Asianet News TeluguAsianet News Telugu

సెక్యులరిజం, ఇస్లాం మధ్య సంఘర్షణ లేదు: బంగ్లాదేశ్ హోం మంత్రి ఇంటర్వ్యూ

బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ జీ 20 సదస్సు కోసం భారత్ వచ్చారు. శుక్రవారం ఓ న్యూస్ ఏజెన్సీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. వారి రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని తిరిగి చేర్చారు. ఆ దేశానికి ఇస్లాం అధికారిక మతం.
 

there is not conflict between secularism and islam in bangladesh says home minister kms
Author
First Published Sep 11, 2023, 5:10 PM IST

న్యూఢిల్లీ: జీ 20 సదస్సుకు హాజరైన బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ ఏఎన్ఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని వివరించారు. ఏ ఆపద వచ్చినా ఉభయ దేశాలు ఒక్కతాటి మీదికి వస్తాయని తెలిపారు. జీ 20 సదస్సు సత్ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఖాన్ క్లోజ్ అని చెబుతారు. ఆయన ఇంటర్వ్యూలో కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఇందులో ఎలాంటి ఫలితం వస్తుందని అనుకుంటున్నారు. జీ 20 సదస్సు నుంచి బంగ్లాదేశ్‌కు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయని అనుకుంటున్నారు?

అదుజ్జమన్ ఖాన్: బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుంచి భారత్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్నది. ప్రతి సమస్యకు ఉభయ దేశాలు కలిసి ఎదుర్కొంటాయనే నమ్మకం ఉన్నది. ఈ సదస్సు నుంచి తప్పకుండా తమకు కొన్ని మంచి ఫలితాలు వస్తాయి.

ఉగ్రవాదాన్ని బంగ్లాదేశ్ ఎలా డీల్ చేస్తున్నది?

ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని అన్ని విధాలా తిప్పికొట్టాలని మా ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందుకోసం అనేక చర్యలు తీసుకున్నాం. కఠిన యాంటీ టెర్రరిజం చట్టాలు తెచ్చాం. మనీలాండరింగ్ అడ్డుకోవడానికీ చట్టాలు తెచ్చాం.

సెక్యూరిటీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను బలోపేతం చేశాం. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, కౌంటర్ టెర్రరిజం, ట్రాన్స్‌నేషనల్ క్రైమ్ యూనిట్, బాంబ్ డిస్పోజల్ యూనిట్‌లను సిద్ధం చేశాం. తద్వార టెర్రిస్టులు నెట్‌వర్కులను, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నాం. సరిహద్దులో భద్రత, ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ వంటివి చేస్తున్నాం. బయోమెట్రిక్ సిస్టమ్‌లు , ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టు మెషీన్లు ఏర్పాటు చేశాం. అన్ని పోర్టుల వద్ద ప్రయాణికుల వివరాలను ఆధునిక విధానాల్లో సేకరించి ఉగ్రవాదుల కదలికలను అడ్డుకోగలుగుతున్నాం.

ఇరుగు పొరుగు దేశాలు సహా అంతర్జాతీయంగానూ ఉగ్రవాదంపై పోరుకు చేతులు కలిపాం. అనేక వేదికల మీద చర్చించి సహకారాలు అందిస్తున్నాం.

షేక్ హసీనా ప్రభుత్వం సెక్యూలరిజం, మత స్వేచ్ఛను పునరుద్ధరిస్తున్నది. ఇందులో పురోగతి ఎక్కడి వరకు వచ్చింది?

మా ప్రధానిషేక్ హసీనా ఒక గొప్ప దార్శనికుడు, జాతి పిత బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మన్ కూతురే కాదు.. ఆమె స్వయంగా స్పష్టమైన ఆలోచనలు కలిగిన నేత. ఆమె అందరి శాంతి కోసం పరితపించే వ్యక్తి. అందుకే ఆమె సెక్యులరిజం,  ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రతిపాదనలు చేసింది. మా రాజ్యాంగంలో ఈ రెండింటిని చేర్చింది. అలాగే.. ఏ మత మైనార్టీలపైనా అయినా వివక్ష, హింసను ఏమాత్రం సహించని విధానాలను అమలు చేస్తున్నది.

రాజ్యాంగంలోని సెక్యూలరిజం ఇస్లాంతో ఎప్పడూ సంఘర్షణపూరితంగా లేదు. ఇస్లాం ఇక్కడ స్టేట్ రిలీజయన్. దీంతో ప్రతి ఒక్కరు తమ మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు పొందుతారు. అన్ని మతాలు, సముదాయాలను సమానంగా చూడాలని, అదే లౌకిక దేశం అని పిలుపు ఇచ్చారు.

బంగ్లాదేశ్, ఇండియా సరిహద్దులో ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టడంలో మీ పాత్ర ఏమిటీ?

మీకు ఇది వరకే తెలుసనుకుంటాను. జమాత్ సారథ్యంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛ అని పేర్కొనే కొన్ని విదేశీ శక్తులపట్ల సానుకూలంగా ఉండేది. వారి హయంలో భారత ఈశాన్య రాష్ట్రాల మరీ ముఖ్యంగా అసోంలోని ఈ వేర్పవాటువాద శక్తులకు మద్దతుగా ఉండేది. కానీ, మా ప్రభుత్వం అసోంకు చెందిన చాలా మంది ఉగ్రవాదులు, తీవ్రవాద భావాలతో ఉన్న వారిని తిరిగి పంపించడానికి యాక్షన్స్ తీసుకుంది. 

దీనికితోడు దేశంలోనూ శాంతి భద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. పొరుగు దేశాలతోనూ ముఖ్యంగా ఇండియాతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్య త ఉంటుంది. భారత్‌తో సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన సరిహద్దును కలిగి ఉన్నాం.

ఉభయ దేశాలు సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించుకుంటాయి. బయటి నుంచి జోక్యాన్ని సహించవు. మతం, జాతి ఆధారంగా దేశంలో ఎక్కడ హింస జరిగినా సీరియస్‌గా తీసుకుంటాం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మానవ హక్కుల విలువలను ఎత్తిపడతాం. సరిహద్దు గుండా స్నేహపూరిత సంబంధాలు ఉండేలా చూసుకుంటున్నాం. ఉభయ దేశాల మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, ముజీబుర్ రెహ్మాన్‌లు 1974 మే నెలలో సరిహద్దు గురించి ఒప్పందం జరిగింది. దాన్ని గౌరవిస్తాం.

Also Read: సచిన్‌ను గాయపరచాలనుకున్నాను.. ఆ బాల్ వేసినప్పుడు చనిపోయాడనే అనుకున్నా: షోయబ్ అక్తర్ సంచలనం(Video)

బంగ్లాదేశ్‌లో శాంతి భద్రతలకు సంబంధించి దీర్ఘకాలిక సవాళ్లు ఏమిటీ?

దేశంలో లా అండ్ ఆర్డర్‌ను మెరుగుపరచడానికి ఎదురయ్యే దీర్ఘకాలిక, స్వల్పకాలిక సవాళ్ల గురించి నాకు అవగాహన ఉన్నది. ఇందులో ముఖ్యంగా ప్రకృతి వైపరిత్య ాలు ఉన్నాయి.  పర్యావరణ మార్పులు, కాలుష్యం, అటవీ అంతరించిపోవడం, అక్రమ మైనింగ్, వన్యప్రాణులు అక్రమ రవాణా వంటివి ఉన్నాయి.

ఇవి కేవలం మన సహజ వనరులను, బయోడైవర్సిటీనే కాదు.. ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, భద్రతను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి, వీటికి సంబంధించిన చట్టాలను బలోపేతం చేయాలి. ఇతర దేశాలతోనూ కలిసి వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం

బంగ్లాదేశ్ భౌగోళిక స్థితి దృష్ట్యా సరిహద్దులు, సముద్ర తీర సరిహద్దులను చూసుకుంటే సరిహద్దుల గురించి జరిగే నేరాలపై మీ అభిప్రాయం ఏమిటీ?

సరిహద్దు గుండా చాలా ప్రమాదాలు, సవాళ్లు ఉన్నాయి. ఉగ్రవాదం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, పర్యావరణ భద్రత, ఆర్థిక నేరాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను, సామాజిక వృద్ధిని, జాతీయ సార్వభౌమత్వాన్ని నాశనం చేసే తీవ్రత గలవి. కాబట్టి, వీటిని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకున్నాం. కౌంటర్ టెర్రరిజం, ట్రాన్స్‌నేషనల్ క్రైమ్ యూనిట్లను ఏర్పాటు చేశాం. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడుతాయి. సరిహద్దులను బలోపేతం చేశాం. బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌ల సంఖ్యను పెంచాం. 

Follow Us:
Download App:
  • android
  • ios