Asianet News TeluguAsianet News Telugu

ISRO: చంద్రుడిపై అద్భుతం.. ప్రపంచ దేశాల కళ్లన్నీ ఇస్రోపైనే.. !

Chandrayaan-3: సెప్టెంబర్ 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యుడు ఉదయిస్తున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో యావ‌త్ ప్ర‌పంచ దేశాలు మ‌రోసారి భార‌త్ వైపు చూస్తున్నాయి. మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న ఘనీభవన ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ చంద్రుడి శివశక్తి పాయింట్ వద్ద రెండు విష‌న్లు దాదాపు అర నెల రోజులుగా క్రియారహితంగా ఉన్నాయి. అయితే సూర్యరశ్మి రాకతో వాటి నిర్వహణ పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నారు.
 

Chandrayaan 3 mission: Dawn breaks on Moon, all eyes on lander,Pragyan Rover ISRO RMA
Author
First Published Sep 21, 2023, 2:45 PM IST

Chandrayaan-3 mission: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ  ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్-3 మిష‌న్ స‌క్సెస్ తో అంత‌రిక్ష రంగంలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపంచింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని అందించాయి. 12 రోజులపాటు పరిశోధనల త‌ర్వాత‌.. జాబిల్లిపై రాత్రి ప్రారంభం కావడంతో  విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. ఇక సెప్టెంబర్ 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యుడు ఉదయిస్తున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో యావ‌త్ ప్ర‌పంచ దేశాలు మ‌రోసారి భార‌త్ వైపు చూస్తున్నాయి.

మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్న ఘనీభవన ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ చంద్రుడి శివశక్తి పాయింట్ వద్ద రెండు విష‌న్లు దాదాపు అర నెల రోజులుగా క్రియారహితంగా ఉన్నాయి. అయితే సూర్యరశ్మి రాకతో వాటి నిర్వహణ పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని చంద్రయాన్ -3 ల్యాండింగ్ సైట్ లో ఇప్పుడు సూర్యోదయం ఉందని ఇస్రో తెలిపింది. బ్యాటరీలు రీఛార్జ్ అయ్యేందుకు ఏజెన్సీ ఎదురుచూస్తోంది. త్వరలో విక్రమ్, ప్రజ్ఞాన్ లతో కమ్యూనికేషన్లను పునరుద్ధరిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని తిరిగి సాధార‌ణ స్థితికి రావ‌డమే 'ప్రజ్ఞాన్, విక్రమ్'లకు ప్రధాన సవాలు. ఆన్ బోర్డ్ పరికరాలు చంద్రునిపై తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుంటే, మాడ్యూల్స్ తిరిగి జీవం పోసుకుంటాయి. రాబోయే పద్నాలుగు రోజుల పాటు చంద్రుడి నుండి సమాచారాన్ని పంపే తమ మిషన్ ను కొనసాగిస్తాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే కమాండ్లను రోవర్లోకి ఫీడ్ చేసిన తర్వాత రోవర్ కదలడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ పై కూడా ఇదే విధానాన్ని పునరావృతం చేస్తారని సంబంధిత ఇస్రో వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios