MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గ్రహణం సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది

గ్రహణం సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది

solar eclipse 2023:  ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఏర్పడనుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. అయితే ఈ సూర్యగ్రహణం ఇతర దేశాల్లో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణాన్ని చూడాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
 

R Shivallela | Published : Oct 12 2023, 11:11 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

solar eclipse 2023: ఈ ఏడాది అక్టోబర్ 15న నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నవరాత్రులకు ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 14వ తేదీనా శనివారం సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇది రెండో సూర్యగ్రహణం. 
 

26
Asianet Image

భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు.. సూర్యరశ్మి భూమిని చేరదు. దీనినే సూర్య గ్రహణం అంటారు. నమ్మకాల ప్రకారం.. గ్రహణం ఏర్పడటాన్ని శుభప్రదంగా భావించరు. ఈ ఏడాది ఏర్పడే  రెండో సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు.  ఈ గ్రహణం ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడా, అర్జెంటీనా తదితర దేశాల్లో కనిపిస్తుంది.
 

36
Asianet Image

ఈ ఖగోళ ఘట్టాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి భద్రత లేకుండా నేరుగా కంటితో చూడటం మంచిది కాదు. దీనివల్ల కంటిచూపు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కంటిచూపు శాశ్వతంగా పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే గ్రహణాన్ని చూడాలనుకుంటే కంటికి రక్షణను పెట్టుకోవాలి. 
 

46
Asianet Image


సూర్యగ్రహణం సమయంలో గుర్తుంచుకోవాల్సి విషయాలు 

బైనాక్యులర్ లను ఉపయోగించండి

గ్రహణం సమయంలో సూర్యరశ్మి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మన కంటి రెటీనాను దెబ్బతీస్తుంది. అందుకే గ్రహణాన్ని చూస్తున్నప్పుడు కళ్లను రక్షించడం చాలా ముఖ్యం. గ్రహణాన్ని చూడటానికి మీరు టెలిస్కోప్ లేదా కెమెరాను కూడా ఉపయోగించొచ్చు.

56
Asianet Image

వీటిని ఉపయోగించొద్దు

అయితే గ్రహణాలను చూడటానికి చాలా మంది ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి కళ్లను రక్షించలేవు. ఇది మీ కళ్లకు ఎంతో హాని కలిగిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లు లేదా తాత్కాలిక ఉపకరణాలను ఎప్పుడూ ఉపయోగించకండి. గ్రహణం చూడటానికి సన్ గ్లాసెస్ ను కూడా వాడకూడదు.
 

66
Asianet Image

చర్మం జాగ్రత్త

గ్రహణం సమయంలో ఎక్కువ సేపు బయట ఉంటే సూర్యుని హానికరమైన కిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అలాగే గ్రహణం సమయంలో పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టకూడదు.

R Shivallela
About the Author
R Shivallela
 
Recommended Stories
Top Stories