ఐఫోన్ 15 ధర అడిగితే షాక్! మరీ ఇంత కాస్ట్లీ ఆహ్.. ? ఈ డబ్బుతో ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చని కామెంట్..
ఆపిల్ ఐఫోన్ కొనడం దాదాపు ప్రతి ఒక్కరి కల. కానీ అంత డబ్బు ఒకేసారి సెట్ చేయడం కష్టం. ఇండియాలో ఐఫోన్ కాస్ట్లీ అని తెలుసు కానీ పాకిస్థాన్ లో దీని ధర వింటే షాక్ అవుతారు. ఐఫోన్ ఉన్న వ్యక్తిని కాస్త రిచ్ లేదా అఫీషియల్ అని అంటుంటారు. ఈ రోజుల్లో భారతదేశంలో చాలా మంది ప్రజల చేతుల్లో ఐఫోన్ కనిపిస్తుంది. ఐఫోన్ చేతిలో ఉంటే ఆ లుక్ వేరు.
You will be shocked to hear the price of iPhone 15 in Pakistan
ఐఫోన్ కొనుక్కోవడానికి బంగారాన్ని అమ్మిన సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో iPhone సంబంధిత జోక్‌లను చూడవచ్చు. కిడ్నీ అమ్మైనా సరే ఐఫోన్ కొంటాం అనేవారూ ఉన్నారు. భారత్‌లో ఐఫోన్ కొనడం అనుకున్నంత కష్టం కాదు. అయితే పాకిస్థాన్‌లో ఐఫోన్ కొనడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే పాకిస్థాన్‌లో ఐఫోన్ ధర వింటే షాక్ నోరెళ్లబెట్టాల్సిందే...
ఐఫోన్ 15 కొత్త సిరీస్ సేల్స్ సెప్టెంబర్ 22 నుండి మొదలయ్యాయి. 48 MP లెన్స్, A16 వియోనిక్ చిప్, iOS 17 ఉన్న iPhone 15 128GB మోడల్ ధర ఇండియాలో రూ.79,900. iPhone 15 Plus 128GB మోడల్ ధర రూ.89,900. అయితే మన పక్క దేశం పాకిస్థాన్‌లో ఈ ఫోన్‌ల ధరను అడిగితే చెమటలు పట్టేస్తాయి. కొనడం అందని ద్రాక్ష లాంటిది. పాకిస్థాన్‌లో ఐఫోన్ 15 ధర ఎంతో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని చదివిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌లో ఐఫోన్ 15 ధర ఎంతో తెలుసా?
సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ సైట్‌లో @pallavipandey అనే యూజర్ iPhone 15 ధర పాకిస్థాన్‌లో అధికంగా ఉందని పోస్ట్ చేసారు. ఈ విషయం కొంచెం నిజమైనప్పటికీ ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర పాకిస్థాన్‌లో 7.5 లక్షల రూపాయలు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 3 లక్షల 63 వేలకు పైగా చూసారు. ఇంకా రెండు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
పాకిస్థాన్‌లో iPhone 15 ధర రూ.3,66,708 నుంచి ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన iPhone 15 Pro Max 512 GB ధర రూ.5,99,593. భారతదేశంలో దీని ధర రూ.1,79,900.
యూజర్ కామెంట్ ఏమిటి? : పాకిస్థాన్‌లో ఐఫోన్ ధర అడిగిన వ్యక్తులు తమదైన స్టయిల్ లో కామెంట్ చేస్తున్నారు. కిడ్నీ అమ్ముకున్నా ఐఫోన్ దొరకడం కష్టమని ఒకరు కామెంట్ చేయగా, భారత్‌లో కొనండి పాకిస్థాన్‌లో అమ్మండి అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఈ ధరతో యూపీలో ఫ్లాట్ కొనుక్కోవచ్చని ఇంకొకరు రిప్లయ్ చేసారు.
అసలు నిజం ఏంటో తెలుసా? : పాకిస్తాన్ కరెన్సీ భారతీయ కరెన్సీకి భిన్నంగా ఉంటుంది. ఒక పాకిస్తానీ రూపాయి 0.29 భారత రూపాయికి సమానం. అంటే పాకిస్థాన్‌లో ఆవరేజ్ ధర రూ.5,99,593 భారతదేశంలో ధర రూ.1,72,177. భారత్ అండ్ పాకిస్థాన్‌లలో ఐఫోన్ 15 ధరలో పెద్దగా తేడా లేదని టెక్ ఎక్స్పర్ట్ స్పష్టం చేశారు.