ఈ గొప్ప స్మార్ట్‌ఫోన్‌లు న్యూ ఇయర్ లో లాంచ్ కానున్నాయి, కొనాలని ప్లాన్ చేస్తుంటే ఒక లుక్కెయండి..

కొత్త సంవత్సరంలో అంటే జనవరి 2023లో కూడా చాలా స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఐకూ 11 5జి కూడా జనవరి 2023లో ప్రారంభించబడుతుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోందని కంపెనీ పేర్కొంది.  

hese great smartphones will be launched in the new year, if you are planning to buy then checkout

ఈ ఏడాది భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా గొప్ప స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. రియల్ మీ 10 ప్రొ సిరీస్, లావా ఎక్స్3 అండ్ ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా 5జితో సహా ఎన్నో గొప్ప స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్‌లో కూడా ప్రవేశపెట్టారు. కొత్త సంవత్సరంలో అంటే జనవరి 2023లో కూడా చాలా స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఐకూ 11 5జి కూడా జనవరి 2023లో ప్రారంభించబడుతుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉండబోతోందని కంపెనీ పేర్కొంది.  వివో ఎక్స్ 11 సిరీస్ జనవరిలోనే ప్రారంభించబడుతుంది. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే  కొత్త సంవత్సరంలో  ఇండియాలో లాంచ్ చేయబోయే అత్యుత్తమ అండ్ ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌ల గురించి  తెలుసుకుందాం...

ఐకూ 11 సిరీస్
ఐకూ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇండియాలో 10 జనవరి 2023న రానుంది. క్వాల్ కం ఫాస్టెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో ఫోన్ అందించనున్నారు. ఈ ఫోన్‌తో Quad హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే, 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇంకా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సపోర్ట్ పొందుతుంది. 12 జి‌బి వరకు LPDDR5x ర్యామ్ తో 512 జి‌బి వరకు UFS 4.0 స్టోరేజ్  అందించారు. ఐకూ 11 5జి 5,000 mAh బ్యాటరీ పొందుతుంది, ఇంకా 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

రెడ్ మీ నోట్ 12 5జి 
రెడ్ మీ  ఈ 5జి ఫోన్ జనవరి 5న ప్రారంభించబడుతుంది. కంపెనీ ప్రకారం ఫోన్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో  వస్తుంది.  సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్‌, హై రిఫ్రెష్ రేట్ ఫోన్‌తో  ఉంటుంది. రెడ్ మీ నోట్ 12 5జితో 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా 48ఎం‌పి  ప్రైమరీ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ తాజా చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.

రియల్ మీ జి‌టి నియో 5
రియల్ మీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్ మీ జి‌టి నియో 5 కూడా జనవరిలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ప్రో వేరియంట్‌తో 240W ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. లీక్‌ల ప్రకారం, రియల్ మీ జి‌టి నియో 5 స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్, 16జి‌బి  LPDDR5 ర్యామ్‌తో పాటు 256జి‌బి  UFS 3.1 స్టోరేజ్‌తో అందించబడుతుంది. ఫోన్ సోనీ IMX890 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరాను పొందుతుంది, ఇంకా OIS సపోర్ట్ తో వస్తుంది. ఈ  ఫోన్ ప్రో వేరియంట్‌లో 4,600 mAh బ్యాటరీ, 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రియల్ మీ జి‌టి నియో 5లో 5000 mAh బ్యాటరీ, 150 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 

మోటో ఎక్స్ 40
మోటో ఎక్స్40 తాజాగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. జనవరిలో మాత్రమే ఈ ఫోన్ ఇండియాలో ప్రవేశపెట్టబడుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఫోన్ చైనీస్ వేరియంట్‌లో 165 Hz రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లేతో  ఉంటుంది. ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఫోన్‌తో గరిష్టంగా 12జి‌బి ర్యామ్, 512జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్ గరిష్టంగా 12జి‌బి వరకు LPPDR5x ర్యామ్, 512జి‌బి వరకు UFS 4.0 స్టోరేజ్‌ సపోర్ట్ ఉంది. మోటో ఎక్స్ 40 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4,600mAh బ్యాటరీ ఉంది.

వివో ఎక్స్90 సిరీస్
వివో ఎక్స్90, ఎక్స్90 ప్రొ, ఎక్స్90 ప్రొ ప్లస్ ఈ వివో ఫోన్‌ సిరీస్‌లో ప్రారంభించబడతాయి. ఈ సిరీస్ తాజాగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. వివో ఎక్స్90 ప్రొ ప్లస్ అత్యంత శక్తివంతమైన Android ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2తో వస్తుంది. ఫోన్ 12 జి‌బి ర్యామ్ తో 512 జి‌బి స్టోరేజీ ఉంది.  120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన గొప్ప AMOLED డిస్‌ప్లేను ఫోన్‌తో సపోర్ట్ చేయవచ్చు. 4,810mAh బ్యాటరీ ఇంకా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫోన్‌తో ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios