వెస్టీండీస్ VS భారత్ : క్యాచ్ పట్టడం ఇంత ఈజీనా.. విరాట్ కోహ్లీ అదరగొట్టాడుగా...(వీడియో)
విండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. విరాట్ కోహ్లీ అయితే.. ఒంటిచేత్తో క్యాచ్ పట్టి షెపర్డ్ ను అవుట్ చేయడం సెన్సేషనల్ గా మారింది.
బార్బడోస్ : భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో అదరగొట్టింది. తన అద్భుతమైన ఆటతీరుతో వెస్టిండీస్ ను 114 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఈ మ్యాచ్లో అనేక అద్భుతాలు జరిగాయి. అందులో 18వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన నాలుగో బంతిని షెపర్డ్ ఎదుర్కొవడం ఒకటి. అయితే, ఈ బంతి బ్యాట్ కు తగిలి.. నేరుగా స్లిప్ లో ఉన్న కోహ్లీ వైపు వెళ్ళింది. ఇంకేముంది.. వచ్చిన ఛాన్స్ ను మిస్ చేయలేదు కోహ్లీ. వంటి చేత్తో క్యాచ్ పట్టేసాడు. అద్భుతమైన ఈ క్యాచ్ ను చూడండి…