Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • సెక్స్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

సెక్స్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

రతిక్రీడను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే దీనితో ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ చాలా మందికి సెక్స్ లో ఎప్పుడు పాల్గొనాలి? ఎప్పుడు పాల్గొనకూడదో తెలియదు. దీనివల్లే లేనిపోని సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.  

Mahesh Rajamoni | Published : Apr 10 2023, 09:36 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

రతిక్రీడ అనేది మానవ జీవితంలో ఒక ఆరోగ్యకరమైన అంశం.  అందుకే దీనిపై అందరికీ తగినంత అవగాహన ఉండాలి. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతుంటారు. సెక్స్ విషయానికొస్తే చేయవలసినవి, చేయకూడనివి చాలానే ఉన్నాయి. ఈ నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సెక్స్ విషయంలో చాలా మందికి తెలియని విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
Asianet Image

బికినీ వ్యాక్స్ తో శృంగారం

బికినీ వ్యాక్స్ తర్వాత వెంటనే సెక్స్ లో పాల్గొనడం అస్సలు మంచిది కాదు. ఈ వ్యాక్స్ వల్ల జననేంద్రియాల చుట్టూ ఉన్న ప్రాంతం మరింత సున్నితంగా మారుతుంది. అలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొనడం మరింత హాని కలుగుతుంది. సెక్స్ తో మీకు మంచి అనుభూతి కలిగినా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బికినీ వ్యాక్స్ తర్వాత వెంటనే సెక్స్ లో పాల్గొనకూడదు. ఒకరోజు తర్వాత మాత్రమే మీరు సెక్స్ లో పాల్గొనాలి. ఇది మీ చర్మం నయం కావడానికి సహాయపడుతుంది. 

36
Asianet Image

అప్పుడే బిడ్డకు జన్మనిచ్చి సెక్స్ లో పాల్గొనడం

అప్పుడే బిడ్డ పుట్టిన తర్వాత కూడా సెక్స్ లో పాల్గొనకూడదు. చాలా మంది వైద్యుల ప్రకారం.. బిడ్డ పుట్టిన ఒక నెల లేదా రెండు నెలల వరకు సెక్స్ లో పాల్గొనకూడదు. అయితే దీనిపై మరింత క్లారిటీ కోసం మీ వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రసవం, సెక్స్ మధ్య గ్యాప్ ఉంటేనే మీ శరీరం ప్రసవం నుంచి తొందరగా కోలుకుంటుంది. 
 

46
Asianet Image

యూటీఐ నుంచి కోలుకుంటున్నప్పుడు సెక్స్ 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా మహిళలకే ఎక్కువగా వస్తాయి. అయితే మీకు ఈ మధ్యకాలంలో ఈ ఇన్ఫెక్షన్ సోకి దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నట్టైతే.. మీరు మరిన్ని రోజులు సెక్స్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. మీకు ఇన్ఫెక్షన్ లేదని అనిపించినా.. మీ శరీరంలో వ్యాధికారక అవశేషాలు ఉండొచ్చు, ఇవి మీ భాగస్వామికి సోకుతాయి. అందుకే యూటీఐ నుంచి కోలుకున్న వెంటనే సెక్స్ లో పాల్గొనకూడదు. 

56
Asianet Image

గర్భధారణ సమయంలో సెక్స్ 

ప్రెగ్నెన్సీ టైంలో కూడా సెక్స్ లో పాల్గొనొచ్చు. దీనిలో వైద్యపరంగా కూడా తప్పు లేదు. అందుకే చాలా మంది జంటలు ప్రెగ్నెన్సీలో కూడా సెక్స్ లో పాల్గొంటారు. అయినప్పటికీ గర్భాశయం, మావి, లైంగిక సంక్రమణ వ్యాధుల చరిత్ర వంటి అనేక అంశాలు పిండానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ లో పాల్గొనాలనుకుంటే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
 

66
Asianet Image

రక్షణ లేకుండా శృంగారం

కండోమ్ వంటి మంచి రక్షణ లేకపోతే శృంగారంలో పాల్గొనకండి. ఎందుకంటే ఈ కండోమ్లు అవాంఛిత గర్భం నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా అసురక్షిత సెక్స్  వల్ల కలిగే లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాల్ని కూడా తగ్గిస్తాయి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories