Relationship: దంపతులని గిల్లికజ్జాలు డిస్టర్బ్ చేస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలతో మరింత దగ్గరవ్వండి?
Relationship: బంధం అన్న తర్వాత ఆ మాత్రం గిల్లికజ్జాలు లేకుండా ఎలా ఉంటాయి.అందరు దంపతులు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అయితే చాలామంది లా తెగేదాకా లాగకుండా ఈ చిట్కాలు పాటించండి. బంధాన్ని మరింత దగ్గర చేసుకోండి.
Image: Getty
ఎంత అన్యోన్యమైన దంపతులైనప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక అవసరాల దృష్ట్యా ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా గొడవ పడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొందరు చిన్న సమస్యని పెద్దదిగా చేసి చివరికి బంధాన్ని తెంచేసుకుంటారు. కొందరు అదే సమస్యని చిగురాకు లాగా తీసి పడేస్తారు.
కేవలం ఆలోచన విధానం లోని పరిష్కార మార్గం ఆధారపడి ఉంటుంది. నిజమైన బంధం మధ్యలో గొడవలు బంధాన్ని మరింత పెంచుతాయి అంటున్నారు మానసిక నిపుణులు. అయితే గొడవ పడినప్పుడు ఈ చిట్కాలు పాటించి గొడవని చేయమంటున్నారు.
సాధారణంగా భార్యాభర్తలు గొడవపడితే ఇద్దరు మాట్లాడటం మానేస్తారు. తర్వాత ఎదుటి వాళ్లు మాట్లాడాలని ఆశిస్తారు. అప్పుడప్పుడు ఆ విధానం మంచిదే కానీ శృతిమించుతుంది అన్నప్పుడు మీ ఆహ్వాని పక్కనపెట్టి మీరే మీ భాగస్వామితో మాట్లాడటం మొదలుపెడితే ఖచ్చితంగా మీ భాగస్వామి మీకు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు.
అలాగే కోపంలో ఉన్నప్పుడు భాగస్వామి ని ఇష్టం వచ్చినట్లు తిట్టకండి. అదే సమస్యను పరిష్కరించదు సరి కదా ఆ సమస్యని మరింత జటిలం చేస్తుంది. అలాగే చిన్న చిన్న గొడవలు కి పెద్ద పెద్ద పగలు ప్రతీకారాలు పెంచుకోకండి ఒక చిన్న గొడవ కొన్ని రోజుల తర్వాత అది గొడవలాగే అనిపించదు.
కానీ పగలు, ప్రతీకారాలు మాత్రం మానిపోయిన గాయాలని మళ్ళీ రేపుతూ ఉంటాయి జరిగిపోయిన గొడవలని తవ్వి తీస్తాయి. కాబట్టి తప్పకుండా ప్రస్తుత సమస్యని పరిష్కరించుకోండి. అలాగే మీ గిల్లికజ్జాలలోకి కుటుంబ సభ్యులని లాగకండి. ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు అని వివరించిన ఎవరూ ఊరుకోరు. ఆ కోపంలో మీ కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తే మీరు భరించలేరు.
అప్పుడు సమస్య మరింత జటిలమవుతుంది. ఇలాంటి గొడవలు జరిగినప్పుడే ఎదుటి వాళ్ళ మనసులో తెలుస్తుంది కాబట్టి మన తప్పుని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. కాబట్టి సమస్యని పరిష్కరించుకొని ఎదుటి వాళ్ళ మనసులో మన స్థానాన్ని చేసుకోవచ్చు బంధాన్ని మరింత దగ్గర చేసుకోవచ్చు ఏదైనా ఆలోచన విధానంలోనే ఉంది. బీ హ్యాపీ అండ్ బి పాజిటివ్.