MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Tennis
  • Novak Djokovic: ఆస్ట్రేలియాలో దారుణ అవమానం.. అయినా మారని జొకో.. మరో రెండు కీలక టోర్నీలకు దూరం

Novak Djokovic: ఆస్ట్రేలియాలో దారుణ అవమానం.. అయినా మారని జొకో.. మరో రెండు కీలక టోర్నీలకు దూరం

Novak Djokovic To Miss Two More Tourneys: మాజీ వరల్డ్ నెంబర్ వన్  నొవాక్ జొకోవిచ్ మొండివైఖరి వీడటం లేదు. ఆస్ట్రేలియాలో అవమానం ఎదురైనా.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు పోయినా అతడి వైఖరిలో మార్పులేదు.  

2 Min read
Author : Srinivas M
Published : Mar 11 2022, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సెర్బియన్ సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చిన డోసు సరిపోలేదేమో..  ‘కరోనా వ్యాక్సిన్ వేసుకో..’ అని ఎంత మంది చెబుతున్నా అతడు  మాత్రం తన మొండి వైఖరిని వీడటం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ లో వ్యాక్సిన్ వేసుకోకపోవడం, కరోనా నిబంధనలను పాటించకపోవడంతో అతడు కీలక టోర్నీ నుంచి  దూరమవడంతో పాటు తీవ్ర విమర్శల పాలైనా అతడు మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. 

38

వ్యాక్సిన్ వేసుకోని కారణంగా అతడు ఇప్పుడు మరో  రెండు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్లలో భాగంగా..  అమెరికా వేదికగా ఈ  మాసాంతంలో మొదలుకాబోయే  ఇండియన్ వెల్స్, మియామి టోర్నీల నుంచి కూడా  తప్పుకున్నాడు. ఇటీవలే అతడు  పురుషుల టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. 

48

అమెరికా లోని సెంట్రల్ ఫర్ డిసీస్ కంట్రోల్ (సీడీసీ) నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకోని  విదేశీయులను వారి దేశంలోకి అనుమతించబోమని  ఆ దేశం ఇప్పటికే ప్రకటించింది. 

58

ఈ నేపథ్యంలో జొకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్ మాదిరిగానే ఈ రెండు టోర్నీల నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ట్విట్టర్ వేదికగా తెలపడం గమనార్హం.  
 

68

జొకో ఇప్పుడున్న ఫామ్ ను బట్టి చూస్తే ఈ రెండు టోర్నీలలో  ఆడబోయే ప్రత్యర్థులు, సాధించబోయే విజయాలు పెద్ద విషయమే కాదు. కానీ వ్యాక్సినేషన్ కు దూరంగా ఉండటంతో అతడు వరుసగా టైటిళ్లకు దూరంగా ఉండాల్సిన  దుస్థితి ఏర్పడింది. 

78

 ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ లతో  రఫెల్ నాదల్ (21) తర్వాత  స్థానంలో నిలిచిన  జొకో..  అతడి రికార్డును అధిగమించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని తెలిసినా అతడు మాత్రం బెట్టు వీడటం లేదు. 

88

ఇది ఇలాగే కొనసాగితే  జూన్ నుంచి పారిస్ వేదికగా జరుగబోయే ఫ్రెంచ్ ఓపెన్ కు కూడా జొకోవిచ్ ఆడేది అనుమానమే. ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన అనంతరం పారిస్ కూడా ఆసీస్ తరహా ఆంక్షలనే విధించింది. తమ దేశానికి క్రీడల నిమిత్తం వచ్చే ఆటగాళ్లంతా తప్పకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
PV Sindhu: జపాన్ ఓపెన్ హిస్టరీలో ఫస్ట్ ఇండియన్.. పీవీ సింధు మైండ్ బ్లోయింగ్ విక్టరీ
Recommended image2
Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !
Recommended image3
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved