నవ్వులు పూయిస్తున్న కోహ్లీ డ్యాన్స్ మూమెంట్స్.. షాక్ లో హార్దిక్ పాండ్యా..
మొదటి వన్డేకు ముందు, విరాట్ కోహ్లీ నెట్స్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని ఎదుర్కొన్నాడు. ఆ బాల్ ను షాట్ కొట్టాక విచిత్రంగా డ్యాన్స్ చేశాడు. అదిప్పుడు వైరల్ అయ్యింది.
తొలి వన్డే ముందు నెట్ ప్రాక్టీస్ లో విరాట్ కోహ్లీ భలే షాట్ కొట్టాను.. అని ఆనందంలో స్టెప్పులు వేశాడు. అది చూసి బంతివేసిన పాండ్యా.. ‘మంచి బాల్ వేస్తే ఇలా కొట్టాడేంటి?’.. అన్నట్లు చూస్తూ నిలిచుండి పోయాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఆ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా.. పాండ్యా వేసిన బంతి బౌండరీ దాటడం ఖాయం అన్నట్లుగా డాన్స్ చేశాడు.
ఫీల్డ్ ఎంపైర్లు సాధారణంగా ఫోర్ కొట్టినప్పుడు ఇచ్చే సిగ్నల్ ఇస్తున్నట్లు.. చూపిస్తూ.. తనదైన స్టైల్ లో డాన్స్ చేస్తూ చేతులు ఊపుతూ చిత్ర విచిత్ర హావభావాలు పలికించాడు. కోహ్లీ చేసిన ఈ చిలిపి పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇటీవల 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. ఈ సంగతి తెలిసిందే. 500వ మ్యాచ్ మైలురాయిని విండీస్ తో జరిగిన రెండో టెస్టుతో అందుకున్నాడు. ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టి.. మ్యాచ్ ను ఓ మధురానుభూతిగా మార్చుకున్నాడు.
రఫ్ఫాడించిన రవీంద్ర జడేజా.. అత్యధిక వికెట్లు తీసిన తొలిభారతీయుడిగా రికార్డ్...
ఇక తన 76వ శతకాన్ని దిగ్గజ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్ లోనే సాధించి.. మరో రికార్డును తన పేరిట లికించాడు విరాట్. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో సిరాజ్ చెలరేగిపోయాడు. దీంతో..1-0తో టీమిండియా టెస్ట్ సిరీస్ ను చేజిక్కించుకుంది.
అలా టెస్ట్ సిరీస్ ముగిసిందో లేదో టీమిండియా ఇలా.. వన్డే సిరీస్ కు సన్నాహకాలు మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే గురువారం తొలి వన్డే జరిగింది. దీనికంటే ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ లో కోహ్లీ ఈ చిలిపి పనిచేశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నెట్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ.. పాండ్యా వేసిన ఒక బాల్ కి చక్కటి షాట్ కొట్టాడు. ఆ తర్వాత తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ సంబరాలు చేసుకున్నాడు.