Women Reservation Bill: దశాబ్దాల పోరాటాన్ని ప్రధాని మోదీ ముగించారు: స్మృతి ఇరానీ
Women Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న 'నారీశక్తి వందన్ బిల్లు'కు లోక్‌సభ ఆమోదం తెలిపిందని, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నామని అన్నారు.

Women Reservation Bill: దాదాపు మూడు దశాబ్దాలుగా నిరీక్షణకు తెరపడింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'నారీ శక్తి వందన్ బిల్లు' లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై స్లిప్ ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతివ్వడం విశేషం. ఈ మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేశారు. నేడు నేడు ఛోటీ దీపావళి అని, రేపు పెద్ద దీపావళి అని అన్నారు. నేడు చరిత్ర సృష్టించబడిందని, దశాబ్దాల పోరాటాన్ని ప్రధాని మోదీ ముగించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
" కోట్లాది మంది మహిళలు ఎదురుచూస్తున్న బిల్లును ఆమోదించడం లభించింది. ఏ మహిళ అయినా తన పార్లమెంటరీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? ఉండిపోయాను..." అని అన్నారు. దేశ రాజకీయాలపై విస్తృత ప్రభావం చూపే అవకాశం ఉన్న 'నారీశక్తి వందన్ బిల్లు'కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపిందని, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నామని అన్నారు.
అంతకుముందు.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ చట్టం బిల్లు)పై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విరుచుకుపడిన ఆమె ధన్యవాదాలు తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. సోనియాగాంధీ పేరు ప్రస్తావించకుండా.. ఇది మా బిల్లు అని కొందరు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. గౌరవనీయమైన నాయకురాలు (సోనియా గాంధీ) సభలో ఒక ప్రకటన చేసారు. అయితే తాను ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాననని ఎద్దేవా చేశారు.
మంత్రి స్మృతి ఇరానీ ఇంకా మాట్లాడుతూ, “రాజ్యాంగంలోని 73, 74వ సవరణలను చేసింది తమ పార్టీనేనని వారు పదేపదే ప్రస్తవిస్తున్నారు. అయితే.. ఈ గొప్ప పనిని చేసిన పివి నరసింహారావు గారికి కృతజ్ఞురాలిని. ఆయన (పివి నరసింహారావు) మరణానంతరం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించే అవకాశం ఇవ్వలేదు.' అని మండిపడ్డారు.
స్మృతి ఇరానీ కౌంటర్
బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ లోక్ సభలో ఇంకా మాట్లాడుతూ.. 2010 లో బిల్లును తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఇప్పుడూ మాత్రం.. ఇది మా బిల్లు అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మతపరమైన కోటాలు అడుగుతూ.. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 15 ఏళ్ల పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మా ప్రతిపాదనలో స్పష్టంగా రాసి ఉందని, అయితే కాంగ్రెస్ బిల్లులో మాత్రం మహిళలు పదేళ్లు కష్టపడాలని, ఆ తర్వాత రిజర్వేషన్లు వర్తించేలా ఉన్నాయని ఇరానీ చెప్పారు.
'నారీశక్తి వందన్ బిల్లు'కు సంబంధించిన 'రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు 2023'పై సుమారు 8 గంటల చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు పోలయ్యాయి. ఆ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లుకు మద్దతు పలికాయి.
అయితే.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బిల్లును వ్యతిరేకించింది. బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ఉన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఈ బిల్లుపై చర్చలో రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా మొత్తం 60 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 27 మంది మహిళా సభ్యులు ఉన్నారు.