Asianet News TeluguAsianet News Telugu

బర్డ్ ఫ్లూ పంజా: ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్న వైరస్ వ్యాప్తి.. నిపుణుల హెచ్చరిక‌లు

Bird flu virus: బర్డ్ ఫ్లూ వైరస్ వేగంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2021 మధ్యలో ఏదో జరిగిందని పేర్కొంటూ ఇది వైరస్ ల‌ సమూహాన్ని మరింత అంటువ్యాధిగా మార్చిందని జంతువులలో ఇన్‌ఫ్లుయెంజాను అధ్యయనం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం అధిపతి రిచర్డ్ వెబ్బీ చెప్పారు.
 

Bird flu virus: Cases on the rise across the globe  Expert warnings RMA
Author
First Published Jun 3, 2023, 2:18 PM IST

Bird Flu Virus Outbreak: ప్రపంచవ్యాప్తంగా పక్షుల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా కేసులకు కారణమయ్యే వైరస్ వేగంగా మారుతోందనీ, దేశాలు తమ కోళ్లకు టీకాలు వేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవులకు ప్రమాదం తక్కువగానే ఉందని నొక్కి చెప్పిన నిపుణులు క్షీరదాల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. 1996 లో మొదటిసారి బయటపడినప్పటి నుండి, హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ గతంలో ఎక్కువగా కాలానుగుణ వ్యాప్తికి పరిమితమైంది. కానీ 2021 మధ్యలో ఏదో జరిగిందని పేర్కొంటూ ఇది వైరస్ ల‌ సమూహాన్ని మరింత అంటువ్యాధిగా మార్చిందని జంతువులలో ఇన్‌ఫ్లుయెంజాను అధ్యయనం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం అధిపతి రిచర్డ్ వెబ్బీ చెప్పారు.

అప్పటి నుండి ఈ వైరస్ వ్యాప్తి సంవత్సరం పొడవునా కొనసాగిందనీ, కొత్త ప్రాంతాలకు వ్యాపించిందని తెలిపారు. ముఖ్యంగా అడవి పక్షులలో అధిక‌సంఖ్య‌లో సామూహిక మరణాలకు దారితీసిందని పేర్కొన్నారు. అమెరికా నగరం మెంఫిస్ లోని సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ పరిశోధకుడు వెబ్బీ ఏఎఫ్ పీతో మాట్లాడుతూ ప్రపంచం చూసిన అతిపెద్ద ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వ్యాప్తి ఇదేనని చెప్పారు. యూరప్ నుంచి ఉత్తర అమెరికాకు వ్యాపించడంతో వైరస్ వేగంగా ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తూ నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ఈ వారం ప్రచురితమైన పరిశోధనకు ఆయన నేతృత్వం వహించారు. ఉత్తర అమెరికాలోకి ప్రవేశించినప్పుడు వైరస్ వైరస్ తీవ్రత పెరిగిందనీ, అంటే ఇది మరింత ప్రమాదకరమైన వ్యాధికి కారణమవుతుందని అధ్యయనం తెలిపింది. పరిశోధకులు ఒక ఫెర్రెట్ కు బర్డ్ ఫ్లూ కొత్త జాతులలో ఒక‌టి సోకింద‌ని గుర్తించారు. దాని మెదడులో ఊహించని విధంగా భారీ మొత్తంలో వైరస్ ను కనుగొన్నట్లు వెబ్బీ చెప్పారు. ఇది మునుపటి స్ట్రెయిన్ల కంటే తీవ్రమైన వ్యాధిని కలిగించిందని సూచిస్తుంది.

మానవులలో ప్రమాదం ఇంకా తక్కువగా ఉందని నొక్కిచెప్పిన ఆయన.. ఈ వైరస్ స్థిరంగా లేద‌నీ, ఇది వేగంగా మారుతోంద‌ని హెచ్చ‌రించారు. ఇది యాదృచ్ఛికంగా కూడా ఈ వైరస్ మానవ వైరస్ వలె ఉండటానికి అనుమతించే జన్యు లక్షణాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతోంద‌ని తెలిపారు. అరుదైన సందర్భాల్లో, మానవులు కొన్నిసార్లు ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు, సాధారణంగా సోకిన పక్షులతో సన్నిహిత సంబంధం ఉంట‌డం వ‌ల్ల ఇది జ‌రిగింద‌న్ని తెలిపారు. అయితే, పెరుగుతున్న క్షీరదాలలో కూడా ఈ వైరస్ కనుగొనబడిందనీ, ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన సంకేతంగా వెబ్బీ అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉత్తర తీరం వెంబడి దాదాపు 9,000 సముద్ర సింహాలు, పెంగ్విన్లు, ఓట్టర్లు, పోర్పోయిస్, డాల్ఫిన్లు బర్డ్ ఫ్లూతో మరణించినట్లు చిలీ గత వారం తెలిపింది. చాలా క్షీరదాలు వైర‌స్ సోకిన పక్షిని తినడం ద్వారా వైరస్ బారిన పడ్డాయని భావిస్తున్నారు.

స్పానిష్ మింక్ ఫామ్ లేదా దక్షిణ అమెరికాలోని సముద్ర సింహాల మధ్య ఈ వైరస్ క్షీరదాల మధ్య వ్యాప్తి చెందుతుందనే సంకేతాలు తమను ఎక్కువగా భయపెడుతున్నాయని వెబ్బీ చెప్పారు. క్షీరదాల్లో ఈ వైరస్ సులభంగా మనుగడ సాగిస్తుందనడానికి ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని యూకే యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ వైరాలజీ హెడ్ ఇయాన్ బ్రౌన్ తెలిపారు. ఈ వైరస్ పక్షులలో మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా మారుతున్నప్పటికీ, ఇది మానవులకు సోకలేదని బ్రౌన్ చెప్పిన‌ట్టు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. మొత్తం బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్యను తగ్గించడానికి, మానవులకు ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక మార్గం దేశాలు తమ పౌల్ట్రీకి టీకాలు వేయడం అని వెబ్బీ చెప్పారు. చైనా, ఈజిప్టు, వియత్నాం సహా కొన్ని దేశాలు ఇప్పటికే పౌల్ట్రీకి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లు నిర్వహించాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో దిగుమతి ఆంక్షల కారణంగా అనేక ఇతర దేశాలు విముఖత చూపుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios