సారాంశం

గోశాల శుభ్రం చేయాలంటూ పిలిచి ఓ మైనర్ ను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులోనే ఆమె మీద గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు సోమవారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఈ నెల ప్రారంభంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను కదులుతున్న వాహనంలో కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణమైన కేసులో పోలీసులు బాధితురాలి పొరుగున ఉన్న ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు.

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 9న గోశాలను శుభ్రం చేసేందుకు నిందితులు మైనర్ బాలికను పిలిపించారు. ఆ తరువాత ఈ ఘటన జరిగింది. నిందితులు తనను కత్తితో బెదిరించారని, తనను బలవంతంగా ఓ గుడిసెలోకి తీసుకెళ్లాడని బాధితురాలు తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.

మణిపూర్ హర్రర్‌ : అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హతం.. సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు.. ప్రభుత్వం ఏమందంటే..

అనంతరం అతని సహచరులు ఇద్దరు అక్కడికి చేరుకుని ఆమెను కిడ్నాప్ చేసి, కదులుతున్న వాహనంలో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ముగ్గురు నిందితులు ఆమెను గోశాల బయట పడేశారు. స్పృహలోకి వచ్చిన బాలిక ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది.

కప్తంగంజ్ పోలీస్ స్టేషన్ మొదట్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు,  ఆమె కుటుంబం సహాయం కోసం సీనియర్ అధికారులను సంప్రదించిన తర్వాత మాత్రమే అధికారిక ఫిర్యాదు నమోదు చేయబడింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని, ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఖుషీనగర్ జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.