హస్తప్రయోగం వల్ల మొటిమలు అవుతాయా?
హస్తప్రయోగం మంచిది కాదు.. ఇది చెడ్డ అలవాటు అని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఈ హస్తప్రయోగం విషయంలో ఎన్నో అపోహలున్నాయి. ఇలాంటి వాటిలో హస్తప్రయోగం వల్ల మొటిమలు అవుతాయనేది కూడా ఉంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
Female Masturbations
హస్త ప్రయోగం లైంగికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి భాగస్వామితో పనిలేదు. కానీ కొంతమంది హస్త ప్రయోగం గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు. నిజానికి దీనిగురించి జనాలు ఎన్నో అపోహలను నమ్ముతారు. నిజానికి ఒక నిర్దిష్ట పద్ధతి అంటూ ఏం లేదు. చేయాలా? వద్దా? అనేది ఆ వ్యక్తి ఇష్టం, సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే యువతలో దీని గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఒకటి హస్తప్రయోగం చేస్తే మొటిమలు అవుతాయనేది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
హస్త ప్రయోగం అంటే ?
ఇది స్వీయ ఆనందం కలిగించే ప్రక్రియ. దీనిలో జననేంద్రియాలను తాకడం వల్ల లైంగిక అనుభూతి కలుగుతుంది. నియంత్రిత పద్ధతిలో హస్త ప్రయోగం చేస్తే మీ ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. నిజానికి హస్త ప్రయోగం సమయంలో శరీరంలో డోపామైన్, ఎండార్ఫిన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. డోపామైన్ అనేది ఒక న్యూరోట్రాన్స్మిటర్. ఇది శరీరంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడ్ స్వింగ్స్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
masturbating
హస్త ప్రయోగం మొటిమలకు కారణమవుతుందా?
చిన్న వయసులోనే శరీరంలో ఎన్నో మార్పులు రావడం లేదా చెడు ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం వంటివి మొటిమలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. హస్తప్రయోగం వల్ల ముఖంపై మొటిమలు రావడం అనేది కేవలం అపోహ మాత్రమే. హస్త ప్రయోగం నిద్రను మెరుగుపరుస్తుంది. అలాగే ఇది కూడా ఒక రకమైన మూడ్ బూస్టర్ లాగే పనిచేస్తుంది. హస్త ప్రయోగం అనైతికం అని చెప్పడం పూర్తిగా అపోహ. సరైన పద్ధతిలో, పరిశుభ్రతతో చేస్తే ఇది మీ శరీరానికి ఏ విధంగానూ హాని కలిగించదు.
హస్తప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గోర్లు కత్తిరించడం
హస్తప్రయోగానికి ముందు మీ గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. పొడవైన గోర్లు గాయాలకు కారణమవుతాయి. అందుకే మీ గోళ్లను చిన్నగా కట్ చేయాలి. గోర్లు కత్తిరించడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
చేతులు కడుక్కోవడం
లైంగిక అవయవాలను తాకే ముందు దుమ్ము, మురికిగా ఉన్న చేతులను ఖచ్చితంగా కడుక్కోవాలి. దీంతో యోనిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదు. ఏ రకమైన క్రిమి అయినా యోనిలోకి వెళ్లకుండా చేస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల యోని సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది.
మూత్ర విసర్జన చేయడం
హస్త ప్రయోగం తర్వాత మూత్ర పీడనం పెరుగుతుంది. ఇది సర్వసాధారణం. అందుకే హస్తప్రయోగం తర్వాత ఖచ్చితంగా మూత్ర విసర్జన చేయాలి. లేదా సెక్స్ బొమ్మల ద్వారా యోనిలోకి ప్రవేశించిన ఇన్ఫెక్షన్లు ఆటోమేటిక్ గా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీటితో యోనిని శుభ్రం చేసుకోవాలి.