Asianet News TeluguAsianet News Telugu

సారే జహాన్ సే అచ్చా అంటూ రాసిన ఇక్బాల్.. ఆధునికతను ముస్లింలకు మురికి పదంగా మార్చారు..

సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అనేది మన అత్యంత ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతం. ఈ పాటను రచించింది.. మహ్మద్ ఇక్బాల్. అయితే అదే ఇక్బాల్.. ముస్లింల సామాజిక-మతపరమైన సంభాషణలో ఆధునికతను ఒక మురికి పదంగా చేశారు.

Mohammad Iqbal poet of saare Jahan se achha made modernity a dirty word for Muslims
Author
Hyderabad, First Published Nov 9, 2021, 5:08 PM IST

సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అనేది మన అత్యంత ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతం. పాఠశాలల్లో, సైనికులు మార్చ్ సందర్భంగా, జాతీయ వేడుకల సమయంలో మనం ఈ గీతాన్ని వింటూనే ఉంటాం. ఈ పాటను రచించింది.. మహ్మద్ ఇక్బాల్. ఆయనను పాకిస్తాన్‌ వారి ఆధ్యాత్మిక  పితామహునిగా స్వీకరించింది. అయితే కారణం లేకుండా మాత్రం పాక్ ఆ పని చేయలేదు. సర్ సయ్యద్, జిన్నాలతో పాటుగా  ముగ్గురు వ్యవస్థాపక పితామహులలో ఇక్బాల్ కూడా ఒకరు.

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయ గీతం రాయడం మొదలుకుని.. పాకిస్తాన్ ఆలోచనని గౌరవించడం వరకు ఇక్బాల్.. జాతీయవాదంతో పాటు అనేక ఆలోచనలను కలిగి ఉన్నారు. అతను భారతదేశం నాగరికత వారసత్వం యొక్క అందం, గొప్పతనాన్ని కీర్తిస్తూ.. గ్రీస్ లేదా ఈజిప్ట్ లేదా రూమా నుండి అందరూ నశించారు.. ఇప్పటి వరకు మిగిలిన పేరు ఉంది - ఓ నిషాన్. మన మతం ఒకరితో ఒకరు శత్రుత్వం కలిగి ఉండమని బోధించదు.. అంటూ జాతీయ ఐక్యత కొరకు మత విభజనను అధిగమించు అని పేర్కొన్నారు. 

అంతేకాకుండా నయా శివలా అనే పద్యంలో ఇక్బాల్ దేశభక్తి ఉప్పొంగింది.. అది భారతీయులలో జాతీవయవాదాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. అతని రచన ప్రపంచ సాహిత్యంలో గొప్పది. చాలా ఉన్నతమైనది, గంభీరమైనది. అతను ఏది రాసినా.. ప్రాపంచిక విషయాలకు అతీతమైన స్పర్శను జోడించారు. అతని పదాలలో శక్తి, అందం, ఆవేశం.. జనాలాను కదలకుండా ఒకే చోట ఉంచడం అనేది అసాధ్యం. కానీ అతని కవిత్వం అనే కళ..  కళ కోసం కాదు. అతను తనను తాను ఇస్లామిక్ ఆధిపత్య పునరుద్ధరణకు సహస్రాబ్ది దూతగా భావించాడు.

పశ్చిమ దేశాలపై వ్యతిరేకత..
ఇక్బాల్ తన కవిత్వాన్ని రెండు భాగాలుగా చూశారు. ఇంగ్లాండ్, జర్మనీలలో ఉన్నత చదువులకు (1905-08) ముందు, ఆ తర్వాత అని విభజించబడింది. ఇది మూస పద్ధతిలో ఆసియా ప్రాతినిధ్యం యొక్క సారూప్యత అనే భావజాలన్ని రూపొందించడానికి వీలు కల్పించింది. రెండోది సైద్దాంతిక భావనగా మిగిలిపోయింది.. విద్యాపరమైన క్రమ శిక్షణను ఎప్పటికీ పొందలేకపోయింది. ఇక్బాల్ పాశ్చాత్య దేశాల నైతిక పతనం, వ్యక్తులు ప్రార్థన నుంచి ఓదార్పు, సంతృప్తి పొందని స్థితిని కనుగొన్నాడు. అది.. ఆధునికత, హేతుబద్ధత, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వాటిపై అతని వ్యతిరేకతను పెంచాయి.

