MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mothers Day Gift Ideas: మదర్స్ డే నాడు అమ్మకు ఇలాంటి గిఫ్ట్ ఇస్తే.. చాలా సంతోషిస్తుంది!

Mothers Day Gift Ideas: మదర్స్ డే నాడు అమ్మకు ఇలాంటి గిఫ్ట్ ఇస్తే.. చాలా సంతోషిస్తుంది!

తల్లి ప్రేమకు, త్యాగాలకు ప్రతీకగా.. ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మదర్స్ డేని జరుపుకుంటారు. ఈ సందర్భంగా పిల్లలు.. అమ్మకు ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటారు. మరి అమ్మకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? ఏం ఇస్తే అమ్మ సంతోష పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : May 10 2025, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అమ్మ... తన కోసం ఎప్పుడూ బహుమతి అడగదు. కానీ మనం ఆమె స్వభావాన్ని అర్థం చేసుకుని కస్టమైజ్డ్ బహుమతులు ఇస్తే చాలా సంతోషిస్తుంది. బహుమతులను మీరే తయారు చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేయవచ్చు. ఉదాహరణకు మగ్ కప్ తీసుకుని "Best Mom Ever" అని రాయవచ్చు. అమ్మకు ఇష్టమైన ఫ్యామిలీ ఫోటోలను చేర్చి ఫ్రేమ్ చేసి ఇవ్వవచ్చు. ప్రత్యేక సందేశం ఉన్న టీ షర్ట్ ఇవ్వవచ్చు. టీ షర్ట్ మీద "Super Mom", "My First Friend లాంటివి రాయించవచ్చు. అమ్మ పేరు లేదా సందేశంతో కూడిన కస్టమైజ్డ్ పర్సనల్ డైరీ లేదా నోట్‌బుక్ కూడా ఇవ్వవచ్చు. గ్రీటింగ్ కార్డ్ అనేది ఎప్పటికీ ఉండే బహుమతి. మీ చేతిరాతతో గ్రీటింగ్ కార్డ్ మీద ఏదైనా రాసి ప్రేమను వ్యక్తపరచవచ్చు. 

27
ట్రిప్ కి తీసుకెళ్లచ్చు..

ట్రిప్ కి తీసుకెళ్లచ్చు..

అమ్మ ఎక్కడికైనా వెళ్లాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉంటుంది. దానికి ఇదే సరైన సందర్భం. అమ్మకు ఇష్టమైన ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి. అమ్మకు ఏమీ చెప్పకుండా సర్‌ప్రైజ్‌గా తీసుకెళ్తే ఇంకా సంతోషిస్తుంది. అంతేకాదు, రోజంతా ఇల్లు-ఆఫీస్ పనులతో అలసిపోయిన వారికి ఇది విశ్రాంతి తీసుకునే సమయం. 

Related Articles

Related image1
మదర్స్ డేకి మీ అమ్మకు నచ్చేలా ఈ బహుమతి ఇవ్వండి
Related image2
Gold Earrings: మదర్స్ డేకి అమ్మకు ఈ బంగారు కమ్మలు గిఫ్ట్ గా ఇవ్వండి!
37
మొబైల్ హోల్డర్..

మొబైల్ హోల్డర్..

అమ్మ ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడుతుంటే.. దాన్ని సురక్షితంగా తీసుకెళ్లడానికి మంచి మొబైల్ హోల్డర్ పర్స్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది అందంగా ఉండటమే కాకుండా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. వాకింగ్, మార్కెట్ ఇలా ఎక్కడికైనా అమ్మ సులభంగా తీసుకెళ్లవచ్చు. 

47
ఇష్టమైన సినిమా..

ఇష్టమైన సినిమా..

సీరియల్స్ ఇష్టపడే అమ్మలు సినిమా చూడకుండా ఉంటారా? అమ్మకు ఇష్టమైన సినిమా టికెట్ బుక్ చేయండి. లేదా ఇంట్లో సినిమా సెట్ చేసి అమ్మకు ఇష్టమైన స్నాక్స్ తయారు చేసి ఇవ్వండి.

57
మేకప్ కిట్..

మేకప్ కిట్..

అమ్మ ఎంత సింపుల్ గా ఉన్నా.. క్రీమ్, పౌడర్ లేకుండా ఉండరు. ఎక్కువ మేకప్ వేసుకోని అమ్మలైతే మంచి నాణ్యమైన సహజ క్రీమ్, షాంపూ, పౌడర్ కొనివ్వండి. మేకప్ ఇష్టపడేవారైతే లిప్‌స్టిక్, క్రీమ్, ఐలైనర్ వంటి మంచి నాణ్యమైన సౌందర్య సాధనాలు అమ్మకు ఎంతో ఆనందాన్నిస్తాయి. బ్రాండ్‌ను బట్టి ఎంచుకోండి.

67
వంట చేయండి

వంట చేయండి

ఇంట్లో అమ్మ ఎప్పుడూ వంట చేస్తుంటుంది. ఈ మాతృదినోత్సవం రోజున, అమ్మకు వంటింటి నుంచి సెలవు ఇచ్చి, టీవీ లేదా సినిమా చూడనివ్వండి. అమ్మకు ఇష్టమైన వంటకం తయారు చేసి వడ్డించండి. పిల్లలు ప్రేమతో చేసిన వంటను అమ్మ ఆనందంగా స్వీకరిస్తుంది. 

77
సారీస్ గిఫ్ట్ ఇవ్వండి

సారీస్ గిఫ్ట్ ఇవ్వండి

అమ్మ దగ్గర ఎన్ని చీరలు ఉన్నా తక్కువే. అందుకే మీ అమ్మకు ఏ డిజైన్, కలర్ ఇష్టమో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలియకపోతే నాన్ననైనా అడిగి తెలుసుకోండి. సాధారణంగా అమ్మలకు కాటన్ లేదా సిల్క్ చీరలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మీరు దీన్ని బహుమతిగా ఇస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. వీలైనంత వరకు అమ్మకు ఇష్టమైన రంగు, మంచి నాణ్యత గల చీరను బహుమతిగా ఇవ్వండి.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
బంధుత్వం
ఫ్యాషన్
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Marathi Mangalsutra: అదిరిపోయే లాంగ్ మరాఠీ మంగళసూత్రాలు
Recommended image2
Curd Rice : ఎండాకాలంలో చల్లచల్లని పెరుగన్నం... హోటల్ టేస్ట్ రావాలంటే ఇలా చేయండి..!
Recommended image3
Fruits at night: రాత్రిపూట ఈ పండ్లు తినకూడదని తెలుసా?
Related Stories
Recommended image1
మదర్స్ డేకి మీ అమ్మకు నచ్చేలా ఈ బహుమతి ఇవ్వండి
Recommended image2
Gold Earrings: మదర్స్ డేకి అమ్మకు ఈ బంగారు కమ్మలు గిఫ్ట్ గా ఇవ్వండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved