భార్యాభర్తలు చాలా రోజులుగా సెక్స్ కు దూరంగా ఉంటే ఇన్ని సమస్యలొస్తయా?
పెళ్లైన ప్రతి జంట జీవితంతో సెక్స్ చాలా చాలా ముఖ్యం. ఇది ఇరువురి మధ్య ప్రేమను, నమ్మకాన్ని, భావోద్వేగాన్ని పెంచడంతో పాటుగా.. వీరికి ఎన్నో రోగాల ముప్పును కూడా తగ్గిస్తుంది. ఏ కారణం చేతనైనా వీరు సెక్స్ కు దూరంగా ఉంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Sleep after sex
వైవాహిక జీవితంలో లైంగిక కార్యకలాపాలు ఖచ్చితంగా ఉండాలి. వివాహిత దంపతుల జీవితంలో ఇది సహజమైన, ఆరోగ్యకరమైన ఒక ముఖ్యమైన భాగం. రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనే దంపతుల బంధం బలంగా ఉంటుంది. అలాగే వారి మధ్య నమ్మకం, భావోద్వేగం కూడా బాగుంటాయి. సెక్స్ ఇద్దరి మానసిక, సామాజిక, భావోద్వేగ, శారీరక బలాన్ని మెరుగుపరుస్తుంది. అయితే దంపతులు సంభోగంలో పాల్గొనకపోతే ఎన్నో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
=
మానసిక సమస్యలు
సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల మొత్తం శరీరం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా భావోద్వేగ స్థాయిలు. సెక్స్ లో పాల్గొనడం ఆపేసినప్పుడు వీరు ఒంటరితనం, భావోద్వేగం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.
టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్
సెక్స్ లో పాల్గొనడం పూర్తిగా మానేసినప్పుడు మీ శరీరంలో మార్పు వస్తుంది. అంటే దీనివల్ల మీ శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు విడుదల అవడం ఆగిపోతాయి. వీటిని లైంగిక హార్మోన్లు అని కూడా అంటారు. ఇవి శరీరంలో ప్రేరణ, కోరికను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
హార్మోన్ లెవల్స్ తగ్గుతాయి
రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే హార్మోన్ లెవల్స్ బాగా తగ్గుతాయట. దీంతో మీ లైంగిక వాంఛ తగ్గుతుంది. అందుకే శృంగారంలో పాల్గొనకపోవడం మీ శరీరంలో హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయిజ. అలాగే లైంగిక కార్యకలాపాలకు మీ శరీరం.. శారీరక ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది.
=
లైంగిక సమస్యలు
సంభోగం లేకపోవడం వల్ల మీ శరీరం సున్నితంగా మారుతుంది. అంటే దీనివల్ల జననేంద్రియ ప్రాంతాలకు రక్తప్రవాహం తగ్గుతుంది. ఇదిది లైంగిక ఉద్దీపనలు, ప్రతిస్పందనతో సమస్యలను కలిగిస్తుంది. ఇది లైంగిక సమస్యలను కలిగిస్తుంది.
కండరాల బలహీనత
సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల ఆడవారి కటి ప్రాంతంలో కండరాలు బలహీనపడతాయి. కాగా రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఈ కండరాలు బలపడతాయి. ఇది మూత్రం, లైంగిక పనితీరుకు మద్దతునిస్తుంది. ఈ కండరాలు బలహీనపడటం వల్ల మూత్రాన్ని ఆపుకోలేరు. అలాగే లైంగిక సంతృప్తి తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
వ్యక్తికి వ్యక్తికి మారుతుంది
ఎక్కువ రోజులు సెక్స్ కు దూరంగా ఉండటం వల్ల కలిగే ప్రభావం వ్యక్తికి వ్యక్తికి మారుతుందని నిపుణులు అంటున్నారు. అంటే ఇవి వయస్సు, ఆరోగ్యం, సంబంధాల స్థితి, వ్యక్తిగత ప్రాధాన్యతలు వంటి కారకాల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది.