Perfume Usage: వీళ్లు పెర్ఫ్యూమ్ అస్సలు వాడకూడదు?
Perfume Usage: మనలో చాలామంది రెగ్యులర్‌గా పెర్ఫ్యూమ్ వాడుతుంటాం కదా. కొంతమంది చెమట వాసనను కవర్ చేయడానికి ఉపయోగిస్తే, మరికొందరు సువాసన కోసం వాడతారు. కానీ పెర్ఫ్యూమ్ అందరికీ సెట్ అవ్వదు. కొంతమంది పెర్ఫ్యూమ్ అస్సలు వాడకూడదట. ఎవరు వాడకూడదు, దానికి కారణాలు ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
చాలామంది చాలా రకాల పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. మంచి వాసన వచ్చే వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇవి రోజంతా శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. చెమట వాసన బయటకు రాకుండా అడ్డుకుంటాయి. కొంతమంది అయితే అసలు పెర్ఫ్యూమ్ లేకుండా బయటకు వెళ్లరు.
పెర్ఫ్యూమ్ ఎంత మంచి వాసన వేసినా, కొంతమంది దీన్ని అస్సలు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరు వాడకూడదు? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు..
ఆస్తమా లేదా శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు పెర్ఫ్యూమ్ వాడకూడదు. వాడాలనిపిస్తే ఎక్కువ తక్కువ ఘాటు ఉన్నవి వాడటం మంచిది.
గర్భిణులు..
పెర్ఫ్యూమ్‌లో ఉండే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇవి గర్భిణులకు మంచిది కాదు. ఇది తలనొప్పి, వికారం కలిగిస్తాయి. కాబట్టి గర్భిణులు సెంట్ వాడకపోవడం మంచిది.
చర్మ సమస్యలు ఉన్నవాళ్లు..
పెర్ఫ్యూమ్‌లో ఆల్కహాల్ ఉంటుంది. అందువల్ల చర్మ సమస్యలు ఉన్నవాళ్లు పెర్ఫ్యూమ్ వాడకపోవడమే మంచిది. లేదంటే దురద, మంట లాంటి చర్మ సమస్యలు వస్తాయి.
చిన్న పిల్లలు..
చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. పెర్ఫ్యూమ్ చర్మ సమస్యలు కలిగిస్తుంది. శ్వాస సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి పిల్లలకు పెర్ఫ్యూమ్ కొట్టడం మంచిది కాదు.
తలనొప్పి ఉన్నవాళ్లు
తలనొప్పి ఉంటే పెర్ఫ్యూమ్ వాడొద్దు. దీని వల్ల తలనొప్పి ఎక్కువ అవుతుంది. వికారం, తల తిరగడం లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.
ఎండలో ఎక్కువ సేపు ఉండేవారు
పెర్ఫ్యూమ్‌లో ఉండే కొన్ని కెమికల్స్ ఎండలో ఎక్కువ సేపు ఉండే వారికి రియాక్ట్ అవుతాయి. చర్మం దురద, రంగు మారడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.