Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్ల బుడతడి నిర్వాకం.. వీడియో గేమ్స్ ఆడుకుంటానని లక్షన్నర షాపింగ్ చేశాడు..

వాల్మార్ట్ యాప్ లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ కొన్నింటిని కార్ట్ లో యాడ్ చేశారు. నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకున్నారు.  అయితే అనూహ్యంగా వాల్ మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఏంటా అని యాప్ చూసిన ప్రమోద్ కుమార్ - మధులకు అసలు విషయం బోధపడింది.

Toddler clears out moms online shopping cart, orders rs 1.5lakhs worth of items from Walmart
Author
Hyderabad, First Published Jan 25, 2022, 8:27 AM IST

video games ఆడుకునేందుకు తల్లి smart phone తీసుకున్న.. రెండేళ్ల బాలుడు పొరపాటున 1700 డాలర్లు (సుమారు లక్షా 27 వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్ ను onlineలో ఆర్డర్ చేశాడు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ప్రమోద్ కుమార్ - మధులు అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని మధు అనుకున్నారు.

వాల్మార్ట్ యాప్ లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ కొన్నింటిని కార్ట్ లో యాడ్ చేశారు. నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకున్నారు.  అయితే అనూహ్యంగా వాల్ మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఏంటా అని యాప్ చూసిన ప్రమోద్ కుమార్ - మధులకు అసలు విషయం బోధపడింది.

ఇదంతా తమ కుమారుడైన అయాన్ష్ చేసిన పనే అని అర్థమైంది. ‘అయాన్ష్ యాప్ ఓపెన్ చేశాడు. కార్ట్ లో యాడ్ చేసి ఉన్న వాటన్నింటిని ఆర్డర్ చేశాడు. పేమెంట్స్ అన్ని పూర్తయిపోయాయి’ అని ప్రమోద్ తెలిపాడు.  అయాన్ష్ వల్ల పొరపాటు జరిగిందని ఆ దంపతులు వాల్మార్ట్ ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. 

ఇదిలా ఉండగా, ఆన్ లైన్ షాపింగులతో డబ్బులు గుళ్ల అవడం మామూలే. గత నవంబర్ లో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఆన్ లైన్ లో 99రూపాయలు పెట్టి ఇయర్ ఫోన్స్ కొంటే.. రూ. 33 లక్షలు మాయమయ్యాయి. ఏడాది కిందటే అనారోగ్యంతో భర్త మరణించాడు. వీరికి ముగ్గురు పిల్లలు.  భార్య నిరక్షరాస్యురాలు. భర్త చనిపోయేంతవరకు కాలు బయట పెట్టలేదు.  ఈ స్థితిలో ఆ కుటుంబానికి ఆయన Insurance money భరోసాను ఇచ్చాయి. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతా సర్దుకుంటుంది అనుకున్న తరుణంలో రూ.99తో కొన్న Earphones ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసాయి.  ఏకంగా రూ. 33 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మౌలాలి లో ఉండే ఓ వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవాడు. గతేడాది నవంబర్లో అనారోగ్యంతో మరణించాడు. Insurance company నుంచి ఆయన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అందాయి.  ముగ్గురు పిల్లలపై తలా పది లక్షల చొప్పున భార్య Fixed deposit చేయించింది. తన దగ్గర ఉన్న మిగతా డబ్బులు 2 బ్యాంకు ఖాతాలో ఒక దాంట్లో 28 లక్షలు మరో ఖాతాలో ఐదు లక్షలు జమ చేసింది. అయితే,  8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్లైన్ క్లాసులు  వినేందుకు హెడ్ ఫోన్లు కావాలని అడిగింది.  Online లో  కొంటానంటే ఫోన్ ఇచ్చింది.

అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటి ధర రూ. 500 నుంచి రూ.600 వరకు ఉంది.  అయితే, ఓ వెబ్ సైట్ లో 99 రూపాయలకే ఇయర్ ఫోన్స్ అనే మెసేజ్ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది. కొన్ని రోజుల తర్వాత మరి కొంత డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకి వెళ్ళింది. బ్యాలెన్స్ ఎంత ఉంది అని  ఎంక్వయిరీ చేస్తే  సున్నా ఉందని చెప్పారు. వేరే బ్యాంకులోని మరోఖాతాలో కూడా ఇరవై ఎనిమిది లక్షలు ఉండాల్సిన accountలో రూపాయి కూడా లేదని తెలుసుకుని  షాక్ తిన్నారు.  వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించగా,  ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు  Cyber ​​hackers కు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios