తరచూ మూత్రం రావడం.. మూత్రం లీక్ అవుతుండటంతో.. ఓ మహిళ వైద్యులను ఆశ్రయించింది. అనుమానంతో వైద్యులు ఆమె మూత్రాశయాన్ని స్కాన్ చేయగా.. అందులో గాజు గ్లాస్ కనపడింది. ఆమె సెక్స్  టాయ్ గా దానిని ఉపయోగించడం వల్ల.. ఇలా జరిగిందని తర్వాత తేలడం గమనార్హం.

ఓ మహిళ తన మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సోకిందంటూ వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే...  స్కానింగ్ లో.. ఆమెకు ఇన్ఫెక్షన్ కాదు అని.. మూత్రాశయంలో గాజు గ్లాసు ఉందని గ్రహించారు. ఈ సంఘటన ట్యూనీషియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ)  అంటూ 45ఏళ్ల మహిళ వైద్యులను సంప్రదించింది. అయితే.. ఆమె బ్లాడర్ లో.. నాలుగేళ్లుగా గాజు గ్లాసు ఇరుక్కుందని తెలిసి వైద్యులు కూడా షాకయ్యారు. 

తరచూ మూత్రం వస్తోందని.. పలుమార్లు మూత్రం లీక్ కూడా అవుతోందని ఎందుకలా అవుతోందో తెలీక.. ఆమె వైద్యులను కలిసింది. ఈ క్రమంలో ఆమెకు మూత్రాశయం స్కాన్ చేశారు. అుందోల.. పెద్ద సైజు రాయి కనిపించింది. ఆ రాయి 8-సెంటీమీటర్ల వెడల్పు కలిగిన "జెయింట్" అని వైద్యులు చెప్పారు, అది పూర్తిగా మంచి నీరు తాగే గ్లాసులా కనిపించిందని వారు చెప్పారు. అయితే.. ఆ బాధిత మహిళ ఎవరు అనే విషయాన్ని మాత్రం వైద్యులు చెప్పకపోవడం గమనార్హం. 

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, నాలుగేళ్ల క్రితం తాను డ్రింకింగ్ గ్లాస్‌ను సెక్స్ టాయ్‌గా ఉపయోగించానని మహిళ వైద్యులకు చెప్పింది. ఆమె తన యోనిలోకి ఆ గ్లాసును చొప్పించుకుంది. అది కాస్త మూత్రాశయంలో ఇరుక్కుపోవడం గమనార్హం.

స్కాన్ లో  గాజు, రాయి ఎన్‌కేసింగ్ చిత్రాలు కనపడుతుండటం గమనార్హం.

మెడికల్ జర్నల్ అటువంటి వస్తువులను "ఇంట్రా-వెసికల్ ఫారిన్ బాడీస్" గా వివరిస్తుంది. ఇలాంటి కేసులు ఇంతకు ముందు నమోదయ్యాయని , చాలా మంది రోగులు వాటిని స్వయంగా తొలగించడంలో విఫలమయ్యారని , వైద్య సలహా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, దీని ఫలితంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వారు చెప్పారు.

ట్యునీషియా నగరంలోని స్ఫాక్స్‌లోని హబీబ్ బోర్గుయిబా యూనివర్శిటీ హాస్పిటల్‌లోని వైద్యులు సదరు మహిళకు  సిస్టోలిథోటమీని నిర్వహించాల్సి వచ్చింది - మూత్రాశయ రాయిని తొలగించడానికి ఉపయోగించే ఒక రకమైన ఓపెన్ సర్జరీ.

మూడ్ డిజార్డర్స్ తప్ప ఎలాంటి మెడికల్ హిస్టరీ కనిపించలేదని వారు తెలిపారు. ఆమె మూత్రంలో రక్తం లేదని వైద్యులు కూడా చెప్పారు.