Beauty Tips: ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకుంటున్నారా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయకండి!
Beauty Tips: సాధారణంగా వ్యాక్సింగ్ అనేది పార్లర్స్ లో చేయించుకుంటారు. అయితే కాస్త పరిజ్ఞానం ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించవలసి ఉంటుంది. వ్యాక్సింగ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి.
వ్యాక్సిన్ అనేది శరీరంలోని వెంట్రుకలని వదిలించుకోవడానికి సాధారణంగా ఉపయోగించే మార్గాలలో ఒకటి. దీనికోసం చాలామంది పార్లల్స్ కి వెళ్తారు. ఇంట్లోనే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం నైపుణ్యం అవసరం.
వాక్సింగ్ చేసుకునే వాళ్ళు ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే అందమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు వ్యాక్సింగ్ చేయడానికి ముందు శరీరాన్ని ఎక్స్పోలియేట్ చేయటం అవసరం. తర్వాత అన్ వాంటెడ్ హెయిర్ ని కత్తిరించడం అవసరం.
ఎక్స్ఫొలియోట్ చేయడం కోసం పంచదార మరియు ఆలివ్ ఆయిల్ కలిపి సొంత షుగర్ స్క్రబ్ ని తయారు చేసుకోవచ్చు. తర్వాత దానిని వృత్తాకార కదలికలలో చర్మానికి స్క్రబ్ చేయండి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తర్వాత ఎక్కడైతే వ్యాక్సిన్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లీన్ గా జుట్టు లేకుండా షేవ్చేయండి.
ఆ తరువాత వాక్స్ హీటర్ నుంచి చల్లారపరుస్తూ మైనాన్ని వర్తించండి. మైనాన్ని చాలా పల్చని పొరలాగా అప్లై చేయాలి. తర్వాత మీ జుట్టు పెరిగే దిశలో ఒక్కసారిగా మీ చర్మం నుంచి ఆ మైనపు స్ట్రిప్ ని తీసివేయండి. అటువంటి అప్పుడు ఎక్కువ ఒత్తిడి ప్రదర్శించకండి.
ఎందుకంటే చర్మం కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. వెంటనే చర్మం పై మీ అరచేతిని నొక్కి పెట్టండి. అలా మొత్తం బాడీ పార్ట్ కంప్లీట్ అయిన తరువాత ఎక్కడైతే వ్యాక్సింగ్ చేశారో ఆ పార్ట్ మొత్తానికి లోషన్ అప్లై చేయండి దాని వలన చర్మం చల్లబడిన ఫీలింగ్ వస్తుంది.
మీరు ఎక్కడ వ్యాక్సింగ్ చేయాలని అనుకుంటున్నారో అక్కడ అంతా వాక్సింగ్ పూర్తయిన తర్వాత మీ శరీరాన్ని తుడవటానికి వెచ్చని వస్త్రాన్ని ఉపయోగించండి. తరువాత చల్లని గుడ్డతో శరీరాన్ని శుభ్రపరచుకోండి. ఈ వ్యాక్సింగ్ అనేది నెలలో రెండు సార్లు కానీ నెలకి ఒకసారి కానీ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.