Beauty Tips: కెమికల్ హెయిర్ డైస్ వద్దు.. నాచురల్ హెయిర్ డైస్ ముద్దు!
Beauty Tips: చాలామంది తెల్ల జుట్టు కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు జుట్టు నల్లగా కనిపించడం కోసం కంటికి కనిపించిన ప్రతి కెమికల్ హెయిర్ డై వాడతారు. కానీ అది చాలా ప్రమాదం. అందుకే నేచురల్ హెయిర్ డై వాడదాం. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మనం జుట్టుకి తెచ్చే పెద్ద సమస్య ఏమిటంటే కెమికల్ హెయిర్ డై వేయడం. ఆ నిమిషానికి జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ కనిపిస్తుంది కానీ సుదీర్ఘకాలంలో అవి జుట్టుతో పాటు మన ఆరోగ్యానికి కూడా ప్రమాదాన్ని తీసుకువస్తాయి. జుత్తు రంగులో అమోనియం, మోనోఎథనోలమైన్ లేదా ఫ్రీ ఆక్సైడ్ ల వంటి రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి మన జుట్టు క్యూటికల్ లను విచ్చిన్నం చేస్తాయి.
దీనివలన జుట్టు పొడిబారడం, అదే పనిగా జుత్తు రాలిపోవడం, జుట్టు చిట్లి పోవటం వంటి సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే కెమికల్స్ కాకుండా నాచురల్ హెయిర్ డై వాడటం వలన మన జుట్టు మనం కోరుకున్న రంగులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
అలాంటి డై లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ తరిగి కొద్దిగా నీరు పోసి ఒవేన్ లో మెత్తగా అయ్యేవరకు బేక్ చేసి మిక్స్ చేసి వడకట్టి అందులో కాస్త కొబ్బరి నూనె వేయండి. ఇది రంగును మీ జుట్టుకు పట్టించే గంట సేపు అలాగే ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
ఇలా వేసుకున్న డై కొన్ని వారాలపాటు మీ జుట్టుకి సహజమైన రంగుని ఇస్తుంది. అలాగే హెయిర్ డై కోసం కాఫీ మంచి ఎంపిక. నిజానికి కాఫీ హెయిర్ డైలాగ్ పనిచేయటమే కాకుండా జుట్టు యొక్క మూలాలని బలోపేతం చేస్తుంది. దీని వలన జుట్టు పెరుగుదల మెరుగు అవుతుంది.
దీనికోసం మీరు ఎస్ప్రెస్సో వంటి డార్క్ రోస్ట్ ఆర్గానిక్ కాఫీని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాఫీ హెయిర్ డై వేసుకునే ముందు జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలాగే గోరింటాకుతో చాలామంది తలకి హెన్నా పెట్టుకుంటారు. అయితే అదే హెన్నాలో కాస్తంత నీలిమందు పొడిని జోడించడం వలన జుత్తు కి చక్కని నలుపుతో పాటు బలమైన కలరింగ్ ఏజెంట్ గా పనిచేసి సహజమైన రంగుని అందిస్తుంది.