Asianet News TeluguAsianet News Telugu

ఆగస్టులో సెక్స్ ఫెస్టివల్... రోజుకి ఇద్దరు అమ్మాయిలతో...

మన దేశంలో ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నంత సింపుల్ గా విదేశాల్లో సెక్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న యూకేలో ఇలాంటి ఫెస్టివల్ ఒకటి నిర్వహించారు. 

Island trip offering unlimited romance with 100 girls back in new secret location
Author
Hyderabad, First Published Jul 11, 2019, 11:44 AM IST

మన దేశంలో ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నంత సింపుల్ గా విదేశాల్లో సెక్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మొన్నటికి మొన్న యూకేలో ఇలాంటి ఫెస్టివల్ ఒకటి నిర్వహించారు. అక్కడ కేవలం ఎవరి జంటతో వాళ్లే ఇష్టారాజ్యంగా శృంగారంలో పాల్గొంటారు. కానీ... అమెరికాలో వచ్చే నెల ఆగస్టులో నిర్వహించనున్న సెక్స్ ఫెస్టివల్ మాత్రం అంతకమించి అంటున్నారు దాని నిర్వాహకులు.

అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్‌ ఐలాండ్‌’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్‌ ఆరువేల డాలర్లు.  కేవలం పురుషులు మాత్రమే ఇందులో పాల్గొంటారు. డబ్బులు చెల్లించి వెళ్లిన పురుషులు ప్రతిరోజూ ఇద్దరు అమ్మాయిలతో ఇష్టానుసారంగా శృంగారం చేయవచ్చు. 

వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్‌ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు. హెలికాప్టర్‌ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్‌ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్‌ అండ్‌ ఫ్రెండ్లీ వెకేషన్‌’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట. 

అయితే... శృంగార వరకు ఒకే గానీ... డ్రగ్స్ లాంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయమని అక్కడి ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ఫెస్టివల్ పై ఇప్పటికే కన్నేసి ఉంచామని... డ్రగ్స్ లాంటివి వినియోగిస్తున్నారని తెలిస్తే.. నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు చాలా మంది విదేశీయులు ఉత్సాహం చూపించడం విశేషం. ఈ ఫెస్టివల్ నిర్వాహకుల వద్ద కనీసం 100మంది అదంమైన యువతులు ఉన్నారట. వారితో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. 

‘ఆర్గ్‌ హాలీడే’ అనే పొర్న్‌ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్‌ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ’ వారు తెలిపారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్‌కు కట్టుబడి ఉంటారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios