Best Smartphones: రూ.5 వేలలోపు అదిరిపోయే ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి..!
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల నుంచి అనేక సెగ్మంట్లలో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. హై బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కంటే మిడిల్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల నుంచి అనేక సెగ్మంట్లలో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. హై బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కంటే మిడిల్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. హైఎండ్ ఫీచర్ల మాదిరిగానే బేసిక్ ఫీచర్లతో కూడా చాలా స్మార్ట్ ఫోన్లు అట్రాక్టివ్ గా నిలుస్తున్నాయి. చాలావరకు బేసిక్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లలో 4G కనెక్టవిటీతో పాటు డిసెంట్ డిస్ ప్లే, రియర్ కెమెరాలు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు, దాదాపు ప్రధాన ఆండ్రాయిడ్ యాప్స్ కు సపోర్టు చేసేవే ఎక్కువగా ఉన్నాయి.
భారత మార్కెట్లో అనేక బేసిక్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. అందులో రూ. 5 వేలలోపు స్మార్ట్ ఫోన్ల బెస్ట్ ఆప్షన్లతో యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇదే బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఫోన్ల జాబితా మీకోసమే.. ఓసారి ఏయే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో లుక్కేయండి..!
Jio Phone Next
జియో ఫోన్ నెక్స్ట్ (Reliance Jio Phone Next).. భారత మార్కెట్లోకి 4G సపోర్టుతో వచ్చిన లేటెస్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి.. Jio, Google భాగస్వామ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. Qualcomn Snapdragon QM215 ప్రాసెసర్, Pragati OSతో రన్ అవుతుంది. 5.45 అంగుళాల డిస్‌ప్లే HD+ LCD డిస్‌ప్లేతో వచ్చింది. కెమెరాల విషయానికి వస్తే.. 13MP రియర్ కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా (ఫ్రంట్) ఉన్నాయి. జియో ఫోన్ నెక్స్ట్‌లో 3500mAh బ్యాటరీతో పాటు micro USB ఛార్జర్ అందిస్తోంది. అలాగే 2GB RAM, 32GB ఆన్ బోర్డ్ స్టోరేజీని జియో ఆఫర్ చేస్తోంది.
Samsung M01 Core
ఈ స్మార్ట్ ఫోన్ Android GO ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రన్ అవుతుంది. 5.3 అంగుళాల HD+ డిస్ ప్లేతో వచ్చింది. MediaTek MT6739 SoC, 2GB RAM, 32GB స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ 8MP మెయిన్ కెమెరా, 5MP సెల్ఫీల కోసం వినియోగించుకోవచ్చు. 3000mAh బ్యాటరీతో పాటు ఆండ్రాయిడ్ 10 Go Edition ఆధారంగా రన్ అవుతుంది.
Lava Z1S
Lava Z1S బడ్జెట్‌లో 4G సపోర్టును అందిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ట్రేడేషన్ డిజైన్‌తో ఈ Lava Z1S స్మార్ట్ ఫోన్ వచ్చింది. 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ Unisoc SC9863 చిప్‌సెట్ అమర్చారు. 2GB RAM, 16GB స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్‌లో 5-MP వెనుక కెమెరా ముందు భాగంలో సెల్ఫీల కోసం 5-MP కెమెరా ఉన్నాయి. ఈ రెండు కెమెరాలు LED ఫ్లాష్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. Lava Z1S 3100mAh సామర్థ్యంతో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
Gionee Max
Gionee Max స్మార్ట్ ఫోన్.. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఇతర స్మార్ట్ ఫోన్లలో కంటే ఇదే పెద్దది. 6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వచ్చింది.ఈ ఫోన్ Unisoc SC9863A చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 2GB RAM, 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వచ్చింది. సెల్ఫీల కోసం 13-MP వెనుక కెమెరా, 5-MP కెమెరా ఉన్నాయి. Gionee Max ఆండ్రాయిడ్ 10 రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ 4G సపోర్ట్‌ని అందిస్తుంది.
Redmi Go
Samsung M01 Core మాదిరిగానే.. Redmi Go ఆండ్రాయిడ్ డౌన్ వెర్షన్‌ను అందిస్తోంది. 137 గ్రాముల బరువున్న ఈ డివైజ్ 720×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 5-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. గరిష్టంగా 1GB RAM, 8GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మైక్రో SD ద్వారా ఈ స్టోరేజీని పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికొస్తే.. సెల్ఫీల కోసం 8-MP ప్రధాన కెమెరా 5-MP సెన్సార్‌ను అందిస్తుంది. Redmi Go 3000mAh బ్యాటరీతో 4G కనెక్టివిటీని అందిస్తుంది.