Asianet News TeluguAsianet News Telugu

నిజంగా ‘జీవితం చేసిన సంతకమే’

చొప్పదండి సుధాకర్ రాసిన నవలను సిద్దెంకి యాదగిరి సమీక్షించారు. చొప్పదండి సుధాకర్ నవలలోని సామాజిక, మానవత్వ అంశాలను ఆయన తన రివ్యూలో ప్రస్తావించారు.

Dr Siddenki Yadagiri reviews Chappadandi SudHakar Novel
Author
Siddipet, First Published Apr 23, 2020, 4:52 PM IST

“Cultivation of mind should be ultimate aim of human existence”     (మేథో మథనం మానవుని అస్థిత్వం/ఉనికిని చాటే అంతిమ లక్ష్యమై ఉండాలి) – Dr. B. R. Ambedkar.  

“వ్యక్తి జీవితానికి అంతం ఉంటుంది. కానీ పోరాటం నిరంతర ప్రక్రియ” – టోనికేడ్ బంబారా  (న్యూయార్క్ రచయిత్రి)

మేథో మథనం మానవుని వికాసానికి తోడ్పడాలి. మానవున్ని బాధ్యతాయుత మనిషిగా నిలిపితే ఆ మేథస్సు లక్ష్యం నెరవేరినట్లే. ఆ మేథస్సు రచనల్లో ప్రతి ఫలించి పాఠకుణ్ణి మేల్కొల్పితే ఆ రచన అంతిమ లక్ష్యం నెరవేరినట్లే. కాలం వస్త్ర గాలంతో  వడకట్టినా ఎదురోడ్డి నిలిచి నిలదొక్కుకున్నట్లే. 
    
కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత మనల్నీ మనలో ఉండకుండా ఆ అక్షరాలు మనల్నీ వేటాడుతుంటాయి. వెంటాడుతుంటాయి. అలాంటి కోవలోనిదే చొప్పదండి సుధాకర్ గారి ‘జీవితం చేసిన సంతకం’ నవల. 2005 సంవత్సరంలో  ‘వార్తా’ తెలుగు దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడి ఎంతో మంది పాఠకుల మనో ఫలకం చేదురని ముద్రవేసింది. పుస్తక రూపంలో వచ్చేసరికి దాదాపు పదమూడేళ్లు పట్టి 2018లో అల్లీపురం ప్రచురణలు ద్వారా ప్రచురించబడింది.
    
రచయిత తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని అల్లిపూర్ గ్రామం. వీరు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. నవలలోకి వెళితే కథ నాయకుడు పృథ్వీ. పృథ్వీ తల్లి పేరు కాంచన సీత. తండ్రి ఏకాంబరం. వ్యాపారం పేరుచెప్పి నెలలు నెలలుగా వివిధ ప్రాంతాల్లో వ్యాపారానికని పోతుంటాడు. వీరికి క్రాంతి, రూప, గోపి, చేల్లెండ్లు తమ్ముడు. నివాసం శాంతినివాసం కుషాయిగూడ. పృథ్వీ డిగ్రీ చదువుతున్న విద్యార్థి. ప్రారంభం మాత్రం హోప్ మోర్ బార్ లో. జోగప్ప అడ్డాలులు కలిసి ఒక యువకుణ్ణి దారునంగా చంపి, మరో ఆపరేషన్ కోసం పథకాలు వేస్తుంటారు. జోగప్ప పరీద మనిషి. పరీద రాజకీయ నాయకులను గుప్పిట్లో పెట్టుకునే ‘క్లియోపాత్ర’ లాంటి పాత్రే. ఎత్తైన మనిషి. అంగ సౌష్టమ్. నల్లని జుట్టు, పోత పోసి చెక్కిన షిల్పంలా ఉండి చూపరుల మనసుల్ని కొల్లగొట్టే సమ్మోహిని. రాజకీయాలను తన అందాలతో, ఆలోచనతో శాసిస్తున్న రాజకీయ దురంధరి. తిమ్మిని బమ్మిని చేసే నేర్పరి. అవసరాన్నిబట్టి అందాన్ని ఆయుధంగా కూడా వాడగలదు.
    
పృథ్వీ యువకవి. కవితాభిరుచి సంస్థ వారు నిర్వహించిన కవిత రచనల పోటీల్లో ద్వితీయ బహుమతి వచ్చింది. సన్మానం ఉంది కావున మీరు తప్పకుండ రావాలని ఉత్తరం వచ్చింది. ఆ లేఖను చదువుతూ పెద్దమ్మ కూతురు రాజేశ్వరి, మిగతా కుటుంభ సభ్యులు ఎంతో సంతోషిస్తారు. రాజేశ్వరి తన గారాల పట్టి కావేరిని ఇచ్చి పెళ్లి చేయాలని నిచ్చయించుకుంటుంది. కావేరీ పృథ్వీ అన్యోన్యంగా ప్రేమించుకుంటారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. పార్కులు, సినిమా హాల్లు, జ్ఞ్యాపకాలు ఫోటోస్టూడియోల వెంట పరిగెడుతాయి. ఒక్క మాట లో చెప్పాలంటే వారిదో ప్రపంచం.
    
రవీంద్ర భారతిలో కవిసమ్మేళనంలో ప్రథమ బహుమతి పొందిన కవిత చదువడానికి వచ్చిన మంజీర పరిచయమవుతుంది. సోయగల ప్రవాహం లాంటి మంజీరను పలుకరించే వాళ్ళు చాలా మంది. విజేతలు ఇద్దరు మాటల్లోనే స్నేహం విరబూస్తుంది. మంజీర కవిత  చదువుతుంటే
 “ ఎదురుచూసేవు నిత్యం 
దేనికోసం నేస్తం 
జీవితంలో వెలుగు కోసమా?
వెలుగులా ఒక్క క్షణం
వెలిగిపోవడం కోసమా...? అనే చిరు కవిత ఎంతగానో పృథ్వీని ఆకట్టుకుంటుంది.

తర్వాత పృథ్వీ చదువుతాడు. అందులో 
“నా కాళ్లపై నేను నిలబడడం
నేను నేనుగా బతకడం 
కాదా జీవితం” అనే పదాలు మంజీరను ఎంతగానో సమ్మోహన పరిచాయి. 
    
కవిత పఠనం అనంతరం. సన్మానం జరిగింది. పృథ్వీ ఇంటికి వెల్లుదామనుకున్నా రవాణా లేకపోవడం వల్ల తచ్చాడుతూ రవీంద్ర భారతి పరిసరాల్లో ఉంటాడు.  సమీపంలో ఉంటున్న మంజీర ఇంటికి వెళ్ళిన తర్వత పృథ్వీ గురుతుకోస్తాడు. నిర్వాహకులు ఆశ్రయం కల్పించలేదని తెలిసి వెంటనే కారులో వచ్చి పృథ్వీని తీసుకపోతుంది. అన్ని విషయాలు  మాట్లాడుతుంటాడు. ఇంత పెద్ద బంగాళా. తోడు ఎవరులేకపోవడంతో విపరీతమైన ఆలోచనల నడుమ నిద్దుర రాదు. వారి మాటల ప్రవాహం తెల్లవర్లు కొనసాగుతుంది. మరునాడు సాయంత్రానికి గాని కుషాయిగూడకు చేరుకోడు.
    
ఏకాంబరానికి చిక్కిన కాంట్రాక్ట్లో ఆద్యంతం అవినీతి జరుగుతుందని ప్రతి పక్షనేత వీర నారాయణ  పత్రికాముఖంగా ప్రకటిస్తాడు. సీ ఏం వెంకట్రాముడి దృష్టిలో పరపతి కోల్పోతుంది. తత్ఫలితంగా పరీదకి ఏకాంబరానికి రాజకీయ పాతరపెట్టడానికన్నట్లు ఉప్పెన ముంచుకొస్తోంది. పరీద ఆలోచంతోనే కాదు అందంతోనూ పనులు చేయించుకుంటుంది. ఆ అందాన్ని ఆయుధంగా వాడి అంతం చేయడానికైనా వెనుకాడదు. అందువల్ల పరీద అనుకోవాలి కానీ జరుగని పని ఉండదు. పరీద నిన్ను గట్టెక్కిస్తే నాకేమిస్తావు అని ఏకాంబరాన్ని అడుగుతుంది. కుషాయిగూడలోని శాంతి నివాసం నీ పేరిట రాసిస్తానంటాడు.  
    
వీరనారాయణ పనిమనిషికి సినిమాల పిచ్చి. ఒకరోజు సినిమా చూసి వస్తుండగా పనిమనిషిని అడ్డగించి పోలీసు వేధిస్తాడు. వివిధ కేసుల కింద నీ జీవితం నాశనం చేస్తాన్నపుడు పోలీస్ పెట్టె షరతులకు లోబడి వీరనారాయణ కళ్ళద్దాలని తస్కరించి తెచ్చి పోలీస్ కిస్తుంది. ఆ పోలీస్ ఎవరో కాదు పరీద సహాయకుడు జోగప్ప. అన్నట్లే మరునాడు వీరనారాయణ కళ్ల జోడు తీసుకుంటాడు.  
    
జోగప్ప పరీదాకి సహాయకుడే కాదు అన్నీ సుఖాలు అందించేవాడు. జోగప్ప తండ్రి శివప్ప కూడా పరీదకి అశ్సిస్టెంటే. వీరనారాయణ కూతురు మంజుల చదివే కళాశాలకు వెళ్ళి ఇదిగో మీ నాన్న కళ్ల జోడు. మీ నాన్నకు ఆక్సిడెంట్ అయింది. ఫలానా హస్పిటల్లో ఉన్నాడనీ నమ్మకం కలిగించి ఏడుస్తున్న మంజులను తీసుకపోతాడు. మంజులతో పాటు ఆమె క్లోస్ ఫ్రెండ్ మాధవి వెళుతుంది. ఇద్దరు కారులో కిడ్నాప్ గావించబడుతారు. 
    
నిత్యం ప్రజల రాక పోకలతో జనసంద్రమయ్యే వీరనారాయణ ఇంట్లోకి  ఒక అపరిచితుడు ఒచ్చి అయ్యా మీతో మాట్లాడాలని అంటాడు.  వీరనారాయణ  చెప్పుమంటే చెప్పాడు.  మీతో రహస్యంగా మాట్లాడాలంటే ఒప్పుకుంటాడు. నీ కూతురు మంజులని కిడ్నాప్ చేశాము. నీ నుంచి కావాల్సింది ఏమిటో మేం చెబుతాం నువ్వు రా అనగానే వీరనారాయణ వెళ్ళిపోతాడు. 
    
పరీదాను చూడగానే ఓసి దుర్మార్గురాలా! నా కూతురును ఎందుకు కిడ్నాప్ చేసావె? అని ప్రశ్నిస్తాడు. నీవు మా అవినీతి అక్రమాలు బయటపెడితే మేము చూస్తూ ఊరుకుంటామా? అటు చూడు అనగానే జోగప్ప టీవి ఆన్ చేస్తాడు. 
  
 “నాన్నా! నీకు ఆక్సిడెంట్ అయ్యిందనీ నన్ను కిడ్నాప్ చేశారు నాన్న! నీవు నన్ను కాపాడు నాన్నా!” అని ఏడుస్తున్న కూతురుని చూసి వీరనారాయణ ఒక్కసారిగా అచేతనుడయ్యాడు. పరీద చెప్పినట్లు వింటానాని, అసలు కుంభకోణం జరుగలేదని పత్రికాముఖంగా ప్రకటిస్తుండగానే కూతురుని తీసుకొచ్చి వీరనారాయనకు అప్పగిస్తారు. అనుకున్నట్లే ఏకాంబరం ఊపిరి పీల్చుకుంటాడు. పరీదాకు తన శాంతి నివాసం రాసిస్తాడు. సంతోష సమయంలో ఈ ఇల్లు ఎక్కడిది అని అడిగితే. అది నాదే. అందులో నా కీప్ (ఉంపుడుకత్తే) కాంచన సీత ఉంటుంది. ఇలాంటి అనధికార గృహాలు ఇంచు మించు నాకు డజన్ మంది దాకా ఉంటారని ఆనందంతో చెప్తాడు.
    
పృథ్వీ ఇంటికి చేరుకొని సన్మాన కార్యక్రమ విశేషాలు చర్చిస్తున్నపుడు జోగప్ప కారులోంచి దిగి ఈ శాంతినివాసం మాది. మా పేరు మీదికి రిజిస్ట్రేషన్ అయ్యింది. కావున మీరు పది రోజుల్లో ఇల్లు కాళీ చేయాల్సిందేనని గట్టిగా చెప్తాడు. కాంచన సీత ఒక మూలకు చేరి ఏడుస్తుంటది. అందులో కిరాయికి ఉన్న వాళ్ళముందు వారి పరువు పోయింది. ఇల్లు ఖాళీ చేసిన పిదప పెద్దమ్మ కూతురు రాజేశ్వరినీ డబ్బులు పంపి ఆదుకొమ్మనీ పృథ్వీ ఉత్తరం రాస్తే  మేం చాలా నష్టాల్లో ఉన్నామనీ తిరుగు టపాలో రాస్తుంది. 
    
పెద్దమ్మ రాధాదేవిని అడిగితే జరిగిన విషయం పూసగుచ్చినట్లు చెబుతుంది. నేను ఏకాంబరం చేతిలో మోసపోయిన. అప్పటికే నాకు ఆయన ద్వారా నిన్ను పెళ్లిచేసుకుంటాను కానీ ఆ పిల్లను నాకు పెళ్లిచేయిమన్నాడు. అప్పటికే కోస్తాంధ్ర తూఫాన్లో సర్వం కోల్పోయి హైద్రాబాద్లో   తచ్చాడుతుండగా నేను చేరదీశాను. నా స్వార్థం కోసం పదిహేను ఏళ్ళ మీ అమ్మని కట్టబెట్టిన.రాజేశ్వరి కూతురు కావేరీ పృథ్వీకి ఒక ఉత్తరం రాస్తుంది. మొన్నటి ఉత్తరంలో మా అమ్మ రాసినదంతా అబద్ధం. నాకు ఒక అనామకుడితో పెళ్లి చేయనుద్దేశించింది. ఈ విషయం అమ్మమ్మకు కనీసం చెప్పలేదు. ఆ పెళ్లి ఆపి నన్ను నీదాన్ని చేసుకో మామయ్య అని రాస్తుంది. అప్పటికే పెళ్లి తేదీ దాటి పోతుంది. తనవాళ్ళు డబ్బుల్లేకపోవడం వల్ల ఎట్లా మోసం చేశారనీ బాదపద్తాడు మంజీరనీ కలువుడానికి వెళ్ళినపుడు ఆమె ఫ్లాట్లో గిరి ఉంటాడు. పృథ్వీ వెళ్ళగానే వెళ్ళిపోతాడు. మంజీరకు తన బాదను చెప్తాడు. బతుకాలనీ లేదంటాడు. నీ కవిత ఒకటి రాస్తావు?ఆచరణలో మరొకటా? అని నిలదీస్తుంది.  నీకేంది నువ్వే గొప్ప. అని అన్నపుడు నా బతుకు చింపిన విస్తరిలా అయ్యింది. చెస్ లో గెలుస్తున్నపుడు నన్ను అనేక చోట్ల తింపుతూ ఒక రోజు మా నాన్నగారితో నేను పెళ్లి చేసుకున్నాన్నాడు. దాంతో ఎంత బతిమాలిన నన్ను ఇంట్లోంచి  వెలివేశారు. గత్యంతరమ్ లేక పెళ్ళైన గిరితో సహజీవనం చేస్తున్న. ఇప్పుడు చెప్పు గొప్ప నువ్వా? నేనా? అని అంటుంది. ఒకకొరిక కోరుతూ నీవు చనిపోవాలంకున్నపుడు నాతో ఒక్కసారి మాట్లాడు అని వెళ్ళినపుడు చెపుతుంది.  
    
ఎంతో ఆలోచిస్తున్న చావు నుంచి పారిపోలేక మరో రోజు మంజీరను కాలువడానికి పోతూ రవీంద్రభారతిలో ఏకాంబరాని చూసి నాన్న అని పిలిచినందుకు తన అనుయాయులతో బాగా కొట్టిస్తాడు. దగ్గర్లోని నర్సింగ్ హోంలో చేర్చి ట్రీట్మెంట్ తీసుకుంటూన్నపుడు బయటినుచి వచ్చిన వ్యక్తి బార్యభర్తలుగా సంబోధించినందుకు మంజీర సంతోశపడుతుంది.
    
ఏకాంబరం హిమాయత్ నగర్ లోని నివాసానికి ఏదో పనిమీద కాలువడానికి వచ్చిన జోగప్ప మాధవిని చూసి ఏకాంబరం కూతురుగా నిర్దారించుకుంటాడు. తన ద్వారా మంజుళను, మాడవిని చెరిచిన విషయం చెప్పి ఈ తప్పిదం నుండి నువ్వేకాపాడాలనీ వేడుకుంటాడు. వీరనారాయణ, ఏకాంబరం కలిస్తే నన్ను, నిన్ను చంపుతారు అని పరీద ఒక పథకం వేస్తుంది.
    
అప్పటికే పీకల్దాక ఏకాంబరం మీద కోపమ్మీద ఉన్న పృథ్వీని పిలిపించుకొని ఏకాంబరాన్ని అంతం చేయాలనిపథకం వేస్తుంది. నాకేమీ లాభం అని అన్నందుకు నీకు శాంతి నివాసం రిజిస్ట్రేసన్ చేస్తే సరేనంటాడు. కాంచనసీత మీదికి రిజిస్ట్రేసన్ అవుతుంది. 
    
పతాకం ప్రకారం ఏకాంబరాన్ని కారులో ఉన్నపుడు నమ్మించి క్లోరోఫామ్ చూపించి మత్తకొలిపి కారుతో సహా పెద్ద కన్తైనెర్లో కార్తో సహ కిడ్నాప్ చేసి సిటీ దాటింతర్వాత కార్లో ఆదిలాబాద్ పరిసార ప్రాంతం లోని శ్రీరామ్ సాగర్  బొట్లో పంపించి నమ్మింఛీ గుట్ట మీద ఏకాంబరాన్ని కాల్చివేస్తాడు. మరో కాంచనసీత బలి కాకూడనుకుంటాడు.   జోగప్ప పరీద బయలుదేరి పోతుంటరు. నన్ను ఎక్కడ హంతకునిగా ఎక్కడ చిత్రీకరిస్తారేమోనని వారి  మోశాన్ని గ్రహించిన పృథ్వీ అప్పటికే ఏకాంబరం యొక్క  ఊడదీసిన బట్టల్లో వెతుకుతుంటే  వాట్లో పాకెట్ డైరీల్లో వడియారం పోలీస్ స్టేషన్కి పోన్ చేసి విషయం చెప్తే అప్పటికే అక్కడికి చేరుకున్న కారును చేసింగ్ చేస్తూ తూటాలు కాల్చుతూ టైర్లకు కాలువగానే పల్టీలు కొడుతున్నపుడు మరో తూటా డీసీల్ టాంక్ తగిలి కారు మంటల్లో కాలిపోయింది. 
    
మంజీరను పెల్లి చేసుకొని శాంతి గార్మెంట్స్ ద్వారా ఇంటిలోని సభ్యులందరికి ఉపాధితోపాటు పచ్చగా బతుకుతుంటారు. కష్టాలతో, కన్నీళ్లతో  జీవితం చేసిన సంతకం ఇదే.
                                 
   డాక్టర్ సిద్దెంకి యాదగిరి 

Follow Us:
Download App:
  • android
  • ios