Father's Day 2025: నాన్నకు ప్రేమతో.. ఈ గిఫ్టులతో సర్‌ప్రైజ్ చేయండి..
Father's Day 2025: జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే. ఈ రోజు మామూలు బహుమతులు పక్కన పెట్టి, నాన్న ఆరోగ్యానికి తోడ్పడే విలువైన కానుకలిచ్చి ఆయన్ను ఆశ్చర్యపరచండి. ఒకేసారి మీ ప్రేమను, అప్యాయతను చూపించండి. ఆ విలువైన బహుమతులేంటో ఓ లూక్కేయండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బియర్డో థగ్ లైఫ్ పెర్ఫ్యూమ్ కాంబో
మీ నాన్న స్టైలిష్ అండ్ మోడ్రన్ గా డ్రెస్సింగ్ చేసుకునే వాడైతే.. బియర్డో థగ్ లైఫ్ పెర్ఫ్యూమ్ కాంబోను గిప్ట్ గా ఇవ్వండి. ఈ కాంబోలో 4 పెర్ఫ్యూమ్‌లు ఉన్నాయి. బియార్డో విస్కీ స్మోక్ పెర్ఫ్యూమ్ EDP (50ml), బియార్డో మెరైనర్ పెర్ఫ్యూమ్ EDP (50ml), మాఫియా పెర్ఫ్యూమ్ EDP(50ml), విస్కీ స్మోక్ బోర్బన్ పెర్ఫ్యూమ్ EDP (50ml). ఈ పెర్ఫ్యూమ్ సువాసన మీ నాన్నను నలుగురులో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఏ ఈవెంట్ లోనైనా ఈ పెర్ఫ్యూమ్ వాడితే సెంట్రర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతారు.
స్కల్‌కాండీ డైమ్ ఈవో ఇయర్ బడ్స్
మీ నాన్న మ్యూజిక్ లవర్ లేదా బిజీ పర్సన్ అయితే.. స్కల్‌కాండీ డైమ్ ఈవో ఇయర్‌బడ్స్ ను గిప్ట్ గా ఇవ్వండి. ఈ ఇయర్ బడ్స్ లో పుష్ ANC యాక్టివ్, అల్ట్రా-సెక్యూర్, లో-ప్రొఫైల్ ఇయర్ హ్యాంగర్‌లు, వాటర్‌ప్రూఫ్, అడ్జస్టబుల్ స్టే అవేర్ మోడ్, 4-మైక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్‌తో వంటి ఎన్నో ప్యూచర్స్ ఇందులో ఉన్నాయి. డైమ్ ఈవో ఇయర్ బడ్స్ ను పోర్టబుల్ పవర్‌హౌస్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. IPX4 వాటర్-రెసిస్టెన్స్, 36 గంటల బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. మల్టీపాయింట్ పెయిరింగ్ మల్టీ-టాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది. ఏదైనా బడ్‌పై సింపుల్ బటన్ ప్రెస్ చేసి, కాలింగ్ చేయవచ్చు. అమేజింగ్ ప్యూచర్స్ ఉన్న ఈ ఇయర్ బడ్స్ కేవలం రూ. 4999కే లభిస్తున్నాయి.
గ్యాబిట్ స్మార్ట్ రింగ్
మీ నాన్న ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టడానికి ఫిట్‌నెస్ ట్రాకర్ ఇవ్వండి. గ్యాబిట్ స్మార్ట్ రింగ్ అనేది ఓ హెల్త్ ట్రాకర్. ఇది మన ఫిట్‌నెస్, న్యూట్రిషన్, నిద్ర, ఒత్తిడి వంటి ఆరోగ్య విషయాలను ట్రాక్ చేస్తుంది. టైటానియంతో తయారు చేయబడిన ఈ హెల్త్ ట్రాకర్ హార్ట్ బీట్, కేలరీలు, Vo2max, HRV, SpO2, బాడీ టెంపరేచర్ వంటి ఇతర ముఖ్యమైన ఆరోగ్య విషయాలను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది. కేవలం 3.1 గ్రాముల బరువుతో, ఇది చాలా తేలికగా ఉంటుంది. 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో దీని సొంతతం. గ్యాబిట్ స్మార్ట్ రింగ్ కేవలం ధర రూ. 13,110 మాత్రమే.
Pebble Royale
మీ నాన్నను మరింత స్మార్ట్ గా మార్చాలనుకుంటే.. పెబుల్ రాయల్ వారి స్మార్ట్ వాచ్ ను గిప్ట్ గా ఇవ్వండి. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ ఇదే. ఈ వాచ్ లో 1.43 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, వైర్డ్ ఛార్జింగ్, 260mAh బ్యాటరీ వంటి ప్యుచర్స్ ఉన్నాయి. అలాగే.. స్టాప్‌వాచ్, టార్చ్, టైమర్ తో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, పెడోమీటర్ వంటి ప్యుచర్స్ ఉన్నాయి.