అతని కవిత్వం ముస్లింలో ఆధనిక వ్యతిరేక (పాశ్యాత్య) వైఖరిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. సైన్స్, హెతుబద్దత‌పై వ్యతిరేకత కలిగిన ఇక్బాల్.. ముస్లింల సామాజిక-మతపరమైన సంభాషణలో ఆధునికతను ఒక మురికి పదంగా చేశారు. దశలవారీగా లేదా క్రమంగా జరుగుతున్న అభివృద్ది అనేది అసహాస్యంగా మారింది. నాజీజం, ఫాసిజం వంటి మిలిటరిస్ట్, ఆధిపత్య ఉద్యమాలలో వ్యక్తీకరణను కనుగొన్నప్పటికీ.. ఆధునికత‌పై దాడి అతనిలో ప్రతిధ్వనించింది. అతడు నీట్షే యొక్క ఉబెర్మెన్ష్‌ను ఇస్లాం మతంలోకి మార్చారు. జర్మన్ తత్వవేత్తను మార్డ్-ఇ మోమిన్ అని పేరు మార్చారు. సాహిత్య అనువాదంలో బిలీవింగ్ మ్యాన్.. కానీ వివరణలో ఆల్ఫా ముస్లిం పురుషుడు. దాని ఆధ్యాత్మిక రహస్యం ఏమైనప్పటికీ.. సాధారణ అనువాదంలో మాత్రం ఈ ఖుదీ(స్వీయ) మేల్కొన్న మనిషి ప్రపంచాన్ని తన ఆజ్ఞలకు లొంగదీసుకునే మతపరమైన హక్కుతో ఒక సూపర్ జాతిగా అర్థం చేసుకోబడ్డాడు. అతను మార్డ్-ఇ మోమిన్ యొక్క ఏవియన్ కౌంటర్‌ పార్ట్‌గా షాహీన్ - ఈగిల్ - ఎర యొక్క పక్షి.. ప్రతీకవాదాన్ని తీసుకొచ్చాడు. అప్పటి నుండి షహీన్ అనే పదం ప్రముఖ ముస్లిం పేర్లలో ఒకటిగా ఉండటం అతని కవిత్వం ద్వారా ఎలాంటి సామూహిక మనస్తత్వాన్ని రూపొందించిందో చూపిస్తుంది. ఈ పరిణామాలు హేతుబద్దతపై వ్యతిరేకత.. అతనిలో అధికమైన మతతత్వం పెంచింది. సైన్స్ పట్ల అతని వ్యతిరేకత.. హేతువాద వ్యతిరేకత యొక్క పరిణామంగా ఉంది.  

లింగ వివక్ష..
లింగ వివక్ష విషయానికి వస్తే.. ఇక్బాల్ నిస్సందేహంగా స్త్రీ ద్వేషి. ఆదునిక విద్య స్త్రీ తత్వానికి హానికరం అని భావించారు. చదువుకున్న స్త్రీ ఉద్యోగం కోసం ఆరాటపడుతుందని, తర్వాత తన కూతురుని కాన్వెంట్‌కు పంపతుందని భావించేవాడు. ప్రితృస్వామ్య నైతికతను నిర్వర్తించలేదని అనుకునేవారు. అందరూ అధిప్యవాదుల మాదిరిగానే.. తప్పు చేసిన ముస్లింలను.. హిందువులు, క్రైస్తవులు, యూదులతో పోల్చేవారు తద్వారా అతని ప్రవర్తను అపహాస్యం చేసుకున్నారు. 

భారత జాతీయవాదం పట్ల వైఖరి..
ఇక్బాల్ ఆలోచనలలో అత్యంత ముఖ్యమైన మార్పు.. భారత జాతీయవాదం పట్ల అతని వైఖరిలో సంభవించింది. ముస్లిం ఆధిపత్యాన్ని కొనసాగించగలిగినంత కాలం అతనికి జాతీయ వాదం అనే ఆలోచనతో ఎటువంటి సమస్య లేదు. మెజారిటీ దేశాల్లో ఇస్లాం జాతీయవాదాన్ని కలిగి ఉంది.. ఎందుకంటే అక్కడ ఇస్లాం, జాతీయవాదం ఆచరణాత్మకంగా ఒకేలా ఉంటాయి. అయితే మైనారిటీ దేశాలలో సాంస్కృతిక యూనిట్‌గా స్వీయ నిర్ణయాన్ని కోరుకోవడం సమర్థించబడుతోంది

19వ శతాబ్దంలోనే సర్ సయ్యద్ ద్వారా వ్యక్తీకరించబడిన ముస్లిం రాజకీయ అభిరుచి.. జాతీయవాదం పెంపొదించే ప్రక్రియలో భాగం కావడానికి విముఖత ప్రదర్శించింది. స్వదేశీతకు ప్రాధాన్యతనిచ్చే ప్రక్రియలో పాల్గొనలేకపోయింది. ఇక్బాల్ ఈ అయిష్టాన్ని విశ్వసనీయమైన మత సిద్ధాంతంగా హేతుబద్ధం చేశాడు. 'మీరు మహమ్మదీయులు కాబట్టి ఇస్లాం మీ దేశం' అని ఇక్బాల్ చెప్పారు. మతంలో గుర్తింపు, జాతీయతను పేర్కొనడం ద్వారా..  భూమి, సంస్కృతిలో కాకుండా, ముస్లింలను జాతీయ స్రవంతి నుంచి వైదొలగడానికి ఒక వ్యూహాత్మక ప్రతిపాదన రూపొందించబడింది.

భారతీయ జాతీయవాదాన్ని తిరస్కరించడానికి కారణం ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఇక్కడ హిందువులు మతపరమైన మెజారిటీ. ఇక్బాల్ ప్రజాస్వామ్యాన్ని.. ప్రజాస్వామ్యం అనేది ప్రజల విలువను తూకం వేయకుండా సంఖ్యను లెక్కించే ప్రభుత్వ వ్యవస్థ అని పేర్కొన్నారు. అదే విధంగా.. మతం నుంచి రాజకీయ అధికారాన్ని పొందినట్లయితే.. లౌకికవాదం యొక్క సంబంధిత భావన అని భావించారు. రాజకీయాలు మరియు మతం వేరు చేయబడితే... అది  అనాగరికత వలె దారి తీస్తుందని అనుకునేవారు. ఇక్బాల్ ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని ఖండించడం ఇప్పటికీ ముస్లిం సమాజ పునరుద్ధరణగా భావించే వారిలో ఈ భావనలకు వ్యతిరేకంగా బలమైన వాదనగా మిగిలిపోయింది. అతనిని తమ పోషకుడిగా గౌరవించే దేశానికి ఈ సూత్రాలు పరాయివిగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ముస్లింల రాజకీయ ఆధిపత్య పునరుద్ధరణ అతని దృష్టిలో ప్రధానమైనది. వాయువ్య భారత ముస్లిం రాష్ట్ర ఏర్పాటు.. ఆ దిశలో ఒక అడుగు.

ఉర్దూలో బహిరంగ ప్రసంగం యొక్క సంప్రదాయాలను రూపొందించడంలో అతని కవిత్వం ప్రధాన ప్రభావాన్ని చూపింది. అతని ద్విపదలు మతపరమైన ఉద్వేగాన్ని జోడించడానికి ప్రసంగాలుగా అల్లబడ్డాయి. ఒక ద్విపద కోట్ చేసిన తర్వాత.. దాని గురించి వివరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్బాల్ రచనలు చేసేటప్పుడు.. అతని కవిత్వానికి భిన్నంగా ఆంగ్లంలో చేసేవారు. అతను కెమాల్ అటా టర్క్ యొక్క ఆరాధకుడు. విభజన దిశలో అవసరమైన చర్యగా ఖిలాఫత్ రద్దును ఆమోదించాడు. అతని మతపరమైన ఆలోచన యొక్క పునర్నిర్మాణం.. ఇస్లాంలో ఒక ప్రధాన రచన. కానీ అతను ఉద్దేశపూర్వకంగా దానిని తన ఉర్దూ పాఠకులకు అందకుండా ఉండేలా చాలా అద్భుతమైన శైలిలో రాశారు.

ఇక్బాల్ యొక్క అహేతుకత, భావవాదం, పునరుజ్జీవనం, మిలిటరిజం, ఆధిపత్య వాదంపై ఈ కథనం..

- నజ్ముల్ హోడా, ఐపీఎస్ అధికారి..అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం (ఇంగ్లీష్‌ రచనకు ఇది తెలుగు అనువాదం)
 

Follow Us:
Download App:
  • android
  • ios