మన స్పేస్ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరింది: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన
ISRO Chief S Somnath: యుఎస్‌లో సంక్లిష్టమైన రాకెట్ మిషన్‌లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన నిపుణులు, చంద్రయాన్-3 అంతరిక్ష నౌక అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన తర్వాత.. భారతదేశం తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని సూచించారని ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

ISRO Chief S Somnath: చంద్రయాన్ 3 విజయంతో భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకు ముందే చంద్రయాన్ 3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు… సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. కాలం మారిందని, భారత్ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్లలను చేయగలదని అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలికారని తెలిపారు.
దివంగత మాజీ రాష్ట్రపతి 92వ జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోమనాథ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇస్రో చీఫ్ మాట్లాడుతూ మన దేశం చాలా శక్తివంతమైన దేశమని అన్నారు. మన జ్ఞానం, మేధస్సు స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు.
"ఇస్రో చంద్రయాన్-3లో అంతరిక్ష నౌకను రూపొందించి, అభివృద్ధి చేసినప్పుడు, రాకెట్లు, అత్యంత కష్టతరమైన మిషన్లను చేసే నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నిపుణులను ఆహ్వానించాము. దాదాపు 5-6 మంది నిపుణులు(ఇస్రో ప్రధాన కార్యాలయానికి) వచ్చారు. చంద్రయాన్-3 గురించి వారికి వివరించాం. ఇది సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందు (ఆగస్టు 23న). మేము దానిని ఎలా డిజైన్ చేశామో.. మా ఇంజనీర్లు దీనిని ఎలా నిర్మించారు. చంద్రుని ఉపరితలంపై మనం ఎలా దిగబోతున్నాం అని మేము వివరించాము. " అని పేర్కొన్నారు.
JPL అనేది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)చే నిధులు సమకూర్చబడిన పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల దీనిని USలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CALTECH) ద్వారా నిర్వహించబడుతుంది.
'వారు (అమెరికన్ అంతరిక్ష నిపుణులు) కూడా ఒక విషయం చెప్పారు. 'శాస్త్రీయ పరికరాలను చూడండి, అవి చాలా చౌకగా ఉన్నాయి. తయారు చేయడం చాలా సులభం, అవి హైటెక్. వారు అడిగారు - మీరు దీన్ని ఎలా చేసారు? అమెరికాకు ఎందుకు అమ్మకూడదు? ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు' అని అడిగారని సోమనాథ్ గుర్తు చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, 'కాబట్టి మీరు (విద్యార్థులు) కాలం ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అత్యుత్తమ పరికరాలు, అత్యుత్తమ రాకెట్లను తయారు చేయగలుగుతున్నాము. అందుకే అంతరిక్ష రంగానికి తెరతీశారు మన ప్రధాని నరేంద్ర మోదీ' అని తెలిపారు.
భారతదేశం ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. దీంతో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ (రష్యా) తర్వాత చంద్రుడిపై కాలుమోపిన ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై తన అంతరిక్ష నౌకను దింపిన మొదటి దేశం భారతదేశం.
సోమనాథ్ విద్యార్థులతో మాట్లాడుతూ.. 'ఇప్పుడు మీరు వచ్చి మరిన్ని రాకెట్లు, ఉపగ్రహాలను నిర్మించి, అంతరిక్ష సాంకేతికతలో మన దేశాన్ని మరింత శక్తివంతం చేయమని అడుగుతున్నాము. ఇస్రో మాత్రమే కాదు, అంతరిక్షంలో ప్రతి ఒక్కరూ దీన్ని చేయగలరు. చెన్నైలో అగ్నికుల్ పేరుతో ఒక కంపెనీ, హైదరాబాద్‌లో స్కైరూట్ పేరుతో మరో కంపెనీ రాకెట్లను తయారు చేస్తోంది. భారతదేశంలో నేడు కనీసం ఐదు కంపెనీలు రాకెట్లు , ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయి. అని తెలిపారు.
కలాం సిద్ధాంతాన్ని అనుసరించాలని యువతను ఉద్దేశించి సోమనాథ్ మాట్లాడుతూ.. కలలు కనడం అనేది చాలా శక్తివంతమైన పరికరమని, అందుకే రాత్రుళ్లు కాకుండా, నిద్ర నుంచి లేచిన తరువాత కలలు కనండని కలాం చెప్పేవారని ఆయన కలాంను గుర్తు చేశారు.
'ఎవరైనా అలాంటి కలలు కలిగి ఉంటారా? ఎవరైనా చంద్రునిపైకి వెళ్లాలనుకుంటున్నారా? చంద్రునిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినప్పుడు, నేను చంద్రునిపై భారతదేశం ఉందని ప్రధాని (నరేంద్ర మోదీ)కి చెప్పాను. మరి మీరు చంద్రునిపైకి భారతీయుడిని ఎప్పుడు పంపుతారని అడిగాడు. అందుచేత ఇక్కడ కూర్చున్న మీలో కొందరు ఈ పని చేస్తారు. మీలో కొందరు చంద్రునిపైకి వెళ్లే రాకెట్లను డిజైన్ చేస్తారు. చంద్రయాన్-10ని ప్రయోగించే సమయంలో మీలో ఒకరు రాకెట్‌లో కూర్చొని ఉండొచ్చు, బహుశా అమ్మాయి అయి ఉండవచ్చు. ఒక అమ్మాయి వ్యోమగామి భారతదేశం నుండి వెళ్లి, ఆపై చంద్రునిపై (చంద్రయాన్-10 మిషన్‌లో) దిగవచ్చు అని పేర్కొన్నారు.