తమ ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2023–24లో తాము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు అని వెల్లడించారు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉందన్నారు. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటున్నారని.. బడ్జెట్లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారని ఎత్తిచూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు.