రతిక్రీడలో ఇది తెలియదా: ఇలా చేస్తే పడకగదిలో రెచ్చిపోవడమే...
పడక గదిలో రెచ్చిపోవడానికి రోల్ ప్లే బాగా పనికి వస్తుంది. ఇలా చేస్తే మీరు మీ భాగస్వామితో పూర్తిస్థాయిలో శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.
సెక్సువల్ ఫాంటసీలను చాలా మంది తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటారు. శృంగార క్రీడలో రోల్ ప్లే అనేది అత్యంత ఆస్వాదనీయమైంది. పడక గదిలో రెచ్చిపోవడానికి రోల్ ప్లే బాగా పనికి వస్తుంది. అది ఎలా చేయాలనే విషయం మీకు తెలియపోవచ్చు, కానీ తలుచుకుంటే కష్టమేమీ కాదు. ఇలా చేస్తే మీరు మీ భాగస్వామితో పూర్తిస్థాయిలో శృంగారాన్ని ఆస్వాదించవచ్చు.
ముందుకు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కువ ఆలోచించకూడదనేది. నిజ జీవితంలో మీకు తెలిసిన దానితోనో, పాప్ కల్చర్ లో చూసినదానితోనో ప్రారంభించండి. తలబద్దలు కొట్టుకోకుండా మీకు తెలిసినదానితో ప్రారంభిస్తే చాలా సుఖంగా ముందుకు సాగగలరు.
రోల్ ప్లే సాధారణంగా ఇంట్లో చేయడం సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో మిగతావాళ్లు ఎవరూ లేనప్పుడు మీరిద్దరే ఉంటారు కాబట్టి అది చాలా సుఖంగా, సౌకర్యంగా ఉంటుంది. ఒత్తిడి ఉండదు. సాధారణంగా ఇంట్లో మీరు ధరించే దుస్తులే ధరించవచ్చు.. చొక్కా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కొద్దిపాటి వస్త్రధారణ రోల్ ప్లేకు బాగా ఉపయోగపడుతుంది.
రోల్ ప్లే కోసం మీరు మాట్లాడదలుచుకున్నది తట్టనప్పుడు ముందుగానే కొన్ని మాటలను నేర్చుకుని ఉండండి. మీరు, మీ భాగస్వామి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు సాగితే బాగుంటుంది. మీరు చెప్పదలుచుకున్న విషయం తట్టకపోయినా మీ భాగస్వామితో సంభాషణ సాగిస్తే అందులోంచే సంభాషణ పెరుగుతుంది.
మీరు చెప్పదలుచుకున్న విషయంపై అయోమయానికి గురైనప్పుడు మృదువుగా నవ్వడం చేయండి. రోల్ ప్లే మీ ఇద్దరి కోసమేనని గుర్తుంచుకోవడం అవసరం.. ప్రేక్షకులు ఉండరు మీరేమీ నటించక్కర్లేదు. సజావుగా ముందుకు సాగడానికి ఏది అవసరమో అంత వరకే మాట్లాడండి. రిలాక్స్ కావడం ద్వారా మూడ్ లోకి వెళ్లిపోవచ్చు.
ముగ్గులోకి దిగిన తర్వాత రతిక్రీడను చెడగొట్టుకోకపోవడం చాలా ముఖ్యం. ప్రతికూల విషయాలను అంటే నెగెటివ్ అంశాలను పక్కన పెట్టి సానుకూల అంశాల మీదనే దృష్టి పెట్టండి. మాటల ద్వారా ఒకరినొకరు బాధపెట్టుకుంటే మొత్తం వ్యవహారం చెడిపోతుంది.