Recipes: రుచికరమైన నీర్ దోశ .. రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇక ఇంట్లోనే?
Recipes: కర్ణాటకలోని ఎక్కువగా ఈ నీర్ దోశ ఉపయోగిస్తారు. ఆంధ్రాలో కూడా విరివిగా ఉపయోగించే ఈ దోశని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం.
నీర్ దోశ ని కర్ణాటకలో ఎక్కువగా వాడుతారు. మామూలు దోసెల్లాగా దీనికి పిండిని పులియ పెట్టవలసిన అవసరం లేదు. ఈ దోసని తయారు చేయటానికి ముందుగా నాలుగు నుంచి ఎనిమిది గంటల ముందు బియ్యాన్ని నానబెట్టాలి ఆపై ఆ బియ్యాన్ని రుబ్బుకొని సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి.
మామూలు దోసెల కన్నా ఈ దోసెలకి నీరు ఎక్కువగా పడుతుంది. పిండి పల్చటి మధ్య గలగా ఉండాలి స్థిరత్వానికి తీసుకురావడానికి అవసరమైన అంత ఎక్కువ నీరు జోడించండి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని పెనం వేడి చేసి కొన్ని చుక్కల నూనె వేయండి.
ఉల్లిపాయ ముక్కను ఉపయోగించి పెనం మీద నూనె రాయటం వలన దోస చక్కగా వస్తుంది. ప్రతి దోసె వేయటానికి ముందు ఉల్లిపాయ ముక్కతో పెనం మీద రుద్దండి. పెనం వేడెక్కిన తరువాత కలిపి పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలపండి.
ఎందుకంటే నీరు పైకి తేలిపోయి ముద్ద కిందకి ఉండిపోతుంది కాబట్టి దోశ వేసిన ప్రతిసారి రవ్వ దోశ మాదిరిగా పిండిని పైకి కిందకి కదపటం వల్ల సరైన పరిమాణంలోకి వస్తుంది ఇప్పుడు ఒక గరిటెనుండిగా పిండిని తీసుకొని పాన్ అంచు నుంచి మొదలుకొని పెనం మీద పోయడం ప్రారంభించండి. ఆకారం గురించి పెద్దగా ఇబ్బంది పడకండి.
ఎందుకంటే మొదటిసారి వేస్తూనే గుండ్రంగా రావాలి అంటే ఈ దోశలతో కష్టమే కాబట్టి కొంచెం టైం పడుతుంది. పెనం మీద పిండి వేసి పల్చగా జరిపిన తరువాత దానిమీద మూత పెట్టి అధిక వేడి మీద రెండు నిమిషాలు ఉడికించండి. దోస పూర్తయినప్పుడు పెనం నుంచి అంచులు కొద్దిగా విడిచిపెట్టినట్లుగా అవుతుంది.
అప్పుడు దోసెని మడవకుండా తీసి ప్లేట్లో పెట్టండి అంతేగాని తిరగేసి మళ్ళీ పెనం మీద కాల్చకండి. వేడిగా ఉన్నప్పుడే దోశని మడవటం వలన ముద్దగా అంటుకుపోతుంది కాబట్టి ఎలా ఉన్నదో అని అలాగే ప్లేట్ లో పెట్టండి. ఈ దోశలకి కొబ్బరి చెట్ని మరింత రుచిని తీసుకువస్తుంది.