Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • సెక్స్ మధ్యలో కొంతమందికి ఇలా కూడా అనిపిస్తుందట?

సెక్స్ మధ్యలో కొంతమందికి ఇలా కూడా అనిపిస్తుందట?

దూరంగా ఉన్నప్పుడు సిగ్గు, మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. అదే భాగస్వాములు ఒకేదగ్గర ఉంటే ఇలాంటివేమీ ఉండవు. అయితే కొంత మంది భాగస్వాములకు సెక్స్ మధ్యలో కొన్ని వింతలు జరుగుతాయట. అవేంటంటే.. 

Mahesh Rajamoni | Published : May 20 2023, 09:40 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ప్రేమ, సంబంధాలను కొనసాగించడంలో సెక్స్ ముఖ్యమైన కీలకపాత్ర పోషిస్తుంది. కలిసి గడిపే అద్బుతమైన క్షణాలు ఇద్దరికీ సరదాగా ఉండాలి. అప్పుడే ఆ క్షణాన్ని ఆస్వాదించగలుగుతారు. చాలాసార్లు సెక్స్ సమయంలో కొంతమంది జంటలకు కొన్ని విషయాలు కొంత వింతగా మారుతాయి. అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సన్నిహితంగా ఉండటం జస్ట్ శారీరక శ్రమ మాత్రమే కాదని భాగస్వామి పట్ల భావోద్వేగ బంధాన్ని కూడా పెంపొందిస్తుందని సెక్స్ నిపుణులు అంటున్నారు. సెక్స్ సమయంలో జరిగే ఇలాంటి కొన్ని వింత విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

27
Image: Getty

Image: Getty


క్యూఫింగ్ లేదా యోని ఫార్ట్ 

జర్నల్ ఆఫ్ హ్యూమన్ సెక్సువాలిటీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. శరీరంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మలద్వారానికి బదులుగా యోని నుంచి గాలి బయటకు వస్తుంది. దీన్నే క్యూఫింగ్ అంటారు. చాలా మంది ఆడవారు అధిక సాగతీత వ్యాయామాలు లేదా యోగా సెషన్ల సమయంలో యోని వాయువును అనుభవిస్తారు. సంభోగం సమయంలో కూడా క్యూపింగ్ సంభవిస్తుందంటున్నారు నిపుణులు. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇది సాధారణం. సెక్స్ సమయంలో శరీరం చాలా చురుకుగా ఉంటుంది. దీనికి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. 
 

37
Asianet Image

మధ్యలో అకస్మాత్తుగా అలసట

జర్నల్ ఆఫ్ సెక్సువల్ రీసెర్చ్ లో ప్రచురితమైన పరిశోధన ఫలితాల ప్రకారం.. సెక్స్ శరీరాన్ని చాలా చురుగ్గా చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును కూడా  పెంచుతుంది. మీరు ఎక్కువ ఆందోళనకు గురైనప్పుడు అలసిపోయినట్టుగా అనిపించడం సహజం. అయితే మీరు సెక్స్ గురించి అంత చురుగ్గా లేకపోతే సెక్స్ సమయంలో అలసిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. కొంతమంది తాము శృంగారంలో బాగా లేమని సిగ్గుపడొచ్చు. ఇలా అస్సలు అనుకోవద్దు. ఆరంభం నెమ్మదిగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాసేపు ఆగి శ్వాస తీసుకోండి. ఆ తర్వాత ప్రారంభించండి. ఇది ఎవరికైనా రావొచ్చు.
 

47
Asianet Image

శరీరానికి మద్దతు ఇవ్వకపోవడం

జర్నల్ ఆఫ్ సెక్సువల్ రీసెర్చ్ ప్రకారం.. ఒకరు సెక్స్ లో మూడ్ లో ఉన్నంత మాత్రాన భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం మంచిది కాదు. అవతలి వ్యక్తి కూడా అదే మూడ్ లో ఉంటేనే సెక్స్ ను ఎంంజాయ్ చేస్తారు. వారిని పట్టించుకోకుండా సెక్స్ లో పాల్గొంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీ భాగస్వామికి చెప్పడానికి సిగ్గు పడకండి. మీ భాగస్వామిని విశ్రాంతి తీసుకోనివ్వండి. శృంగారానికి బదులు ఒకరినొకరు కౌగిలించుకోండి. కొన్నిసార్లు శరీరం వ్యక్తి కోరుకున్న విధంగా స్పందించదు. ఈ క్షణాన్ని వదిలేసి మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించడం మంచిది.
 

57
Asianet Image


కడుపు నొప్పి లేదా వాంతులు

కాంటెంపరరీ సెక్సువాలిటీ జర్నల్ ప్రకారం.. తీవ్రమైన వ్యాయామ సెషన్ సమయంలో శరీరం నుంచి కొంత వాయువు విడుదల కావడం చాలా సహజం. ఒక్కోసారి సెక్స్ మధ్యలో కడుపు నుంచి వింత శబ్దాలు వస్తుంటాయి. కానీ వీటితో సంబంధం లేకుండా మీరు ముందుకు సాగకూడదు. ఎందుకంటే ఇవి వాంతులకు, మోషన్స్ కు సంకేతం కావొచ్చు. ఇది చాలా సాధారణమైన విషయం. రతిక్రీడ సమయంలో అలసట ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పండి. 
 

67
Asianet Image

పొడిబారడం

జర్నల్ ఆఫ్ స్టడీస్ ఇన్ జెండర్ అండ్ సెక్సువాలిటీ ప్రకారం.. సెక్స్ సమయంలో శరీరం కింద తడిగా అనిపించడం చాలా సాధారణం. చాలా మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతుంటారు. దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తడిగా అనిపించడం అంటే మీ లైంగిక కోరిక నెరవేరుతుందని అర్థం. ఆనందాన్ని అనుభవిస్తున్నారని అర్థం. ఒక్కోసారి చాలా తడిగా అనిపించడం హార్మోన్ల మార్పుల వల్ల కూడా కావొచ్చు.

77
Asianet Image

లూబ్రికేషన్ లేకపోవడం

కొన్నిసార్లు లూబ్రికేషన్ కూడా సరిగ్గా ఉండదు. శరీరం మార్పులకు లోనవుతుంటే ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి కందెనలను ఉపయోగించడం మంచిది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ అసౌకర్యానికి గురికాకుండా ఆందోళన చెందకుండా శృంగారాన్ని ఆస్వాదించండి.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories