Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి వేడుకలో రోలు, రోకలిని పూజిస్తారెందుకు

ఈ సంస్కృతిలో రెండు విభాగాలు - సాంఘిక జీవితం, విలువలు అనేది మొదటిది, మత సంబంధమైన విశ్వాసాలు రెండవది. విజ్ఞానశాస్త్రం యొక్క ఆవిష్కరణలు సమాజంలో తెస్తున్న మార్పులు పై రెండు అంశాల్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి.

Rolu and Rokali are worshiped during the wedding ceremony
Author
Hyderabad, First Published Dec 12, 2020, 12:47 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Rolu and Rokali are worshiped during the wedding ceremony
సంప్రదాయం అనే మాట వినగానే కొందరికి ఆదరభావం కలగవచ్చు. మరికొందరికి ఒక చాదస్తమైన మాటలాగ అనిపించవచ్చు. ప్రపంచమంతటా అన్ని సమాజాలలో తమతమ సంప్రదాయాన్ని నిలుపుకోవాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. అలా నిలుపుకోవడం ఒక సవాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో దీని అవసరాన్ని పరిశీలించాల్సి ఉంది.
 
సంప్రదాయం అనే పదానికి ‘బాగ అందించడం’ అని అర్థం. ‘సం’ అంటే సంపూర్ణంగా, ‘ప్ర’ అంటే ప్రభావవంతంగా, ‘దాయ’ అంటే ఇవ్వడం. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతిని మన పిల్లలకి అందించడం ఇందులోని ముఖ్య విషయం. ఈ సంస్కృతిలో రెండు విభాగాలు - సాంఘిక జీవితం, విలువలు అనేది మొదటిది, మత సంబంధమైన విశ్వాసాలు రెండవది. విజ్ఞానశాస్త్రం యొక్క ఆవిష్కరణలు సమాజంలో తెస్తున్న మార్పులు పై రెండు అంశాల్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి.

సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో  ఏ కారణము చే సర్వ జీవజాలం, ప్రకృతి లోని ప్రతి పదార్థం, శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో, ఏ కారణముచే ఈ ప్రపంచము, బ్రంహాండ మండలం తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో అట్టి దానిని ధర్మముగా నిర్వచించారు.

పెళ్లి వేడుకలో రోలు, రోకలి పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతమో గమనిద్దాం. రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, తైదలు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండి వంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనిసరి. ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు.

పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం, ఇవి పది మంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది. అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంట్టున్నాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో తెలియడం లేదు. వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.

అందుకే వివాహం, ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సాంప్రదాయాన్ని గుర్తుచేయటం, స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము దాగిఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios