మూత్ర విసర్జన టైంలో భావప్రాప్తి.. ఉద్వేగం టైంలో మూత్రం లీక్.. కారణమిదే..!
చాలా మంది ఆడవారికి, మగవారికి మూత్రవిసర్జన చేసే సమయంలో ఉద్వేగానికి లోనవుతారు. ఇంకొంతమంది ఉద్వేగం సమయంలో మూత్రవిసర్జన చేస్తుంటారు. ఈ రెండింటికీ అసలు కారణాలేంటో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
లైంగిక కార్యకలాపాల సమయంలో ఉద్వేగం చెందడం చాలా సాధారణం. అకస్మత్తుగా లైంగిక కోరికలు కలిగినప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఈ ఫీలింగ్ చాలా మందికి ఆనందాన్ని ఇస్తుంది.
పీగస్మ్ అంటే ఏంటి?
మూత్ర విసర్జన, ఉద్వేగం మధ్య సంబంధాన్ని పీగస్మ్ అంటారు. నిజానికి మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రత్యేకించి మీ మూత్రాశయం మూత్రంతో నిండినప్పుడు. మూత్రవిసర్జన వల్ల రిలాక్డ్ గా అనిపిస్తుంది. అయితే మూత్ర విసర్జన చేసేటప్పుడు ఉద్వేగం సాధారణం కాదని నిపుణులు అంటున్నారు. మూత్రవిసర్జన చేసేటప్పుడు భావప్రాప్తి పొందడం ప్రమాదకరం ఏం కాదని ఆరోగ్య నిపుణులు అంటారు. అయినప్పటీకీ మీరు క్రమం తప్పకుండా ఎక్కువ సేపు మూత్ర విసర్జన చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
frequent urination
మూత్ర విసర్జన చేసేటప్పుడు ఉద్వేగానికి కారణాలు
యూరేత్రల్ స్పాంజ్, క్లిటోరిస్ వంటి ఎరోజెనస్ జోన్లకు వ్యతిరేకంగా మూత్రాశయాన్ని నొక్కినప్పుడు పీగస్మ్ సంభవిస్తుంది. ఇలాంటప్పుడు మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒత్తిడి కలిగి నరాలు ఉత్తేజమవుతాయి. ఇది భావప్రాప్తికి దారితీస్తుంది. మీకు మూత్రవిసర్జన కంటే ముందే లైంగిక కోరికలు ఉంటే.. మూత్ర విసర్జన చేసేటప్పుడుకు కూడా పీగస్మ్ సంభవించొచ్చు. సెక్స్ సమయంలో ఎవరైనా బాత్ రూం కు వెళితే ఇలా జరుగుతుంది. హస్త ప్రయోగం చేసిన వెంటనే మూత్ర విసర్జన చేసినా.. వారి జననేంద్రియాలు ఇంకా సున్నితంగా ఉన్నప్పుడు భావప్రాప్తిని పొందుతారు.
మీ మూత్రాన్ని ఆపడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు
అప్పుడప్పుడు వాష్రూమ్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది కొద్దిసేపు మూత్రాన్ని పట్టి ఉంచుతారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా.. తరచుగా మూత్రాన్ని ఆపడం వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, విస్తరించిన మూత్రాశయం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు దీనివల్ల మీరు ఫ్యూచర్ లో మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. అంటే అనుకోకుండా మూత్రం లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఉద్వేగంలో మూత్ర విసర్జనకు కారణాలు
పీగస్మ్ కు మరొక విధంగా కూడా సంభవించొచ్చు, దీనిలో ఒక వ్యక్తి ఉద్వేగం పొందినప్పుడు అనుకోకుండా మూత్రాన్ని లీక్ చేస్తాడు. అంటే సెక్స్ సమయంలో. దీనికి వైద్య పదమే.. ఉద్వేగం ఆపుకొనలేనిది. భావప్రాప్తి ఆపుకొనలేని సమయంలో మూత్రం లీక్ అవుతుంది. అంటే కొన్ని చుక్కలు పడొచ్చు లేదా అంతకంటే ఎక్కువ మూత్రం లీక్ కావొచ్చు. భావప్రాప్తిని ఆపుకోలేని పరిస్థితికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మూత్ర ఆపుకోలేకపోవడం, మూత్ర మార్గ సంక్రమణకు గురికావడం. యుటిఐ ఉన్నవారికి సెక్స్ సమయంలో పెరిగిన ఉద్రిక్తత వల్ల, ఒత్తిడి వల్ల కొంతమంది భావప్రాప్తికి ముందు లేదా ఆ సమయంలో మూత్రం లీక్ అవుతుంది.
డాక్టర్ ను ఎప్పుడు కలవాలి?
భావప్రాప్తిని అనుభవించడానికి మీరు ఉద్దేశపూర్వకంగా మూత్రాన్ని ఆపితే మీ ఆరోగ్యాన్నిమీరే స్వయంగా ప్రమాదంలో పడేస్తున్నట్టే. ఇలా వారు వైద్యుడిని లేదా సెక్స్-పాజిటివ్ థెరపిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. భావప్రాప్తి సమయంలో క్రమం తప్పకుండా మూత్ర విసర్జన చేసే వ్యక్తులు కూడా దానికి కారణాలేంటో తెలుసుకోవడానికి హాస్పటల్ కు వెళ్లాలి.