MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గంధంతో తళుక్కుమనే అందం మీ సొంతం.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?

గంధంతో తళుక్కుమనే అందం మీ సొంతం.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?

గంధాన్ని ఎన్నో ఏండ్ల నుంచి మన చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ముఖానికే కాదు.. చేతులు, కాళ్లు వంటి శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఉపయోగించొచ్చు. దీనిలో ఉండే ఔషద గుణాలు మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తాయి. 
 

Shivaleela Rajamoni | Published : Dec 01 2023, 04:40 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Image: FreePik

Image: FreePik

గంధం పొడిని చర్మాన్ని అందంగా మార్చడానికి ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి అమ్మమ్మలు చాలాసార్లు చెప్పే ఉండొచ్చు. కానీ ఈ బ్యూటీ సీక్రెట్స్ గురించి మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి గంధం పొడి మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి మనం ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే దీనిని ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. గంధం పొడిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27
Image: Getty

Image: Getty

మొటిమలను తగ్గిస్తుంది

గంధం పొడిని ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే గంధంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను పెరగనివ్వదు. ఫలితంగా మొటిమలు ఏర్పడవు. గంధం మొటిమల వల్ల కలిగే మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మీరు మొటిమలతో ఇబ్బంది పెడుతుంటే గంధం ఫేస్ ప్యాక్ ను ఉపయోగించండి. 

37
Image: Getty Images

Image: Getty Images

వడదెబ్బకు చికిత్స

వడదెబ్బ వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. అలాగే చర్మంపై దద్దుర్లే ఏర్పడతాయి. ఇలాంటి వారికి గంధం పొడి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గంధం పొడి చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది చర్మపు చికాకును, దద్దుర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. గంధం మీ చర్మానికి ఎలాంటి హాని చేయదు. కాబట్టి మీరు సురక్షితంగా ఉపయోగించొచ్చు. 
 

47
Asianet Image

యాంటీ ఏజింగ్ గుణాలు

కాలుష్యం, వయస్సు వల్ల కలిగే వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి కూడా గంధం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గంధం పొడి మన చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముడతలు తగ్గిపోతాయి. 
 

57
sandal powder

sandal powder

ముఖాన్ని మెరుగుపరుస్తుంది

గంధంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం డల్ నెస్ ను తగ్గిస్తాయి. అలాగే గంధం పొడి చర్మంపై ఉన్న మచ్చలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. గంధాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. 
 

67
Asianet Image

ఫేషియల్ ఆయిల్ ను తగ్గిస్తుంది

గంధం పొడిని ఉపయోగించి చర్మంలోని అదనపు నూనెను తగ్గించుకోవచ్చు.  దీంతో మొటిమలు కూడా తొందరగా తగ్గుతాయి. అలాగే గంధం మన చర్మాన్ని పొడిబారనియ్యదు.  అందుకే దీన్ని అన్ని రకాల చర్మం వారు ఉపయోగించొచ్చు. 
 

77
Asianet Image

మచ్చలను తగ్గిస్తుంది

గంధం చర్మం కొల్లాజెన్ ను పెంచుతుంది. ఇది చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో స్కిన్ టోన్ కూడా మెరుగ్గా కనిపిస్తుంది. ఇందుకోసం గంధం పొడిని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి.

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
సౌందర్యం
 
Recommended Stories
Top Stories