Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 10వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మహత్యాయత్నం.. ఎక్కడంటే ?

ఓ బాలికను ఓ యువకుడు రేప్ చేశాడు. దాని ఆధారంగా ఆమెను బ్లాక్ బెయిల్ చేశాడు. తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

Atrocious.. Gang rape of 10th class girl.. Attempted suicide by taking video and blackmailing her.. Where?
Author
First Published Oct 15, 2022, 3:41 PM IST

పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక (15)పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అతడు వీడియో తీశాడు. దాని ఆధారంగా బ్లాక్ బెయిల్ చేస్తూ పలువురు స్నేహితులతో గడపడాలని ఒత్తిడి తెచ్చాడు. ఓ హోటల్ గదిలో ఆమెను నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దానిని కూడా వీడియో తీసి బ్లాక్ బెయిల్ చేశారు. డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో విసుగు చెందిన బాధితురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

ఆకలి సూచీలో దిగజారిన భారత్.. మనకంటే మెరుగ్గా పాక్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలు

పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమెకు తన క్లాస్ మేట్ ఆయుష్ (23) అనే వ్యక్తిని పరిచయం చేసింది. కొంత కాలం తరువాత అతడు ఆ బాలికను తన గదికి రావాలని కోరారు. అతడి మాటలు నమ్మి గదికి వెళ్తే ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఈ చర్యను తన మొబైల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. దాని ద్వారా పలు సందర్భాల్లో హోటల్ లో తన నలుగురు స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేశాడు. 

దీంతో అతడి నలుగురు స్నేహితులు ఓ హోటల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారు కూడా ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఈ వీడియోల ఆధారంగా ప్రధాని నిందితుడు అయిన ఆయుష్ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె రూ.50 వేల వరకు నిందితుడికి అందించింది. అయితే ఇంకా డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేయడం కొనసాగించాడు. లేకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించాడు.

మరో కశ్మీరి పండిట్‌ను హతమార్చిన ఉగ్రవాదులు.. టెర్రరిస్టుల కోసం గాలింపులు

దీంతో విసుగు చెందిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హాస్పిటల్ కు తరలించారు. రెండు రోజుల తరువాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు ఆమె వివరించింది. వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ‘హిందుస్థాన్ టైమ్స్’నివేదించింది. బాధితురాలు ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. కాగా.. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు ఆయుష్ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఏరియల్ సర్వేలతో గ్రౌండ్ స‌మ‌స్య‌లు క‌నిపించ‌వు.. యూపీ సీఎం యోగిని టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios