పిల్లల్ని కనాలనుకుంటున్నరా? అయితే ఏడాది ముందు నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోండి
కొన్ని కొన్ని సార్లు చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో ఎన్నో పెద్ద సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు బేబీని ప్లాన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి.
సంతానోత్పత్తి సమస్య ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు, కాయధాన్యాలు, బీన్స్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లు వంటి ఆహారాన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. గర్భధారణకు ముందు, ఆ సమయంలో ఆహారం గర్భంలో ఉన్న శిశువు అభివృద్ధి, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. హెల్తీ డైట్ తో పాటుగా ఇంకా చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సంతానోత్పత్తిని పెంచడానికి, గర్భవతి కావడానికి సహాయపడుతుంది.
Pregnancy Weight
నిపుణుల ప్రకారం.. కొన్ని కొన్ని సార్లు చిన్న సమస్యల వల్ల కూడా గర్భం దాల్చడం ఆలస్యమవుతుంది. గర్భధారణకు ముందు కొన్ని పరీక్షలు చేయించుకోవడం, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, మీ బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. పిల్లల్ని కనాలనుకుంటున్నవారు సంవత్సరం ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
ఫోలిక్ యాసిడ్
చాలాసార్లు ఆడవారు గర్భం కోసం ప్రయత్నించిన ఒక నెలలోనే గర్భవతి అవుతుంటారు. అయితే గర్భనిరోధక మాత్రలను తీసుకునే ఆడవారు.. పిల్లల్ని కనాలనుకుంటే రెండు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ను తీసుకోవాలి. న్యూరల్ ట్యూబ్ లోపాల నుంచి శిశువుకు రక్షణ కల్పించడానికి శరీరంలో ఫోలిక్ ఆమ్లం ఏర్పడటం చాలా అవసరం. గర్భనిరోధక మాత్రలను తీసుకోవడం ఆపివేసిన తర్వాత గర్భం దాల్చిన 12 వారాల వరకు ప్రతిరోజూ 400 ఎంసిజి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గర్భం పొందడానికి సహాయపడటమే కాకుండా తర్వాత ఆరోగ్యానికి కూడా ప్రయోజనంగా ఉంటుంది.
Image: Getty
బరువు నిర్వహణ
నిపుణుల ప్రకారం.. 'బిఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) అనేది ఎత్తు, బరువుకు ఉపయోగించే కొలత. ఇది మీ బరువు సరైనదా కాదా అని గుర్తిస్తుంది. గర్భధారణకు ముందు బిఎమ్ఐ 18.5, 24.9 మధ్య ఉండాలి. బిఎమ్ఐ 25 కంటే ఎక్కువ ఉండటం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. అలాగే గర్భధారణలో సమస్యలొచ్చే ప్రమాదం కూడా ఉంది. బరువు ఎక్కువగా ఉండే పురుషులకు కూడా సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బిఎమ్ఐ 30 కంటే ఎక్కువగా ఉంటేగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. బిఎమ్ఐ 18.5 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
Image: Getty
ప్రిస్క్రిప్షన్ లేని మందులు తీసుకోవద్దు
కొన్నిసార్లు డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం కూడా సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. కొంతమంది మహిళలు తమకు తెలియకుండానే గంజాయి లేదా కొకైన్ వంటి చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది గర్భధారణలో ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అందుకే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకండి.
గర్భాశయ స్క్రీనింగ్ పరీక్ష
ఒక మహిళ 25 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంటే.. ఆమె ప్రతి మూడు సంవత్సరాలకోసారి గర్భాశయ స్క్రీనింగ్ పరీక్షను చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టిప్స్ బెస్ట్. గర్భం పరీక్ష ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. గర్భధారణను ప్లాన్ చేయడానికి ముందు స్క్రీనింగ్ వెంటనే చేయాలా లేదా తర్వాత చేయాలా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
లైంగిక సంక్రమణ వ్యాధి పరీక్షలు
లైంగిక సంక్రమణ వ్యాధులు సంతానోత్పత్తితో పాటుగా గర్భం, శిశువును ప్రభావితం చేస్తాయి. మీకు లేదా మీ భాగస్వామికి ఎస్టీఐ ఉంటే మీ ఇద్దరూ టెస్టులు చేయించుకోవాలి. లైంగిక సంక్రమణ వ్యాధులు గర్భస్రావం లేదా ఆలస్యంగా గర్భ ప్రసవానికి కారణమవుతాయి.