ఆపిల్ ల్యాప్‌టాప్‌ల నిలిపివేత.. వీటిని 2021లో లాంచ్.. అసలు కారణం ఏంటంటే..?

ఆపిల్ వీటిని భారతదేశంలోని ఆన్‌లైన్ స్టోర్ నుండి కూడా తీసివేసింది, అయితే మీకు కావాలంటే M1 Pro అండ్ M1 Max చిప్‌సెట్‌లతో MacBooksని కొనుగోలు చేయవచ్చు. క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఇంకా ఇమాజిన్ స్టోర్ వంటి రిటైల్ స్టోర్‌ల నుండి స్టాక్‌లు ముగిసే వరకు ఇవి అమ్మకానికి ఉంటాయి. 

Apple has discontinued these two laptops, they were launched only in 2021

టెక్ దిగ్గజం ఆపిల్  రెండు మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను నిలిపివేసింది. వీటిలో మ్యాక్‌బుక్ ప్రొ 14-అంగుళాల ఇంకా 16-అంగుళాల మోడల్‌లు ఉన్నాయి. M1 Pro అండ్ M1 Max చిప్‌సెట్‌లు ఈ రెండింటిలో  అందించారు. ఈ రెండు చిప్‌సెట్‌లు ఈ ల్యాప్‌టాప్‌లతో 2021లో ప్రవేశపెట్టారు. సింపుల్ గా చెప్పాలంటే, ఆపిల్ M1 ప్రో అండ్ M1 మ్యాక్స్ చిప్‌సెట్‌లతో కూడిన మ్యాక్‌బుక్స్ సేల్స్ నిలిపివేసింది. 

ఆపిల్ వీటిని భారతదేశంలోని ఆన్‌లైన్ స్టోర్ నుండి కూడా తీసివేసింది, అయితే మీకు కావాలంటే M1 Pro అండ్ M1 Max చిప్‌సెట్‌లతో MacBooksని కొనుగోలు చేయవచ్చు. క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఇంకా ఇమాజిన్ స్టోర్ వంటి రిటైల్ స్టోర్‌ల నుండి స్టాక్‌లు ముగిసే వరకు ఇవి అమ్మకానికి ఉంటాయి. 

16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో 512జి‌బి స్టోరేజ్ పొందుతుంది, అయితే మీరు కావాలనుకుంటే 1టి‌బి స్టోరేజ్ తో మోడల్‌ను కూడా ఎంచుకోవచ్చు. M2 ప్రో చిప్‌సెట్‌తో కూడిన 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో రూ. 2,49,900కి అందిస్తుంది. M2 ప్రో చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ M1 ప్రో కంటే చాలా ఖరీదైనది.

గత నెలలో ఆపిల్ 14-అంగుళాల ఇంకా 16-అంగుళాల సైజ్ మ్యాక్‌బుక్ ప్రోని విడుదల చేసింది. MacBook కాకుండా, Apple Mac మినీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను కూడా పరిచయం చేసింది, దీనిలో M2 సిరీస్ ప్రాసెసర్ ఇచ్చారు. 14-అంగుళాల ఇంకా 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో (2023) మోడల్‌ తాజాగా ప్రారంభించబడిన M2 ప్రో ఇంకా M2 మాక్స్ ప్రాసెసర్‌లతో పరిచయం చేయబడ్డాయి. Mac మినీలో M2 CPU ఉంది ఇంకా M2 Pro CPU ఆప్షన్ కూడా ఉంది.

M2 Pro CPUతో 14-అంగుళాల సైజ్, 10 CPU కోర్లతో MacBook Pro ధర రూ.1,99,900. దీనికి 16జి‌బి ర్యామ్ ఉంది. అయితే దీనిని 32జి‌బికి కాన్ఫిగరేషన్ చేయవచ్చు. 1TB, 2TB, 4TB అండ్ 8TBలలో కాన్ఫిగరేషన్ తో 512GB SSD స్టోరేజ్ పొందుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios