Asianet News TeluguAsianet News Telugu

పాట్నా రైల్వే స్టేషన్ వైరల్ వీడియోపై పోర్న్‌స్టార్ క్రిప్టిక్ ట్వీట్‌..

Railway Station Viral Video:  పాట్నాలోని రైల్వే స్టేష‌న్ 10వ నంబర్ ప్లాట్ ఫాంపై వందలాది మంది రైళ్ల కోసం వేచి ఉండగా ఆదివారం నాడు అక్క‌డి ఎల్ఈడీ స్క్రీన్లపై అశ్లీల దృశ్యాలు కనిపించాయి. ప్లాట్ ఫామ్ పై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై  ప్రకటనలకు బదులుగా అకస్మాత్తుగా  పోర్న్ వీడియో దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలు సుమారు 3 నిమిషాల పాటు ప్రదర్శించబడ్డాయి. చాలా మంది ప్రయాణీకులు దానిని తమ ఫోన్లలో రికార్డ్ చేయడానికి తగినంత సమయం ఉండటంతో, దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 
 

Pornstar Kendra Lust Tweet on Patna Railway Station Viral Video
Author
First Published Mar 21, 2023, 3:15 PM IST

Pornstar Tweet on Patna Railway Station Viral Video: పాట్నా రైల్వే స్టేషన్ లో ప్లే అయిన అశ్లీల వీడియోపై పోర్న్‌స్టార్ కేంద్రా లస్ట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తన ట్వీట్ లో సదరు పోర్న్‌స్టార్  ఒక పదం, దాని ప‌క్క‌న ఇండియా మ్యాప్ స్టిక‌ర్ ను ఉంచుతూ.. #BiharRailwayStation హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు దీనికి 528.8K వ్యూస్ వ‌చ్చాయి. ట్విట్టర్ యూజర్ల నుంచి విపరీతమైన స్పందనలు సైతం వచ్చాయి. "రైల్వే స్టేషన్లో ప్లే అవుతున్నది మీ పోర్న్ క్లిప్ కాదా అని ఓ యూజర్ అడగ్గా.. దానికి అది తనదేనని" ఆమె చెప్పింది.

పాట్నాలోని రైల్వే స్టేష‌న్ 10వ నంబర్ ప్లాట్ ఫాంపై వందలాది మంది రైళ్ల కోసం వేచి ఉండగా ఆదివారం నాడు అక్క‌డి ఎల్ఈడీ స్క్రీన్లపై అశ్లీల దృశ్యాలు కనిపించాయి. ప్లాట్ ఫామ్ పై ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై  ప్రకటనలకు బదులుగా అకస్మాత్తుగా  అశ్లీల దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలు సుమారు 3 నిమిషాల పాటు ప్రదర్శించబడ్డాయి. చాలా మంది ప్రయాణీకులు దానిని తమ ఫోన్లలో రికార్డ్ చేయడానికి తగినంత సమయం ఉండటంతో, దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. 

ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే పాట్నా జంక్షన్ ట్విట్టర్లో ట్రెండింగ్ మొదలైంది. ప్లాట్ ఫామ్ లపై ఉన్న పలువురు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎఫ్) రంగంలోకి దిగి ఫుటేజీని నిలిపివేసింది. దత్తా కమ్యూనికేషన్ (స్క్రీన్లను నిర్వహించే ఏజెన్సీ), వారి గుర్తు తెలియని ఆపరేటర్లు, కార్మికులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 145 కింద కేసు నమోదు చేశారు. "ఈ విషయం తెలియగానే ఈ లోపాన్ని తీవ్రంగా పరిగణించారు. సంబంధిత ఆపరేటర్ కు ఇచ్చిన టెండర్ ను తక్షణమే రద్దు చేశాం. భవిష్యత్తులో ఏ  కాంట్రాక్టు ఇవ్వ‌కుండా అత‌న్ని బ్లాక్ లిస్టులో పెడుతున్నామని" తూర్పు మధ్య రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ తెలిపారు.

పోర్న్ వీడియో ప్లే అవుతుండ‌టాన్ని గుర్తించిన వెంట‌నే ఆ ఆప‌రేట‌ర్ ఏర్పాటు చేసిన అన్ని టీవీ స్క్రీన్లను డిస్ కనెక్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్పీఎఫ్, జీఆర్పీ వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios