Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ రాకెట్‌లో బిజెపి ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు

వారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ప్రజా సేవ చేయడానికి ప్రజలు వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. కానీ వారు ప్రజా సేవను మరిచి నీఛమైన పనులకు పాల్పడుతూ ఎమ్మెల్యే పదవికున్న పేరుతో పాటు అప్పటివరకు సంపాదించుకున్న పరువును మంటల్లో కలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యభిచార ముఠాలతో సంబంధాలు ఏర్పర్చుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటన అసోంలో బైటపడింది.
 
FIRs name 3 Assam MLAs in sex scandal
Author
Assam, First Published Aug 11, 2018, 11:28 AM IST

వారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ప్రజా సేవ చేయడానికి ప్రజలు వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. కానీ వారు ప్రజా సేవను మరిచి నీఛమైన పనులకు పాల్పడుతూ ఎమ్మెల్యే పదవికున్న పేరుతో పాటు అప్పటివరకు సంపాదించుకున్న పరువును మంటల్లో కలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యభిచార ముఠాలతో సంబంధాలు ఏర్పర్చుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటన అసోంలో బైటపడింది.

అసోంలో ఇటీవలే పోలీసులు గుట్టుగా వ్యభిచారాన్ని కొనసాగిస్తున్న ఓ ముఠా ను పట్టుకున్నారు. పట్టణ సమీపంలోని మైహార్ పూర్ విహార్ లైన్ ప్రాంతంలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు వ్యభిచారిణిలను అదుపులోకి తీసుకున్నారు.  అయితే వారిని పోలీసులు విచారించగా సంచలన నిజాలు బైటపెట్టారు.    

ఈ వ్యభిచార ముఠాతో సాక్షాత్తూ ఇద్దరు అధికార పార్టీ బిజెపి ఎమ్మెల్యేలతో పాటు ఓ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు పట్టుబడ్డ వ్యభిచారిణులు పోలీసులకు తెలిపారు. వీరు అందించిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు జరిపగా ఈ విషయం నిజమేనని తేలింది. దీంతో పోలీసులు బిజెపి ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్ తో పాటు ఏఐయూడీఎఫ్ కు చెందిన నిజాముద్దీన్ చౌదరిలపై కేసు నమోదు చేశారు. ఈ సెక్స్ రాకెట్ లో కేవలం ఎమ్మెల్యేలే కాదు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందని గుర్తించినట్లు జిల్లా ఎస్పీ రాకేష్ రౌషన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios