయిస్తాం, ఎందుకంటే మొబైల్ ఉపయోగించి UPI పేమెంట్ చేయడం సులభం. UPI పేమెంట్ ఆప్షన్ తో మీ జేబులో క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరం దాదాపుగా తగ్గిపోతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌తో మీరు మాల్స్ నుండి చిన్న కిరాణా స్టోర్స్ వరకు షాపింగ్ చేయవచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఎక్కడైన పోయినట్లయితే మీ బ్యాంక్ అక్కౌంట్ కూడా ఖాళీ కావోచ్చు. మీ ఫోన్ ఎవరైనా దొంగిలించిన లేదా పోయినా మీరు UPI అక్కౌంట్ సులభంగా డీ-యాక్టివేట్ చేయవచ్చు. అయితే అది ఎలా అంటే..
UPIని డీ-యాక్టివేట్ చేయలంటే
1. మీ ఫోన్ దొంగిలించిన లేదా పోగొట్టుకున్నప్పుడు ముందుగా మీ మొబైల్ నెట్‌వర్క్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు కాల్ చేసి మీ మొబైల్ నంబర్ అండ్ సిమ్‌ను వెంటనే బ్లాక్ చేయమని అడగండి. ఎందుకంటే మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి UPI పిన్‌ను జనరేట్ చేయడాన్ని నిరోధిస్తుంది.
2. సిమ్‌ను బ్లాక్ చేయడానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీ పూర్తి పేరు, బిల్లింగ్ అడ్రస్, చివరి రీఛార్జ్ వివరాలు, ఇమెయిల్ ఐడి మొదలైన వివరాలను అడగవచ్చు.
3. తర్వాత, మీరు మీ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి మీ బ్యాంక్ అక్కౌంట్ ను బ్లాక్ చేయమని అలాగే UPI సేవలను నిలిపివేయమని అడగండి.
4. దీని తర్వాత మీరు పోగొట్టుకున్న ఫోన్ కోసం ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసుకోవాలి, దీన్ని ఉపయోగించి మీరు మీ సిమ్, బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభించవచ్చు.