కేరళను మంకీపాక్స్ కేసులు ఒక్కోటిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కేసు నమోదవగా తాజాగా రెండో మంకీపాక్స్ కేసు బయటపడింది. మలప్పురంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేసారు. దీంతో అతడు మంకీపాక్స్ తోనే బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు అతడికి మెరుగైన వైద్యం అందించడమే కాదు ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇది భారతదేశంలో నమోదైన రెండో మంకీపాక్స్ కేసు.

ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి తిరిగి వచ్చాడు సదరు వ్యక్తి. మలప్పురంకి చెందిన 38 ఏళ్ల ఇతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు... తాజాగా ఇతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 

సోషల్ మీడియా వేదికన మంకీీపాక్స్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేసారు కేరళ ఆరోగ్య మంత్రి. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా మంకీ పాక్స్ లక్షణాలుంటే వెంటనే తగిన టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించినా తగినా చికిత్స అందించే ఏర్పాటు చేస్తామని మంత్రి వీణా జార్జ్ తెెలిపారు. 

 

మంకీపాక్స్ బాధితుడిని ఇప్పటికే ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నామని ఆరోగ్య మంత్రి చెప్పారు. ఇటీవలే అతడు విదేశాల నుంచి వచ్చాడు... అప్పటినుండి అతడు అనారోగ్యంతో వున్నాడని తెలిపారు. అతడి కుటుంబసభ్యులకు కూడా మంకీపాక్స్ టెస్టులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 

అనారోగ్యంతో బాధపడుతున్న అతను మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడని... తరువాత మంజేరి మెడికల్ కాలేజీకి తరలించారని తెలిపారు. అతని నమూనాలను పరీక్ష కోసం కాలికట్ మెడికల్ కాలేజీకి పంపామని మంత్రి తెలిపారు. అతడికి మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు.